
జైపూర్: అసలే కరోనా వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. పాడైన రిఫ్రిజిరేటర్‌లో వ్యాక్సిన్లను నిల్వ చేయడంతో అవి గడ్డకట్టి పాడైపోయాయి. ఈ ఘటన రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పీహెచ్‌సీలో కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అయితే మే 22 నుంచి ఆ ఫ్రిజ్ పాడైనా దాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి.
ఈ విషయం చీఫ్ మెడికల్ హెల్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. మహేంద్ర పర్మర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృంధం పీహెచ్‌సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. ఫ్రిజ్ పాడైపోవడంతో అవి గడ్డకట్టి వ్యర్థంగా మారాయని.. దీనికి కారణమైన పీహెచ్‌సీ సిబ్బందికి నోటీసులు జారీ చేశామని సీఎమ్‌హెచ్‌వో పర్మర్ తెలిపారు. పీహెచ్‌సీ డాక్టర్ రామచంద్ర శర్మ మాట్లాడుతూ.. '' 480కి పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పాడైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఫ్రిజ్ పాడైన మాట నిజమే కానీ వెంటనే మెకానిక్‌ను పిలిపించి ఫ్రిజ్‌ను బాగుచేయించాం. మా దగ్గర ఎలాంటి కోవిడ్ వ్యాక్సిన్లు లేవు.. గడ్డకట్టినవి అన్ని ఇతర వ్యాక్సిన్లు.. దీనిపై ఇప్పటికే ఎంక్వైరీకి వచ్చిన మెడికల్ టీమ్‌కు వివరణ ఇచ్చాం'' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: నాన్న వస్తాడని ఎదురుచూస్తుంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే
Comments
Please login to add a commentAdd a comment