The financial community
-
కేంద్రంనిధులకూకొర్రీ
పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అందులో 25 శాతం జెడ్పీకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రం వాటా ఇవ్వకపోగా కేంద్రం గ్రాంటునూ గుంజుకోవడంపై సర్పంచుల గగ్గోలు అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీలకు మరింత కష్టకాలం వచ్చిపడింది. నిధులు లేక, సమస్యలు పరిష్కారం కాక సతమతమవుతున్న పంచాయతీలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మంజూరు చేసిన నిధులనూ నిర్దాక్షిణ్యంగా లాక్కుంటోంది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు. మచిలీపట్నం : జిల్లాలోని 970 పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.37.65 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తలసరి గ్రాంటుగా ఒక్కొక్కరికి రూ.400 విడుదల చేయాల్సి ఉండగా మొదటి విడతలో రూ.129, రెండో విడతలో రూ.128 ఇచ్చింది. జిల్లాకు పూర్తిగా 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పంచాయతీలలో ప్రాధాన్యత క్రమంలో పనులు చేసేందుకు స్మార్ట్ విలేజ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించారు. ఈ నిధులతో పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులివ్వకపోగా.. కేంద్రం ఇచ్చే ఈ నిధులతో అభివృద్ధి పనులు చేయాలని భావిస్తున్న సర్పంచులు, అధికారుల ఆలోచనలపై నీళ్లు చల్లుతోంది. విద్యుత్, తాగునీటి సరఫరాబిల్లులను చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భారాన్ని మీరే మోయాలంటూ పంచాయతీలకు హుకుం జారీ చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో సర్పంచులు, అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. 25 శాతం నిధులు జెడ్పీకి జమ చేయాలని ఆదేశాలు... కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తలసరి గ్రాంటును గతంలో ప్రభుత్వ ఖాతాకు జమ చేసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను పక్కదారి పట్టిస్తోందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే జమ చే స్తోంది. జిల్లాలోని పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు రూ.37.65 కోట్లు విడుదల కాగా ఆయా సబ్‌ట్రెజరీల ద్వారా పంచాయతీల ఖాతాల్లో ఈ నగదు జమ చేశారు. ఈ నిధులను పంచాయతీలు వాడుకోకుండా ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ఈ నిధుల్లో 25 శాతం జిల్లా పరిషత్ సీఈవో ఖాతాకు జమ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అన్ని పంచాయతీల కార్యదర్శులు, ఈవోలకు సెల్‌ఫోన్ మెసేజ్ పంపారు. మండిపడుతున్న సర్పంచులు... రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులే ఇవ్వకుండా, విద్యుత్, తాగునీటి బిల్లులు చెల్లించకుండా.. కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి 25 శాతం గుంజుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మైనర్ పంచాయతీల పరిస్థితి మరీ దయనీయం. అసలే అత్తెసరు ఆదాయంతో సతమతమయ్యే మైనర్ పంచాయతీలను కూడా వదలకపోవడంతో ఆయా సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలకు సైతం పంచాయతీ నిధుల నుంచే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయించారని, అంతటితో ఆగక అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యుత్ బిల్లులను కూడా పంచాయతీలే చెల్లించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారని వాపోతున్నారు. -
దారి దోపిడీ
సిమెంటు రోడ్లు, డ్రైనేజీల్లో నాణ్యతకు తిలోదకాలు టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు వాటాలు పీఆర్ అధికారులకు 8, జెడ్పీటీసీలకు 2 శాతం.. ఉపాధి, పంచాయతీ అధికారులకూ.. విశాఖపట్నం : జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న సీసీ రోడ్లు టీడీపీ ప్రజాప్రతినిధులు.. అధికారులకు కామధేనువుల్లా మా రాయి. ఈ పనుల ద్వారా జే బులు నింపుకోవడమే పని గా పెట్టుకున్నారు. నాకిం త.. నీకింత అంటూ పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా 120 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 87 కిలోమీటర్ల డ్రైన్లు నిర్మించాలి. వీటిని పంచాయతీ సర్పంచ్‌లకు అప్పగించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఉన్న చోట వారే చేపట్టగా, ప్రతిపక్ష సర్పంచ్‌లున్న చోట స్థానిక టీడీపీ ఎంపీటీసీలు ఈ పనులు చేపడుతున్నారు. పనులన్నీ రూ.ఐదేసి లక్షల చొప్పున విభజించి నామినేషన్ పద్ధతిలో వారికి కట్టబెట్టారు. నాణ్యత పాటించాల్సిందే.. ఎం-30 స్టాండర్డ్ (ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక) విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో కానీ, వాటర్ ప్యూరింగ్‌లో కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. లక్షకు 25 వేల చొప్పున కోత విధించడమే కాకుండా ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 43 కిలోమీటర్ల సీసీ రోడ్లకు సంబంధించి 120 పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు కూడా జరిగిపోయాయి. అంతా పర్సంటేజీల మయం నిబంధనలను కచ్చితంగా పాటిస్తే 20 శాతానికి మించి లాభం వచ్చే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. ప్రతి పనిలోనూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్చార్జిల పేరిట 5 శాతం, జెడ్పీ చైర్పర్సన్ పేరిట ఐదు శాతం, జెడ్పీటీసీల పేరిట రెండు శాతం నిధులు పక్కనపెడుతున్నారు. పనులు పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు గతంలో మాదిరిగా 8 శాతం వాటా తీసుకుంటున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. డ్వామా, పంచాయతీ అధికారులకు మాత్రం పనివిలువను ఒకటినుంచి రెండు శాతం నిధులను ముట్టజెప్పాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇక తమకు మిగిలేదేమిటని ప్రశ్నిస్తున్నారు. నాణ్యతపై ప్రభావం పర్సంటేజీల గోల కారణంగా నాణ్యతకు తిలోదకాలిచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల ఉపాధి హామీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మాకవరపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం తదితర మండలాల్లో పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు లోపించినట్టుగా గుర్తించారు. సుమారు 28 రోజుల వాటర్‌ప్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ వారం రోజులు కూడా చేయడం లేదని గుర్తించారు. ఆయా మండలాల ఏఈ, డీఈలపై చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
పుష్కరాలకు పైసా లేదు..
రాజమండ్రి కార్పొరేషన్ 2015-16 బడ్జెట్‌కు రూపకల్పన మహా పర్వం పనులన్నీ ఆర్థిక సంఘం నిధులతోనేనట.. సాధారణంగా ఆ సొమ్ముల విడుదలపై అనేక ఆంక్షలు పుష్కర పనులపై స్పష్టత కావాలంటున్న విపక్షం రాజమండ్రి : ఆర్థిక సంఘం నిధులంటేనే సవాలక్ష ఆంక్షలతో విడుదలవుతాయని మున్సిపాలిటీలు వాపోతుంటాయి. అలాంటిది.. నగరంలో రాబోయే గోదావరి పుష్కరాలను పూర్తిగా 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్నారంటే జరిగే పనేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి నగరపాలక సంస్థ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రూ.240 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి తమ బడ్జెట్లోంచి కొత్తగా కేటాయింపులు అక్కర్లేద ని బడ్జెట్ రూపకల్పన సందర్భంగా నిర్ధారించుకున్నట్టున్నారు. అందుకే పుష్కరాల కేటాయింపులు లేకుండానే 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఆమోదించేందుకు కౌన్సిల్ శనివారం సమావేశమవుతోంది. అమలు సాధ్యం కాని అంచనాలు.. రెండేళ్ల విరామం అనంతరం (నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడ్డ తర్వాత) జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశం ఇది. ఇందులో నగరాభివృద్ధికి అద్భుతమైన ప్రణాళికలు వేస్తారనుకుంటే అవి ఎక్కడా కనిపించ లేదు. కేవలం జమాఖర్చుల పద్దులు అమోదింప చేసుకునేందుకే బడ్టెట్ రూపొందించినట్టు కనిపిస్తోంది. తూతూ మంత్రపు బడ్జెట్‌పై విపక్ష సభ్యులు కూడా పెదవి విరుస్తున్నారు. నగర పాలక సంస్థకు వివిధ పద్దుల ద్వారా వచ్చే ఆదాయం రూ.412.75 కోట్లుగా చూపించారు. గత సంవత్సర నిల్వలు రూ.41.32 కోట్లతో కలిపి మొత్తం ఆదాయం 454.07 కోట్లని తేల్చారు. చేయబోయే వ్యయం మాత్రం రూ.437.72 కోట్లుగా తేల్చిన అధికారులు ఇంకా రూ.16.36 కోట్లు మిగులు ఉంటుందని చూపుతున్నారు. 2014-15 బడ్జెట్లో అప్పటి ప్రారంభ నిల్వతో కలిపి రూ.286.79 కోట్లు ఆదాయంగా చూపగా వచ్చింది మాత్రం రూ. 195 కోట్లే. అయితే అధికారులు రూ.195.23 కోట్ల మేర వ్యయం కాగలదని అంచనాలు వేస్తే, అందులో రూ.153.91 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది బడ్జెట్ కూడా ఇదే మాదిరి అంచనాలకు అందద ని భావిస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు అంచనాల్లో రూ.320 కోట్లు వివిధ పథకాల గ్రాంట్లుగా బడ్జెట్లో చూపుతున్నారు. ఇందులో పుష్కరాలకు 13 ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు రూ.240 కోట్లని చూపించారు. అంటే కార్పొరేషన్‌కు ఇతర గ్రాంట్ల రూపంలో వచ్చేది మాత్రం రూ.80 కోట్లు మాత్రమే. ఆ నిధులు రాకుంటే చిక్కే.. ఆర్థిక సంఘం నిధులను కేంద్రం కొన్ని నిబంధనలకు లోబడి విడుదల చేస్తుంది. గత కాలపు పనుల వినియోగ పత్రాలు చూసి, తరువాత కాలానికి నిధుల విడుదల చేస్తారు. 13వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు మొత్తంగానే సుమారు రూ.వంద కోట్లు రాని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఎక్కడి నుంచి మళ్లిస్తుంది, ఎలా సరిపెడుతుంది అనేది ప్రశ్నార్థకం. కార్పొరేషన్ పరిధిలో 536 పుష్కరాల పనులకు రూ.240 కోట్లు కేటాయిం చగా, వీటిలోంచి రూ.50 కోట్లు వ్యయమయ్యే 331 పనులకు టెండర్లు పిలిచారు. ఇంకా రూ. 190 కోట్ల విలువైన 205 పనులకు టెండర్లు పిల వాల్సి ఉంది. పనులు ప్రారంభమయ్యాక సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయక పో తే పరిస్థితి ఏమిటని, పుష్కరాల నిధులపై ఓ స్పష్టత కావాలని ప్రతిపక్షసభ్యులు బడ్జెట్ సమావేశంలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. -
కుప్పం పట్టణ వీధులకు మహర్దశ
