phc centre
-
AP: పీహెచ్‌సీల బలోపేతం చేస్తున్న సర్కార్
సాక్షి, అమరావతి: పల్లె ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పరిస్థితులకు చెక్ పెడుతూ.. ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీలను సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఆధునీకరిస్తోంది. భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు, శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తోంది. ఇందు కోసం రూ. 670 కోట్లు ఖర్చు చేస్తోంది. 978 భవనాలకు మరమ్మతులు రాష్ట్ర వ్యాప్తంగా 1,124 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 978 పీహెచ్‌సీల భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. 146 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. మరమ్మతుల కోసం రూ. 408.5 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటికే 532 భవనాలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఆయా పీహెచ్‌సీల్లో అవసరమైన ప్రహరీలు, వైద్యులు, వైద్య సిబ్బంది సమావేశ గదులు, రోగులకు అవసరమైన ఇతర అదనపు నిర్మాణాలు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆహ్లాద వాతావరణం ఉండేలా మొక్కలు నాటడంతో పాటు ఇతర చర్యలు చేపట్టారు. రూ.261.5 కోట్లతో 146 కొత్త భవనాలను జాతీయ ప్రమాణాలతో, అన్ని వసతులు ఉండేలా నిర్మిస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల్లో వసతులు ఇలా ► మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు ► ఆపరేషన్ థియేటర్.. ప్రసూతి గది ► ఇద్దరు వైద్యాధికారులతో పాటు, ఆయుష్ వైద్యుడికి వేరు వేరుగా కన్సల్టేషన్ గదులు, స్టాఫ్ నర్సుల కోసం ప్రత్యేక గది. ► మెడిసిన్ స్టోర్, ల్యాబ్ గదులు, ఆసుపత్రికి వచ్చే రోగులకు మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పన. వచ్చే ఏప్రిల్‌కు అందుబాటులోకి నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరుకు 978 భవనాల మరమ్మతులు, ఏప్రిల్ నెలాఖరుకు 146 కొత్త భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించాం. ఈ లోపు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ -
వ్యాక్సిన్ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
Medicine From The Sky Project: కరోనా వ్యాక్సిన్ డెలివరీలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ ప్రయోగం తెలంగాణలో సఫలమైతే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా రోజుల లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా అందులో సగానికి పైగా నగర, పట్టణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు. గంట వ్యవధిలో జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూమి నుంచి 500ల నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్‌కి కేవలం గంట వ్యవధిలో చేరాలా చూస్తారు. దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. సెప్టెంబరు 9 నుంచి మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్ రన్ని 2021 సెప్టెంబరు 9 నుంచి ప్రారంభించనున్నారు. తక్కువ ఎత్తులో కంటికి కనిపించేలా డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్లను ఎంపిక చేసిన గమ్యస్థానానికి నిర్దేశిత సమయంలోగా చేరేలా చూస్తారు. ఆ తర్వాత మూడు సార్లు కంటికి కనిపించనంత ఎత్తులో అత్యంత వేగంగా వ్యాక్సిన్లను గమ్య స్థానాలకు చేరుస్తారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మూడో వారం వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే మెడిసన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. తొలుత వికారాబాద్ మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు చేపట్టేందుకు హైదారాబాద్‌కి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న 16 పీహెచ్‌సీలకు తొలిసారిగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ట్రయల్ రన్లో లోటు పాట్లు గుర్తించి వాటిని సవరించుకుంటారు. కేంద్రం అనుమతి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని అత్యవసర సమయాల్లో మెడిసన్లు, వ్యాక్సిన్లు, రక్తం తదితర అత్యవసర వైద్య సేవలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది కేంద్ర ఏవియేషన్ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి. -
కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా సర్కార్ దావఖానా..
సర్కారు దవాఖానా వాహ్ అనిపిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా పరికరాలు సమ కూర్చుకుంటోంది. విధులు, నిధులు రెండూ బాగుండడంతో ఆస్పత్రి బాగు పడుతోంది. ప్రభుత్వం కావాల్సినంత సహకారం అందిస్తుండడంతో ఒక్కొక్కటిగా పరికరాలను తన అమ్ములపొదిలో చేర్చుకుంటోంది. అధునాతన యంత్రాలతో బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సారవకోట: మండలంలోని బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా మారుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగవుతున్నాయి. గతంలో ఆస్పత్రి నిర్మాణం జరగ్గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేలా ఫైర్ సేఫ్టీ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆస్పత్రిలో నిత్యం పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఏడుగురు పారిశు ద్ధ్య కార్మికులను 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వీరు ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డులు, ఓపీ సెంటర్, వైద్యుల గదులన్నింటినీ నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ►నాలుగు నెలల క్రితం దంత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు, దంత సమస్యలతో ఉన్న వారికి వైద్యం అందించేందుకు వీలుగా అధునాతన యంత్రాన్ని మంజూరు చేశారు. ► ఇటీవలే నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించడంతో వైద్య సేవలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రసవాలపై ప్రత్యేక దృష్టి గైనకాలజిస్టు సృజనీకుమారి ఆస్పత్రి ప్రసవాలపై దృష్టి సారించడంతో సహజ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. సారవకోట, జలుమూరు, కోటబొమ్మాళి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల నుంచి గర్భిణులు వచ్చి ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కాన్పు కష్టమైన సమయంలో శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేయాల్సి వచ్చినప్పుడు అవసరమయ్యే మత్తు వైద్యులను సైతం నియమించారు. ఫలితంగా కరోనా సమయంలో సైతం గైనకాలజిస్టు సృజనీకుమారి ధైర్యంగా గర్భిణులకు తోడుగా ఉంటూ ప్రసవాలు చేశారు. పిల్లల వైద్యుడు బోర సాయిరాం చిన్నారుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్త యంత్రాలు.. ఆస్పత్రికి ఫిజియోథెరపీ కోసం వచ్చే వారికి సేవలు చేసేందుకు అవసరమైన యంత్రాలను ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ యంత్రాలను ఇన్స్టాల్ చేసి సంబంధిత వైద్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ప్రభుత్వ కృషి అభినందనీయం.. ప్రభుత్వం ఆస్పత్రుల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు కల్పించడం, నూతన యంత్రాల మంజూరు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడం సంతోషకరం. అలాగే నాడు–నేడు కార్యక్రమంతో ఆస్పత్రులను అభివృద్ధి చేసి సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడం గొప్ప విషయం. – డాక్టర్ సృజనీకుమారి, సూపరింటెండెంట్, బుడితి సీహెచ్‌సీ -
Covid Third Wave: అప్రమత్తమైన వైద్యశాఖ, పిల్లల కోసం ప్రత్యేక పడకలు..
