కేంద్ర పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వండి
14వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న తెలంగాణ ప్రభుత్వం
తలసరి ఆదాయం వెయిటేజీని తగ్గించాలని డిమాండ్
జనాభా, తలసరి ఆదాయం, ఎఫ్‌ఆర్‌బీఎం
ఆధారంగా నిధుల కేటాయింపు
ఈ ఏడాది రూ. 9,700 కోట్లు వస్తుందని 13వ ఆర్థిక సంఘం సూచన
హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 50 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. ఈ మేరకు ఓ నివేదికను ఒకటి,రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి పంపించనుంది. ప్రస్తుతం 32శాతం పన్నుల వాటా మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. కాగా, కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి అమలు చేయడానికి, అత్యవసర సమయాల్లో రాష్ట్రాలకు నిధులు సర్దుబాటు చేయడానికి వినియోగిస్తోం ది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కాకుండా ఆ నిధులను రాష్ట్రాలకు ఎక్కువగా ఇవ్వాలని కోరనుం ది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయించే నిధులకు వినియోగించే మార్గదర్శకాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న భావనను నివేదికలో పొందుపర్చారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఆదాయం అధికంగా వస్తున్నందున, దీనిని అన్ని జిల్లాల తలసరి ఆదాయంగా చూపించడం వల్ల రాష్ట్రానికి కేటాయింపులో విపరీతమైన అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం తన వాదన వినిపిం చనుంది.
అందువల్ల తలసరి ఆదాయం ఆధా రంగా నిర్ణయించే వెయిటేజీ 47.5 శాతాన్ని తగ్గించాలని కోరుతోంది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు కేటాయించేందుకు జనాభా, తలసరి ఆదాయం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల అమలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని అధికారవర్గాలు తెలిపాయి. డివిజ బుల్ పూల్ నుంచి రాష్ట్రానికి 2.9 శాతం నిధులు వస్తున్నాయని, దీన్ని పెంచాలని కోరనుంది. సేవ ఆధారిత పన్నుల వాటాను ఉమ్మడి రాష్ట్రం లో ఏడు శాతానికి పైగా, ఆదాయపన్ను, సెం ట్రల్ ఎక్సైజ్, కార్పొరేట్ టాక్స్ తదితర వాటిలో 6.97 శాతం పన్నులు రాష్ట్రానికి ఇస్తోందని వివరించారు. 13వ ఆర్థిక సంఘం నిర్ధారణ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.9,700 కోట్లు వస్తుంద న్నారు. కేంద్రంలో పన్నుల వసూళ్లు పెరిగితే రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుం దని లేదంటే తగ్గుతుందని ఆ వర్గాలు తెలిపాయి.