Banswada district
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
-
పాడైపోయిన ఫ్రిజ్‌లో 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
జైపూర్: అసలే కరోనా వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 480 కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. పాడైన రిఫ్రిజిరేటర్లో వ్యాక్సిన్లను నిల్వ చేయడంతో అవి గడ్డకట్టి పాడైపోయాయి. ఈ ఘటన రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అయితే మే 22 నుంచి ఆ ఫ్రిజ్ పాడైనా దాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో వ్యాక్సిన్లు నిరుపయోగంగా మారాయి. ఈ విషయం చీఫ్ మెడికల్ హెల్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. మహేంద్ర పర్మర్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృంధం పీహెచ్సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. ఫ్రిజ్ పాడైపోవడంతో అవి గడ్డకట్టి వ్యర్థంగా మారాయని.. దీనికి కారణమైన పీహెచ్సీ సిబ్బందికి నోటీసులు జారీ చేశామని సీఎమ్హెచ్వో పర్మర్ తెలిపారు. పీహెచ్సీ డాక్టర్ రామచంద్ర శర్మ మాట్లాడుతూ.. '' 480కి పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పాడైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఫ్రిజ్ పాడైన మాట నిజమే కానీ వెంటనే మెకానిక్‌ను పిలిపించి ఫ్రిజ్‌ను బాగుచేయించాం. మా దగ్గర ఎలాంటి కోవిడ్ వ్యాక్సిన్లు లేవు.. గడ్డకట్టినవి అన్ని ఇతర వ్యాక్సిన్లు.. దీనిపై ఇప్పటికే ఎంక్వైరీకి వచ్చిన మెడికల్ టీమ్‌కు వివరణ ఇచ్చాం'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: నాన్న వస్తాడని ఎదురుచూస్తుంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
విహారయాత్రలో విషాదం
బాన్సువాడ/అశ్వారావుపేటరూరల్: సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ కళాశాల విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. విద్యుత్ షాక్ తగిలి తోటి స్నేహితుడు కళ్లముందే ప్రాణాలర్పించగా, మరో స్నేహితుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో జరిగిన ఈ ఘటనతో బాన్సువాడలోని రేణుక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో, బిచ్కుంద మండలం వాజిద్‌నగర్‌లో విషాద ఛాయలు అలముకొన్నాయి. విద్యుత్తు షాక్‌తో బిచ్కుంద మండలం వాజిద్నగర్కు చెందిన మోడె సందీప్(17) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన సతీష్ గుండాకు తీవ్ర గాయాలపాలయ్యాడు. కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గత ఐదు రోజుల క్రితం పట్టణంలోని రేణుక ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన 70 మంది విద్యార్థులు విహారయాత్ర కోసం విశాఖపట్టణం, విజయవాడకు వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరుగు ప్రయణమయ్యారు. సోమవారం ఉదయం భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి ముత్యాలమ్మ దేవస్థానం వద్ద ఆగారు. తుఫాన్ వాహనాల్లో వెళ్లిన ఈ విద్యార్థులు అందరూ వాహనాల నుంచి దిగి దైవ దర్శనానికి వెళ్లారు. అదే సమయంలో సతీష్ అనే యువకుడు తుఫాన్పైనున్న లగేజీని తీసుకొనేందుకు ఎక్కాడు. అయితే ఆ వాహనంపైనే హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండడంతో అతను వైర్లకు తగిలాడు. దీంతో వాహనం మొత్తం విద్యుత్ స్పార్క్‌కు గురైంది. వాహనానికి ఆనుకొని ఉన్న సందీప్ సైతం షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వీరిని అశ్వారావుపేటలోని కార్తికేయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సందీప్ మృతిచెందాడు. సతీష్‌ను హుటాహుటీన హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో మిగితా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. తోటి మిత్రుడిని కోల్పోయామంటూ వారు రోదిస్తున్నారు. చివరి నిమిషంలోనే యాత్రకు..!? ఒకేషనల్ కళాశాలకు చెందిన విద్యార్థుల బృందం విహార యాత్రకు వెళ్తుండగా.. కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వద్దని వారించినట్లు తెలిసింది. తోటి విద్యార్థులు సందీప్, సతీష్‌లను వారి తల్లిదండ్రులను పట్టుబట్టారు. దీంతో చివరి నిమిషంలో వారు యాత్రకు రాగా ఇలా జరిగింది. అమ్మానాన్నలకు ఎలా చెప్పాలిరా..? ఈ బృందంలోని సందీప్, సతీష్‌తోపాటు మరో విద్యార్థి సాయి చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరంతా ఒకే బెంచీలో కూర్చుంటారు. కళాశాలలో కలిసే భోజనం చేస్తారు. ఇంత ప్రాణస్నేహితుల్లోంచి సందీప్ మృతిచెందగా, సతీష్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తోటి విద్యార్థులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎక్కడో పుట్టి ఇక్కడ చనిపోయావేంటిరా.. అమ్మానాన్నలకు ఏమని చెప్పాలిరా.. అంటూ రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. వాజిద్‌నగర్‌లో విషాదం కాగా ఈ సంఘటనను తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు సందీప్ తండ్రి విఠల్ వ్యవసాయం చేసి తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇతడికి సందీప్, సతీష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సందీప్ బాన్సువాడలోని రేణుక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. కొడుకు చనిపోవడంతో విఠల్ దంపతుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ సతీష్ తండ్రి సాయిలు కూరగాయలు అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సందీప్, సతీష్ ఇద్దరు మంచి మిత్రులు. వీరు ఎక్కడ వెళ్లినా కలిసి వెళ్తారు. విద్యుత్‌షాక్ రూపంలో సందీప్ ప్రాణాలను కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
బాన్సువాడను జిల్లా చేయాల్సిందే !
బాన్సువాడ : నాలుగు మండలాలకు కూడలి కేంద్రంగా ఉ న్న బాన్సువాడను జిల్లాగా మార్చాలని అఖిల పక్ష స మావేశంలో పలువురు డిమాండ్ చేశారు. మంగళవా రం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిల ప క్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యా పారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతాలైన జుక్కల్, ఎ ల్లారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేస్తే తెలంగాణ పునర్ని ర్మాణంలో భాగంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పే ర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గం జిల్లా కేంద్రం నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉందని, ఎల్లారెడ్డి నియోజకవర్గం 80 కిలో మీటర్ల దూరంలో ఉందని, బాన్సువాడను జిల్లా చేస్తే కేవలం 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలో జిల్లా కేంద్రం కావడంతో పాటు ప్రజలకు జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. బాన్సువాడను జిల్లాగా మార్చే వరకు ఉద్యమం చేయాలని తీర్మానించారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన కృషి చేస్తే సాధ్యం కానిది లేదని, టీఆర్ఎస్ నాయకు లు సైతం జిల్లా కేంద్రం కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికార పార్టీ నాయకత్వం వ హించి ఉద్యమాన్ని కొనసాగిస్తే తమకేమీ అభ్యంత రం లేదని, జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ని రుద్యోగ సమస్య కూడా దూరమవుతుందని పేర్కొన్నారు. దీని కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దామని తీర్మానించారు. సమావేశంలో కాంగ్రెస్ సెగ్మెంట్ ఇం చార్జి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, సాయిలు, అబ్దుల్ ఖాలిక్, భాస్కర్, నాగుల గామ వెంకన్న, టీడీపీ మండల అధ్యక్షుడు కొర్ల పోతురెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు అర్శపల్లి సాయిరెడ్డి, సీపీఐ నేత దుబాస్రాములు, చాంబర్‌ఆఫ్ కామర్స్ అ ధ్యక్షుడు నాగులగామ శ్రీనివాస్‌గుప్త, న్యాయవాదులు మూర్తి, మాణిక్‌రెడ్డి, రమాకాంత్, ఖలీల్ పాల్గొన్నారు. నేడు జిల్లా సాధన సమితి ఆవిర్భావం అఖిల పక్ష సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక ఆర్అండ్బీ సమావేశంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశ ంలో బాన్సువాడ జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతోపాటు, వ్యాపార, వాణిజ్య, కుల సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్‌క్లబ్ తదితర సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రెస్‌క్లబ్ కార్యదర్శి సయ్యద్ అహ్మద్ కోరారు.