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వైద్యం కోసం అప్పుసొప్పు చేసి చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండో దశ ముగియడంతో మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. పిల్లలపై కోవిడ్ వైరస్ ప్రభావం చూపితే వైద్యం అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్‌లో పిల్లల కోసం ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలెటర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రత్యేక చర్యలు ముమ్మరం చేశారు. సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు రిమ్స్ వైద్య కళాశాల ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, అర్బన్ హెల్త్ సెంటర్లలో పిల్లలకు సంబంధించిన వైద్య నిపుణులు లేరు. పిల్లలకు వైద్యం అందించేందుకు రిమ్స్ ఆస్పత్రే పెద్ద దిక్కుగా ఉంది. కోవిడ్ మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. రెండో దశ ఇంకా ముగియకముందే మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు సూచించారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 768 పడకలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం పెద్దల కోసం 416 ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా పది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 175 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. పిల్లలపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో పిల్లల వార్డులో 60 ఆక్సిజన్ బెడ్లను రిమ్స్ అధికారులు సిద్ధం చేశారు. 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయగా, మరో పది బెడ్లను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అన్ని రోగాలకు సంబంధించి రిమ్స్‌లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్య శాఖ థర్డ్‌వేవ్‌లో చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ, రిమ్స్ అధికారులు ముందుచూపుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేయగా, మందులను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు రిమ్స్ ఆస్పత్రిలో కరోనా బారిన పడి 4వేలకు పైగా చికిత్స పొందారు. 80కి పైగా మృత్యువాత పడ్డారు. మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 5శాతం మంది కూడా చిన్నారులు కోవిడ్ బారిన పడలేదని రిమ్స్ డైరెక్టర్ వివరించారు. దాదాపు 50 మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారని తెలిపారు. మరణాలు కూడా తక్కువగానే ఉంటాయని పేర్కొంటున్నారు. తగ్గుముఖం పట్టిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి నెలలో జిల్లాలో మొదటి కేసు నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కేసులు పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో మరోసారి విజృంభించి ఏప్రిల్ నెలలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత నెలలో లాక్డౌన్ విధించడంతో మళ్లీ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 5 నుంచి 10 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,70,648 పరీక్షలు చేయగా 16,252 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. 3,54,193 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో 84 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 16,084 మంది కోవిడ్‌ను జయించారు. దాదాపు 200 మందికి పైగా కోవిడ్ బారిన పడి మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల లెక్కల ప్రకారం 84 మంది మృతిచెందారు. భయపడాల్సిన అవసరం లేదు థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. పెద్దవారికి సోకినంతగా వైరస్ చిన్నారులకు సోకదు. వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రులు చిన్నారులను అనవసరంగా బయటకు తీసుకెళ్లొద్దు. చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకునేలా చూడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల్లో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, కడుపునొప్పి తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. – బానోత్ బలరాం, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ చదవండి: ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.! -
పాడైపోయిన ఫ్రిజ్‌లో 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
జైపూర్: అసలే కరోనా వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. పాడైన రిఫ్రిజిరేటర్లో వ్యాక్సిన్లను నిల్వ చేయడంతో అవి గడ్డకట్టి పాడైపోయాయి. ఈ ఘటన రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అయితే మే 22 నుంచి ఆ ఫ్రిజ్ పాడైనా దాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. ఈ విషయం చీఫ్ మెడికల్ హెల్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. మహేంద్ర పర్మర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృంధం పీహెచ్సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. ఫ్రిజ్ పాడైపోవడంతో అవి గడ్డకట్టి వ్యర్థంగా మారాయని.. దీనికి కారణమైన పీహెచ్సీ సిబ్బందికి నోటీసులు జారీ చేశామని సీఎమ్హెచ్వో పర్మర్ తెలిపారు. పీహెచ్సీ డాక్టర్ రామచంద్ర శర్మ మాట్లాడుతూ.. '' 480కి పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పాడైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఫ్రిజ్ పాడైన మాట నిజమే కానీ వెంటనే మెకానిక్‌ను పిలిపించి ఫ్రిజ్‌ను బాగుచేయించాం. మా దగ్గర ఎలాంటి కోవిడ్ వ్యాక్సిన్లు లేవు.. గడ్డకట్టినవి అన్ని ఇతర వ్యాక్సిన్లు.. దీనిపై ఇప్పటికే ఎంక్వైరీకి వచ్చిన మెడికల్ టీమ్‌కు వివరణ ఇచ్చాం'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: నాన్న వస్తాడని ఎదురుచూస్తుంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
వైరస్ ఉధృతి: అనుమానితులు ఎక్కువ.. కిట్లు తక్కువ
సాక్షి, జగిత్యాల: జిల్లాలో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో పీహెచ్‌సీలకు అనుమానితులు బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీలకు అరకొర కిట్లు వస్తుండడంతో పలువురు పరీక్షలు చేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. మళ్లీ మరుసటి రోజు వచ్చి లైన్లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నిత్యం వందలకొద్ది అనుమానితులు వస్తుండగా పరీక్షలు మాత్రం వందలోపే చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం 1600లకు మించి పరీక్షలు చేయడం లేదు. బారులు తీరుతున్న జనం జిల్లాలోని ప్రతీ ఆరోగ్య కేంద్రంతోపాటు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 100, జిల్లా ఆస్పత్రిలో 200, పీహెచ్‌సీల్లో 50 చొప్పున కిట్లు కేటాయిస్తూ రోజుకు అంతమందికే చేస్తున్నారు. సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనుమానితులు సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మొదట్లో టీకాలు వేసుకునేందుకు ముందుకురాని వారు, సెకండ్‌వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొదట కరోనా పరీక్షలు చేసుకుని టీకాలు వేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ముందు పరీక్షలు చేయించుకుందామంటే ర్యాపిడ్టెస్ట్ కిట్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే బారులు తీస్తున్నారు. పూర్తిస్థాయిలో కిట్లు పంపిణీ కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రోజుకు 1,600 మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో టెస్ట్‌ల కోసం అనుమానితులు బారులుతీరుతున్నారు. గతంలో పరీక్షలు చేసుకునేందుకు ముందుకురాని వారు ప్రస్తుతం వైరస్ ఉధృతిని చూసి పరుగులు పెడుతున్నారు. దీంతో కిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. సరఫరా సైతం అంతంతే ఉండడంతో కొరత ఏర్పడుతోంది. జగిత్యాలలోనే ఆర్టీపీసీఆర్ జగిత్యాలలోని ఓల్డ్హైస్కూల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ టెస్ట్‌లు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్‌ల్లో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్కు పంపుతున్నారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వస్తుండడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
మంత్రివర్యా.. మాకేయి సూడయ్యా
సాక్షి, ఆదిలాబాద్: వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ఈ ప్రాంతంలో వైద్యసేవలు మృగ్యమయ్యాయి. పేరుకు పెద్దపెద్ద సర్కారు దవాఖానాలు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. చిన్నచిన్న రోగాలకు కూడా రిమ్స్ వైద్యులు హైదరాబాద్, నాగ్‌పూర్, యావత్మాల్ తదితర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుసప్పు చేసి ప్రైవేటు వైద్యం చేయించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి ఉన్నా చిన్న చిన్న రోగాలు, జ్వరాలకు తప్ప మరే వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల ఖాళీలు, మౌలిక వసతుల కొరత, పరికరాలు లేక నాణ్యమైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లాలో పర్యటించనున్నారు. రోగులు, వారి బంధువులు జిల్లాలోని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పీహెచ్పీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అమాత్యునికి విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. పీహెచ్‌సీల్లో అందని వైద్యం.. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 129 ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఒక ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. అదే విధంగా ఆదిలాబాద్ పట్టణంలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 24 గంటలు పని చేసే పీహెచ్‌సీలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 8నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందించాల్సి ఉండగా ఎక్కడా పూర్తి స్థాయిలో రోగులకు వైద్యసేవలు అందడం లేదు. పీహెచ్సీలో చాలా మంది వైద్యులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే విధుల్లో ఉంటున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో ప్రైవేటు క్లీనిక్‌లు నడుపుతున్నారు. బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేసినా మూలనపడ్డాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీల జాతర.. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీహెచ్‌సీల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులు తీవ్రంగా వేధిస్తున్నాయి. నాలుగు సివిల్ సర్జన్ పోస్టులకు గాను ఒక్కరే ఉన్నారు. అదే విధంగా జిల్లా మలేరియా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులు 52 గాను 13 మంది కాంట్రాక్ట్, 33 మంది రెగ్యులర్ ఉన్నారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగు డిప్యూటీ పారామెడికల్ పోస్టులకు గాను ఇద్దరు ఉన్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాస్ మీడియా అధికారి పోస్టు, గణాంక అధికారి పోస్టు ఖాళీగా ఉంది. 34 స్టాఫ్ నర్సులకు గాను 6 గురు కాంట్రాక్ట్, 21 మంది రెగ్యులర్, 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫార్మాసిస్ట్ గ్రేడ్–2 పోస్టులు 29 ఉండగా 17 రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 29 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 19 మంది రెగ్యులర్, 5 కాంట్రాక్ట్, 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎం పోస్టులు 129 ఉండగా వీటిలో 117 కాంట్రాక్ట్, 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. రిమ్స్.. పేరుకే పెద్దాసుపత్రి జిల్లా కేంద్రంలో రిమ్స్ మెడికల్ కళాశాల ఉన్నా రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారు. ఏడాది క్రితం కన్జర్వేటర్ ఫారెస్ట్ గుండె నొప్పిరావడంతో వైద్యం కోసం రిమ్స్‌లో చేరారు. సరైన వైద్యం అందక ఆయన మృత్యువాత పడ్డ సంఘటన తెలిసిందే. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. చిన్నచిన్న రోగాలు జ్వరాలు, మెటర్నటీ సేవలు అందుతున్నాయి. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో క్యాన్సర్, గుండెనొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతరాత్ర చికిత్సల కోసం హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రిమ్స్ కళాశాలకు రెగ్యులర్ డైరెక్టర్ లేరు. అదే విధంగా రిమ్స్ కళాశాలకు ప్రిన్సిపాల్ కూడా ఇన్చార్జే. ఆస్పత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్, ఆర్ఎంవో పోస్టుల్లో సైతం ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పర్యవేక్షణ గాడి తప్పింది. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు. చాలా మంది డాక్టర్లు ఉదయం 8 గంటల వరకు వచ్చి మధ్యాహ్నం 12 గంటల వరకే రిమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో కాల్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నారు. వారు వచ్చే వరకు రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లతోనే వైద్యసేవలు అందుతున్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 21కి గాను 9 మంది పని చేస్తున్నారు. 12 ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 30కి గాను 15 మంది పని చేస్తున్నారు. 15 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 41కి గాను 34 మంది పని చేస్తుండగా 7 ఖాళీగా ఉన్నాయి. ట్యూటర్ పోస్టులు 59కి గాను 37 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిమ్స్ అనేక సమస్యలతో కొట్టమిట్టాడుతోంది. జూనియర్ డాక్టర్లకు నాలుగు నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆందోళన బాటపట్టారు. అదే విధంగా పారిశుధ్య కార్మికులకు కూడా నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో నిరుపయోగం మారుతున్నాయి. జిల్లాలో ఆస్పత్రుల సమస్యలను పరిష్కరించాలని రోగులు ఆమాత్యున్ని వేడుకుంటున్నారు. నేడు రిమ్స్‌ను సందర్శించనున్న మంత్రి ఎదులాపురం(ఆదిలాబాద్): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం జిల్లా కేంద్రానికి రానున్నారు. అందులో భాగంగా రిమ్స్ ఆస్పత్రిని సాయంత్రం 5 గంటలకు సందర్శించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరనున్నారు. -
సీసీ కెమెరాలకు అనారోగ్యం..!
ఉట్నూర్(ఖానాపూర్): ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలకు అనారోగ్యం పాలయ్యాయి. అధికారులు రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేయడంలో చూపిన శ్రద్ధ వాటి వినియోగంపై లేకపోవడంతో నిధులు వృథాగా అయ్యా యి. పీహెచ్‌సీల్లో కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ద్వారా సిబ్బంది రాకపోకలు, పనితీరు, గైర్హాజరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు కొంత మెరుగైన వైద్యం అందించవచ్చనే ఐటీడీఏ ఆశయం నీరుగారుతోంది. ప్రభుత్వం నక్సల్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2012–13లో ప్రభుత్వం ఐటీడీఏ అదీనంలోని గిరిజన ఇంజినీరింగ్ విభాగం ద్వారా గిరిజనులకు పీహెచ్‌సీల్లో అందుతున్న వైద్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లించడం, సిబ్బంది సమయపాలన పాటించేలా చేయడంతోపాటు వారి గైర్హాజరును నివారించడం ద్వారా గిరిజనులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా ఏజెన్సీలోని 31 పీహెచ్‌సీలకు రూ.4.65 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో పీహెచ్‌సీకి రూ.15 వేలు వెచ్చించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ పీహెచ్‌సీకి ద్వారం గుండా రాకపోకలు సాగిస్తున్న వారిని వారిని గుర్తించే విధంగా ఏర్పాట్లు చేశారు. పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సీసీ కెమెరాల రికార్డింగ్ సిస్టంను కంప్యూటర్లకు అనుసంధానం చేయలేదు. దీంతో దంతన్‌పల్లి మినహా మిగతా పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా దర్శనం ఇస్తున్నాయి. ఫలితంగా అధికారుల పట్టింపు లేమితో గిరిజనుల అభివృద్ధికి వెచ్చించిన రూ.4.65 లక్షలు వృథాగా మారాయి. ముందు చూపు లేమి..? పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాల ఏర్పాటులో ముందు చూపు లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఐఏపీ నిధులు విడుదల కాగానే సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో చర్యలు తీసుకున్నారు. కానీ సీసీ కెమెరాలు ఏర్పాటుకు అనువైన పరిస్థితుల్లో ఆయా పీహెచ్‌సీల్లో ఉన్నాయా లేదా అని ఆలోచించనట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమయ్యే కంప్యూటర్లు పూర్తి స్థాయిలో ఉన్నవి లేనిది గుర్తించ లేకపోయారు. 31 పీహెచ్‌సీల్లో కంప్యూటర్లు ఉన్నా అందులో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయనేదీ అధికారులకు పూర్తి స్థాయి సమాచారం లేదు. పలు పీహెచ్‌సీల్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలావరకు పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేవని వైద్యాధికారులు అంటున్నారు. పీహెచ్‌సీల్లో వైద్యుల పని తీరు, సమయ పాలన, సిబ్బంది గైర్హాజరు తదితర అంశాలు ఐటీడీఏ పీవో గాని, ఉన్నత వైద్యాధికారులు వారి కార్యాలయాల నుంచి పరిశీలించాలన్నా ఆన్లైన్ సౌకర్యం కచ్చితంగా ఉండాలి. ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న చాలా పీహెచ్‌సీలకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పీహెచ్సీలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించడానికి అవకాశం లేకుండా పోతోంది. పూర్తి స్థాయిలో ఉపయోగపడని పనులకు అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించడంపై గిరిజనులు మండిపడుతున్నారు. అవే నిధులు గిరిజనుల ఆరోగ్యంపై ఖర్చు చేస్తే గిరిజనులకు మేలు జరిగేదని అంటున్నారు. పూర్తి స్థాయి చర్యలు తీసుకొని పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని కోరుతున్నారు. -
టిఫిన్‌లో బల్లి
వంగర : తాము తిన్న టిఫిన్‌లో బల్లి పడిందని తెలియడంతో మండల పరిధిలోని లక్ష్మీపేట గ్రామస్తులు వంగర పీహెచ్‌సీకి ఉరుకులు పరుగులు పెట్టారు. ఫుడ్‌పాయిజనింగ్ జరగలేదని వైద్య పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శివ్వాం గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ఎప్పటిలాగే గురువారం కూడా వివిధ రకాల ఆహార పదార్థాలు విక్రయించాడు. చెట్నీలో బల్లిపడిందనే ప్రచారం జరగడంతో టిఫిన్ చేసిన వారంతా భయంతో పీహెచ్‌సీకి హుటాహుటిన వెళ్లారు. విషయం తెలుసుకున్న ఏఎన్ఎం ఎస్.సూర్యప్రభ వారికి ప్రాథమిక చికిత్స అందించి వంగర పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి దత్తి అనీల్‌కుమార్ బోనెల చాందిని, బోనెల మౌళి, చిత్తిరి తేజేశ్వరరావు, చిత్తిని కల్పన, కలమటి హేమా, పావని, మొత్తం 22 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఫుడ్‌పాయిజన్ లక్షణాలు లేవని వైద్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకుని లక్ష్మీపేటకు వెళ్లారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని సర్పంచ్ చిత్తిరి సింహాలమ్మ తెలిపారు. -
వైద్యం.. దైన్యం!
