కరీంనగర్ కల్చరల్/కమాన్‌చౌరస్తా/టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గురువారం వివిధ డివిజన్లలో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. 23వ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి ప్రభావతి, 27లో టీడీపీ అభ్యర్థి సునావత్ అపసూర్య, 29లో సీపీఐ అభ్యర్థి నందికొండ అంజిరెడ్డి, 21లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల ప్రకాశ్, 33లో స్వతంత్ర అభ్యర్థి ఎస్‌డీ.ఆరీఫ్ హుస్సేన్, 45లో టీడీపీ అభ్యర్థి వంచ శ్రీనివాస్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి ఆకుల నాగరాజు, మూ డో డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి వైద్యుల శ్రీదే వి, 22లో స్వతంత్ర అభ్యర్థి కనుకుంట్ల సంధ్యారాణి, 50లో బీజేపీ అభ్యర్థి మందల జానకమ్మ, 47లో కాంగ్రెస్ అభ్యర్థి మేచినేని అశోక్‌రావు, టీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి వేణు, 48లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, 49లో టీఆర్‌ఎస్ అభ్యర్థి డి.సంపత్, 50లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వొంటెల సుమ, 17లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వరాల జ్యోతి, 43లో కాంగ్రెస్ అభ్యర్థి మీస బీరయ్య, స్వతంత్ర అభ్యర్థి మేకల నర్సయ్య, 26, 29 డివిజన్‌లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి ప్రచారం చేశారు.
30 డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి చొప్పరి జయశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థి పత్తెం పద్మ ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. 50 డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వొంటెల సుమ, 31, 32, 33 డివిజన్‌లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చిటీ రామారావు, ఏవీ.రమణ, వొడ్నాల రాజు, 34,35లో కాంగ్రెస్ అభ్యర్థులు వావిలాల హన్మంత రెడ్డి, చాడగొండ కవిత, 32లో బీజేపీ అభ్యర్థి గడ్డం లత, 47లో బండారి మాలతి, కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌రావు, 49లో టీఆర్‌ఎస్ అభ్యర్థి డి.సంపత్ ర్యాలీ నిర్వహించారు.
అభివృద్ధి కోసం ఆశీర్వదించండి
నగరపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. గురువారం 41వ డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా స్వరూపారాణి భారీ ర్యాలీ నిర్వహించారు.
జోరుగా అభ్యర్థుల ప్రచారం
Published Fri, Mar 28 2014 1:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement