బాన్సువాడను జిల్లా చేయాల్సిందే ! | must do banswada district | Sakshi
Sakshi News home page

బాన్సువాడను జిల్లా చేయాల్సిందే !

Published Wed, Sep 24 2014 2:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

must do  banswada district

బాన్సువాడ : నాలుగు మండలాలకు కూడలి కేంద్రంగా ఉ న్న బాన్సువాడను జిల్లాగా మార్చాలని అఖిల పక్ష స మావేశంలో పలువురు డిమాండ్ చేశారు. మంగళవా రం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జరిగిన అఖిల ప క్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యా పారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతాలైన జుక్కల్, ఎ ల్లారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేస్తే తెలంగాణ పునర్ని ర్మాణంలో  భాగంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పే ర్కొన్నారు.  జుక్కల్ నియోజకవర్గం జిల్లా కేంద్రం నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉందని, ఎల్లారెడ్డి నియోజకవర్గం 80 కిలో మీటర్ల దూరంలో ఉందని, బాన్సువాడను జిల్లా చేస్తే కేవలం 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలో జిల్లా కేంద్రం కావడంతో పాటు ప్రజలకు జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు.

 బాన్సువాడను జిల్లాగా మార్చే వరకు ఉద్యమం చేయాలని తీర్మానించారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన కృషి చేస్తే సాధ్యం కానిది లేదని, టీఆర్‌ఎస్ నాయకు లు సైతం జిల్లా కేంద్రం కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికార పార్టీ నాయకత్వం వ హించి ఉద్యమాన్ని కొనసాగిస్తే తమకేమీ అభ్యంత రం లేదని, జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ని రుద్యోగ సమస్య కూడా దూరమవుతుందని పేర్కొన్నారు.

దీని కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దామని తీర్మానించారు.  సమావేశంలో కాంగ్రెస్ సెగ్మెంట్ ఇం చార్జి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, సాయిలు, అబ్దుల్ ఖాలిక్, భాస్కర్, నాగుల గామ వెంకన్న, టీడీపీ మండల అధ్యక్షుడు కొర్ల పోతురెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు అర్శపల్లి సాయిరెడ్డి, సీపీఐ నేత దుబాస్‌రాములు, చాంబర్‌ఆఫ్ కామర్స్ అ ధ్యక్షుడు నాగులగామ శ్రీనివాస్‌గుప్త, న్యాయవాదులు మూర్తి, మాణిక్‌రెడ్డి, రమాకాంత్, ఖలీల్ పాల్గొన్నారు.

 నేడు జిల్లా సాధన సమితి ఆవిర్భావం
 అఖిల పక్ష సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక ఆర్‌అండ్‌బీ సమావేశంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశ ంలో బాన్సువాడ జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు.  ఈ సమావేశంలో అన్ని పార్టీలతోపాటు,  వ్యాపార, వాణిజ్య, కుల సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్‌క్లబ్ తదితర సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రెస్‌క్లబ్ కార్యదర్శి సయ్యద్ అహ్మద్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement