కుప్పం పట్టణ వీధులకు మహర్దశ
కుప్పం: కుప్పం పట్టణ వీధులకు మహర్దశ రానున్నట్టు పంచాయుతీ రాజ్ ఎస్‌ఈ జగత్‌కువూర్ తెలిపారు. మండల పరిషత్ కార్యలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరైనట్టు ఆయన తెలిపారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి పరమసముద్రం వరకు రూ.50 లక్షలు, టౌన్‌బ్యాంక్ నుంచి సిరికల్చర్ కార్యాలయుం వరకు రూ.30 లక్షలు, గాంధీ విగ్రహం నుంచి గుడుపల్లె రోడ్డు వరకు రూ.30 లక్షల నిధు లు వుంజూరైనట్టు ఆయున తెలిపారు. జమిందర్ ప్యా లెస్ నుంచి టీటీడీ కళ్యాణ వుండపం వరకు రూ.30 లక్ష లు రోడ్డు నిర్మాణం కోసం వుంజూరైందని, టెండర్లు సైతం పూర్తయ్యాయని ఆయున పేర్కొన్నారు.
దీంతో పాటు స్మార్ట్ విలేజ్‌గా ఎంపికైన అనిమిగానిపల్లెలో బీటీ రోడ్డు పనులను తనిఖీ చేసినట్టు తెలిపారు. పట్టణంలో అధికంగా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో సిమెంట్ రోడ్డు వేయనున్నట్టు తెలిపారు. అర్ధాంతరంగా ఆగిన అంగన్‌వాడి భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతావుని చెప్పారు. ఈ పనులను వుూడు నెలల్లో పూర్తి చేయూలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రవుంలో పంచాయతీరాజ్ ఈఈ నథానిరుుల్, ఎంపీపీ సాంబశివం, తెలుగుదేశం పార్టీ నాయుకులు శ్రీనివాసులు, సీకే.సుబ్రవుణ్యం, పీఆర్ డీఈ, అధికారు లు పాల్గొన్నారు.