కుప్పం: కుప్పం పట్టణ వీధులకు మహర్దశ రానున్నట్టు పంచాయుతీ రాజ్ ఎస్ఈ జగత్‌కువూర్ తెలిపారు. మండల పరిషత్ కార్యలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరైనట్టు ఆయన తెలిపారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి పరమసముద్రం వరకు రూ.50 లక్షలు, టౌన్‌బ్యాంక్ నుంచి సిరికల్చర్ కార్యాలయుం వరకు రూ.30 లక్షలు, గాంధీ విగ్రహం నుంచి గుడుపల్లె రోడ్డు వరకు రూ.30 లక్షల నిధు లు వుంజూరైనట్టు ఆయున తెలిపారు. జమిందర్ ప్యా లెస్ నుంచి టీటీడీ కళ్యాణ వుండపం వరకు రూ.30 లక్ష లు రోడ్డు నిర్మాణం కోసం వుంజూరైందని, టెండర్లు సైతం పూర్తయ్యాయని ఆయున పేర్కొన్నారు. దీంతో పాటు స్మార్ట్ విలేజ్‌గా ఎంపికైన అనిమిగానిపల్లెలో బీటీ రోడ్డు పనులను తనిఖీ చేసినట్టు తెలిపారు. పట్టణంలో అధికంగా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో సిమెంట్ రోడ్డు వేయనున్నట్టు తెలిపారు. అర్ధాంతరంగా ఆగిన అంగన్వాడి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతావుని చెప్పారు. ఈ పనులను వుూడు నెలల్లో పూర్తి చేయూలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రవుంలో పంచాయతీరాజ్ ఈఈ నథానిరుుల్, ఎంపీపీ సాంబశివం, తెలుగుదేశం పార్టీ నాయుకులు శ్రీనివాసులు, సీకే.సుబ్రవుణ్యం, పీఆర్ డీఈ, అధికారు లు పాల్గొన్నారు. -
కేంద్ర పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వండి
14వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న తెలంగాణ ప్రభుత్వం తలసరి ఆదాయం వెయిటేజీని తగ్గించాలని డిమాండ్ జనాభా, తలసరి ఆదాయం, ఎఫ్ఆర్బీఎం ఆధారంగా నిధుల కేటాయింపు ఈ ఏడాది రూ. 9,700 కోట్లు వస్తుందని 13వ ఆర్థిక సంఘం సూచన హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 50 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. ఈ మేరకు ఓ నివేదికను ఒకటి,రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి పంపించనుంది. ప్రస్తుతం 32శాతం పన్నుల వాటా మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. కాగా, కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి అమలు చేయడానికి, అత్యవసర సమయాల్లో రాష్ట్రాలకు నిధులు సర్దుబాటు చేయడానికి వినియోగిస్తోం ది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కాకుండా ఆ నిధులను రాష్ట్రాలకు ఎక్కువగా ఇవ్వాలని కోరనుం ది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయించే నిధులకు వినియోగించే మార్గదర్శకాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న భావనను నివేదికలో పొందుపర్చారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఆదాయం అధికంగా వస్తున్నందున, దీనిని అన్ని జిల్లాల తలసరి ఆదాయంగా చూపించడం వల్ల రాష్ట్రానికి కేటాయింపులో విపరీతమైన అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం తన వాదన వినిపిం చనుంది. అందువల్ల తలసరి ఆదాయం ఆధా రంగా నిర్ణయించే వెయిటేజీ 47.5 శాతాన్ని తగ్గించాలని కోరుతోంది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు కేటాయించేందుకు జనాభా, తలసరి ఆదాయం, ఎఫ్ఆర్బీఎం నిబంధనల అమలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని అధికారవర్గాలు తెలిపాయి. డివిజ బుల్ పూల్ నుంచి రాష్ట్రానికి 2.9 శాతం నిధులు వస్తున్నాయని, దీన్ని పెంచాలని కోరనుంది. సేవ ఆధారిత పన్నుల వాటాను ఉమ్మడి రాష్ట్రం లో ఏడు శాతానికి పైగా, ఆదాయపన్ను, సెం ట్రల్ ఎక్సైజ్, కార్పొరేట్ టాక్స్ తదితర వాటిలో 6.97 శాతం పన్నులు రాష్ట్రానికి ఇస్తోందని వివరించారు. 13వ ఆర్థిక సంఘం నిర్ధారణ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.9,700 కోట్లు వస్తుంద న్నారు. కేంద్రంలో పన్నుల వసూళ్లు పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుం దని లేదంటే తగ్గుతుందని ఆ వర్గాలు తెలిపాయి.