ప్రభుత్వ దవాఖానాలో వైద్యాధికారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుడు అందుబాటులో లేక ఆస్పత్రి బోసిపోయింది. సమస్య పరిష్కరించాల్సిన ఆశాఖ అటువైపు దృష్టి సారించకపోవడంతో రోగులు చిన్నపాటి జబ్బుకు కూడా వేలాది రూపాయలు ఖర్చుచేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. నర్వ : నిరంతర సేవల ద్వారా ప్రజావైద్యం అందించే ఆసుపత్రి సేవల్లో సిబ్బంది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడం మూలంగా పరిస్థితి విషమించే ప్రమా దం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. లూజ్ మోషన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడిని గురు వారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సిబ్బం ది లేకపోవడంతో గంటల తరబడి వేచి చూశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. తెరుచుకోని యునాని కేంద్రం ఆస్పత్రిలో దీర్ఘకాలిక రోగుల కోసం ఏర్పాటు చేసిన యునాని వైద్య కేంద్రం ఎప్పుడు రోగులకు అందుబాటులో ఉంటుందో దేవుడికే తెలియాలి. నామమాత్రపు సేవలు, ప్రచారం లేని ఆయు ర్వేద కేంద్రంతో ఎలాంటి ప్రయో జనం లేదని ప్రజలు వాపోతున్నారు. ఓపీ సేవలు పెంచాలి నిత్యం వివిధ రోగాలపై ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ సేవలను అందించే సమయాన్ని పెంచాలి. ఓపీ తర్వాత కూడా ఎమర్జెన్సీ కేసులు వస్తే అందుబాటులో వైద్య సిబ్బంది ఉండాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది ఉండక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందే ఉండరు.. మా బందువుల బాబుకు మోషన్స్ ఉన్నాయని ఆసుపత్రికి వచ్చాం. సిబ్బంది ఎవ్వరూ లేరు. గతంలో చాలా సార్లు ఆసుపత్రికి వచ్చిన సేవలు అందించడంలో సిబ్బంది రోగులను మాటలతో ఇబ్బందులకు గురిచేస్తారు. ‘మీకు కావాల్సినప్పుడే డాక్టర్ వస్తాడా.. మా సమయంలోనే మేము వస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు గంటలు ఎదురుచూశాం. చివరికి గోళి ఇచ్చి పంపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – సైఫల్ అన్సారీ, లంకాల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలి మా బాబు మతిన్‌కు మోషన్స్‌లో బ్లడ్ వస్తుందని ఆసుపత్రికి వెళ్లాం. ఆస్పత్రిలో సిబ్బంది ఎవ్వరూ లేరు. రెండు గంటలు వేచి చూసిన తర్వాతనే సిబ్బంది వచ్చారు. రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. – చాంద్‌పాష, నర్వ, గ్రామం సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమో అందించి వివరణ కోరాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తాను. ఓపీ సేవలను పెంచి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – సిద్దప్ప, పీహెచ్సీ వైద్యులు, నర్వ -
త్వరలో 60 పడకల ఆస్పత్రి : కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదివారం సందర్శించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్టలో 60 పడకల ఆసుపత్రిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్యశాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు.