Corporation elections
-
చెన్నై తొలి దళిత మహిళా మేయర్: ఆమెకు అభినందనలు
నార్త్ చెన్నై అంటే తమిళ సినిమాల్లో రౌడీల పుట్టిల్లుగా చూపిస్తారు. మురికివాడలు.. ఇరుకు గల్లీలు పంపుల దగ్గర స్త్రీల బాహాబాహీ అలాంటి చోట నుంచి ఇప్పుడు 29 ఏళ్ల ఆర్.ప్రియ మేయర్‌గా నగరాన్ని పాలించడానికి వచ్చింది. తమిళనాడు సి.ఎం. స్టాలిన్ స్ఫూర్తితో రాజకీయాలలో వచ్చిన ప్రియ చెన్నై మేయర్ పీఠం పై కూచున్న తొలి దళిత యువతిగా చరిత్ర సృష్టించింది. చెన్నైకు ఆర్.ప్రియ 49వ మేయర్. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు. కాని ఆర్.ప్రియ దళిత మహిళగా ఆ రికార్డును తన సొంతం చేసుకుంది. ఇదంతా ఆమెకు రాసి పెట్టినట్టుగా క్షణాల్లో జరిగిపోయింది గాని సరైన సమయంలో తాను రాజకీయాల్లో దిగాలి అని ప్రియ భావించడం వల్ల కూడా ఈ ఘనత సాధ్యమైంది. చెన్నై నగరానికి గత ఐదేళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు. స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రేటర్ చెన్నైలోని 200 వార్డులలో 153 స్థానాలు డి.ఎం.కెకు వచ్చాయి. ఇంకో 25 స్థానాలు డి.ఎం.కె మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అన్నా డిఎంకెకు కేవలం 15 వార్డులు దక్కాయి. ఈసారి ఎన్నికలలో చెన్నై మేయర్ పదవిని దళిత మహిళకు రిజర్వ్ చేయడం వల్ల నార్త్ చెన్నై 74వ వార్డు (తిరువికనగర్) నుంచి గెలిచిన ఆర్.ప్రియకు ఏకగ్రీవంగా ఈ పదవి దక్కింది. మార్చి 4, శుక్రవారం ఆమె మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసింది. ‘చెన్నైకి మేయర్‌గా చేసిన స్టాలిన్ మార్గదర్శనంలో నేను మేయర్‌గా పని చేసే అవకాశం రావడం గొప్ప విషయం’ అంది ప్రియ. ఆమె కుటుంబం డిఎంకెకి వీరభక్తులు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నాడు. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటంతో 18 ఏళ్ల వయసులో ప్రియ కూడా డి.ఎం.కె కార్యకర్త అయ్యింది. ‘అయితే నేను నిజంగా పార్టీ పనుల్లో చురుగ్గా పాల్గొంది స్టాలిన్ సి.ఎం అయ్యాకే. ఆయన పాలనా పద్ధతులు గమనించాక నా ప్రాంత సమస్యలు తీరాలంటే ఇదే అదను అని నాకు అనిపించి నేను కూడా పని చేయడం మొదలుపెట్టాను’ అంది ప్రియ. ఎం.కాం చేసిన ప్రియకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ‘నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు’ అంది ప్రియ. సాధారణంగా నార్త్ చెన్నై ప్రాంతం చాలా ఏళ్లుగా సౌకర్యాల ఏర్పాట్లలో నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏకంగా మేయరే రావడం అందరూ ఎన్నో అంచనాలతో ప్రియ వైపు చూస్తున్నారు. ‘మా ఏరియా స్త్రీలు వేసవిలో 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆటోల్లో 4 కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. ముందు దీనిని మార్చాలి. పారిశుద్ధ్యం ముఖ్యం. అలాగే పిల్లలకు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. స్టాలిన్ యువ శక్తికి పూర్తి అవకాశం ఇస్తున్నారు. నేను బాగా పని చేయాలనుకుంటున్నాను’ అంది ప్రియ. స్టాలిన్ ప్రభుత్వం ఈసారి స్త్రీలకు పట్టణ, నగర పాలనా వ్యవస్థల బాధ్యతలు అప్పజెప్పడంలో శ్రద్ధ పెట్టింది. తమిళనాడులో మొత్తం 11 మేయర్ పదవులను, 5 డిప్యూటీ మేయర్ పదవులను స్త్రీలకు కేటాయించింది. కోయంబత్తూరు మేయర్‌గా మధ్యతరగతికి చెందిన ఏ.కల్పన అనే మహిళను ఎంపిక చేసింది. అయితే జయలలిత హయాంలో స్త్రీలు పదవుల్లోకి వచ్చాక వారి భర్తలు, తండ్రులు, సోదరులు పెత్తనం చెలాయించి ఆ గెలిచిన స్త్రీలను వెనక్కు నెట్టడం కొన్నిచోట్ల కనిపించేది. ‘అలా నా విషయంలో జరగదు. ఇప్పుడు స్త్రీలు తమ ఇళ్ల పురుషులకు ఆ అవకాశం ఇవ్వరు. వారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలనుకుంటున్నారు. మీరే చూస్తారుగా’ అంది ప్రియ. ఆమె నిర్ణయాలు చెన్నైకి మేలు చేస్తాయని ఆశిద్దాం. నిజానికి ఎలక్షన్లకు ముందే నా గెలుపు ఖాయమైపోయింది. నా ప్రాంత సమస్యలను వేటి వేటిని తీరుస్తానో నేను చెప్పాక అందరూ నాకే ఓటు వేస్తామని చెప్పేశారు. – ఆర్.ప్రియ -
తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా
చెన్నై: తమిళనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది. అయితే కుంభకోణం నగర మేయర్ పదవిని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. దీంతో 20 నగరాల్లో డీఎంకే అభ్యర్థులు మేయర్లుగా ఎన్నికయ్యారు. ఆరు డిప్యూటీ మేయర్ల స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పూర్తి జాబితా మీ కోసం... నగరం మేయర్ డిప్యూటీ మేయర్ చెన్నై ప్రియా రాజన్ (డీఎంకే) మహేశ్ కుమార్ (డీఎంకే) కోయంబత్తూర్ కల్పన (డీఎంకే) వెట్రిసెల్వన్ (డీఎంకే) మదురై ఇంద్రాణి (డీఎంకే) నాగరాజన్ (సీపీఎం) తిరుచ్చి అన్బళగన్ (డీఎంకే) రాజు (డీఎంకే) సేలం రామచంద్రన్ (డీఎంకే) శారదా దేవి తిరుపూర్ దినేశ్ కుమార్ (డీఎంకే) బాలసుబ్రమణ్యం(సీపీఐ) ఈరోడ్ నాగరత్నం (డీఎంకే) సెల్వరాజ్(డీఎంకే) తూత్తుకుడి జగన్ (డీఎంకే) జెనిట్టా సెల్వరాజ్(డీఎంకే) ఆవడి ఉదయ్‌కుమార్(డీఎంకే) - తాంబరం వసంతకుమారి(డీఎంకే) కామరాజ్(డీఎంకే) కాంచీపురం మహాలక్ష్మి (డీఎంకే) కుమారగురునాథన్(కాంగ్రెస్) కడళూర్ సుందరి (డీఎంకే) తామరైసెల్వన్ (వీసీకే) తంజావూర్ రామనాథన్ (డీఎంకే) అంజుగమ్ (డీఎంకే) కరూర్ కవితా గణేశన్ (డీఎంకే) తరణి శరవణన్ (డీఎంకే) హోసూర్ ఎస్ఏ సత్య (డీఎంకే) ఆనందయ్య (డీఎంకే) దిందిగల్ ఐలమతి (డీఎంకే) రాజప్ప (డీఎంకే) శివకాశి సంగీత (డీఎంకే) విఘ్నేష్ ప్రియ (డీఎంకే) నాగర్ కోయిల్ మహేశ్ (డీఎంకే) మేరీ ప్రిన్సీ లత (డీఎంకే) వేలూరు సుజాత (డీఎంకే) సునీల్ కుమార్ (డీఎంకే) తిరునల్వేలి పీఎం శరవణన్(డీఎంకే) కె. రాజు (డీఎంకే) కుంభకోణం శరవణన్ (కాంగ్రెస్) తమిళగన్(డీఎంకే) -
ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదు: మంత్రి అనిల్ కుమార్
-
ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదు: మంత్రి అనిల్ కుమార్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్లాంపేట, భగత్‌సింగ్ కాలనీల్లో ఒక్క ఇల్లు కూడా తొలగించమని స్పష్టం చేశారు. టీడీపీ, సీపీఎం నేతల దుష్ప్రచారాలను నమ్మొద్దని అన్నారు. ఆ పార్టీలకు ఓటేసినా ఉపయోగం లేదని, ఆ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చదవండి: ‘కుట్రలు, కుతంత్రాలు చేయడం చంద్రబాబుకి బాగా తెలుసు’ ఓటు చాలా విలువైనదని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్లో 54 డివిజన్లు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందని అన్నారు. -
టీడీపీ నేతలకు తమ్ముళ్ల షాక్.. సాక్షి కథనం.. నిజం
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ తీస్తున్నాయి. ఆ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులే నేతల పోకడలు నచ్చక బాబోయ్.. మీకో దండం అంటూ పోటీ నుంచి తప్పుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు, సిటింగ్ అభ్యర్థులు సుముఖంగా లేకపోవడంతో కొత్త వారిని అనేక ప్రలోభాలు పెట్టి బలవంతంగా నామినేషన్లు వేయించారు. కొందరు తెలివిగా నామినేషన్లను తప్పుల తడకలుగా ఇచ్చి తిరస్కరణతో పోటీ నుంచి బయటపడితే.. ఇంకొందరు పోటీ చేయలేమంటూ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. బరిలో నిలిచిన ఇంకొందరు సైతం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం తర్వాత ఆ పార్టీ నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గుడ్ బై చెబుతుండగా, తాజాగా కార్పొరేటర్ అభ్యర్థులే పోటీ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం, టీడీపీ అభ్యర్థులకు ప్రజాదరణ లేకపోవడం వంటి పరిస్థితులను విశ్లేషించుకుంటున్నంటున్న నేతలు తప్పుకోవడానికి ఇదే తరుణం అన్నట్లుగా బయటపడుతున్నారు. ఒక్కొక్కరుగా.. ఇంకా కొందరు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో టీడీపీ బలంగా ఉందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ పార్టీ నేతలకు తమ్ముళ్ల అంతరంగం అంతుపట్టడం లేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేయించామని చెప్పుకున్న గొప్పలు అంతలోనే నీరుగారిపోతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి 6, 7, 8, 12, 20, 24 29, 37, 38, 40, 45 డివిజన్ల పరిధిలో టీడీపీ అభ్యర్థులు వివిధ కారణాలతో తప్పుకున్నారు. తాజాగా 28వ డివిజన్ అభ్యర్థి సైతం పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరో రెండు రోజుల్లో వీరి బాటలోనే మరికొందరు బహిరంగంగానే తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు నామమాత్రంగానే ప్రచారం చేస్తుండడం ఆ పార్టీ దీన స్థితికి అద్దం పడుతోంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సిటీ, రూరల్ టీడీపీ ఇన్చార్జిలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇరువురు పొలిటికల్ షో చేయడానికే పరిమితమయ్యారని క్షేత్రస్థాయిలో టీడీపీ అభ్యర్థులు వాపోతున్న వైనం తేటతెల్లమవుతోంది. టీడీపీపై ఉన్న అభిమానంతో బరిలోకి దిగామని, స్థానిక నాయకులు సహకరించడం లేదని బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి సైతం అండగా లేకపోవడంతో బరి నుంచి అర్ధాంతరంగా వైదొలుగుతున్నారు. మరో వైపు వైఎస్సార్సీపీకి అపార ప్రజామద్దతు దక్కుతున్న నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ అభ్యర్థులు ఇదే బాటలో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కార్పొరేషన్ ఎన్నికల్లో 28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మద్దినేని ధనలక్ష్మి పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టించింది. అధినేత చంద్రబాబుతో అభ్యర్థి ధనలక్ష్మి భర్త శాంతినాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉండడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు బంధువులు కూడా. అయితే వీరు పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం మీడియా ముఖంగా చెప్పడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నెల్లూరులో తిష్టవేసినా నష్ట నివారణను అదుపు చేయలేని దుస్థితిలో ఉండిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఇద్దరి పోకడలతోనే... నామినేషన్ల గడువుకు మూడు రోజుల ముందు తమపై ఒత్తిడి తెచ్చి ఆర్థిక సహకారం అందిస్తామని నామినేషన్లు వేయించారని చెబుతున్నారు. అన్ని డివిజన్లలో పోటీ చేయించామని చెప్పుకునేందుకు చూపించిన ఆరాటం అభ్యర్థులకు అండగా నిలవడంలో ఆ ఇద్దరు నేతలు ముఖం చాటేశారని, స్థానికంగా నాయకుల సహకారం లేకపోగా, అర్ధరాత్రి వేళల్లో ఇంటి వద్దకు వచ్చి పార్టీలో ఉన్నారా.. ఫిరాయించారా అనే ధోరణిలో వాకబు చేయడాన్ని వీరు అవమానంగా భావించారు. ఆత్మాభిమానం దెబ్బతినిందని, ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో ఆదుకోలేదన్న విషయాన్ని బహిర్గతం చేస్తూ, పోటీ నుంచి విరమిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని 28వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మద్దినేని ధనలక్ష్మి దంపతులు స్పష్టం చేశారు. -
నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..
సాక్షి, నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మున్వర్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. తన అనుచరులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 'పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ నేతలు ఆకర్షితులవుతున్నారు. ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ములేక టీడీపీ అనైతిక పొత్తులకు పాల్పడుతోంది. లోపాయికారీ ఒప్పందాలతో కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తోంది. అన్ని పార్టీలు కలిసొచ్చినా ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే నిలుస్తారు. 54 డివిజన్లలో విజయడంఖా మోగించబోతున్నాము' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చదవండి: (పరమ పవిత్రం మల్లన్న దివ్య పరిమళ ‘విభూది’) -
టీడీపీకి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు
-
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న వైస్సార్సీపీ శ్రేణులు
-
కాంగ్రెస్ వడివడిగా.. జీవన్‌రెడ్డికి వరంగల్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతోపాటు ఇతర వార్డు సభ్యుల ఎన్నికలకు కాంగ్రెస్ వడివడిగా సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పోలింగ్‌కు చాలా తక్కువ సమ యం ఉండటంతో ఆగమేఘాల మీద పార్టీ యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికల కమిటీలను నియమించారు. ఈ కమిటీలకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఖరారుతోపాటు స్థానిక పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకొనే విషయంలో నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కూడా వారికే కట్టబెట్టారు. వరంగల్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఖమ్మంకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను కమిటీల కన్వీనర్లుగా నియమించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ స్థానిక నాయకత్వాలకే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగమంతా మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టాలని, ఈ ఎన్నికలు ముగిసే వరకు అక్కడే మకాం వేయాలని పార్టీ నేతలను ఉత్తమ్ ఆదేశించారు. రెండు కార్పొరేషన్ల కమిటీలివే... వరంగల్ కమిటీకి ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించగా, కో–కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును నియమించారు. ఇక కమిటీ సభ్యులుగా డీసీసీ అధ్యక్షుడు ఎన్. రాజేందర్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎస్. రాజయ్య, వరంగల్ నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఇన్చార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నామిండ్ల శ్రీనివాస్, కట్ల శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించారు. వరంగల్ నగరపాలక సంస్థలో ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వారిని కమిటీ ఎక్స్అఫీషియో సభ్యులుగా నియమించారు. ఇక ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. కమిటీ సభ్యులుగా డీసీసీ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్, సభ్యులుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జావెద్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి, పార్టీ నేతలు పరుచూరి మురళీకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం, జాముల శరత్‌కుమార్‌రెడ్డి, పి. రాధాకృష్ణ, కొత్త సీతారాములను నియమించారు. ఇక్కడ కూడా సిట్టింగ్ కార్పొరేటర్లు కమిటీ ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీ–ఫారాలు ఎన్నికల అధికారికే పార్టీ అభ్యర్థులుగా ఈ రెండు కార్పొరేషన్లలో పోటీ చేయనున్న అభ్యర్థులను నేడు ఖరారు చేయనున్నారు. ఆయా డీసీసీ కార్యాలయాల్లో ఎన్నికల కమిటీలు సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తాయి. అయితే అభ్యర్థుల బీ–ఫారాలను మాత్రం వరంగల్‌లో పీసీసీ పరిశీలకుడి ద్వారా, ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుడి ద్వారా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 22న నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లోనూ స్థానిక నాయకత్వాలకే అభ్యర్థుల ఖరారు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. స్థానిక నాయకులందరూ కలసి అభ్యర్థులను నిర్ణయిస్తారని, వారే ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలోనూ ప్రచార బాధ్యతలను ఎన్నికల కమిటీలకే అప్పగిస్తూ ఉత్తమ్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: మినీ మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ గెలుపు గుర్రాల వేట -
మినీ మున్సిపోల్స్‌లో టీఆర్ఎస్ గెలుపు గుర్రాల వేట
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును టీఆర్ఎస్ ముమ్మరం చేసింది. వరంగల్‌లో 66, ఖమ్మంలో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని పార్టీ ఆదేశించింది. దీంతో కార్పొరేషన్ల డివిజన్లు, మున్సిపల్ వార్డులవారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే చాలా చోట్ల ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక మంత్రులు, ఎమ్మెల్యేలకు తలకు మించిన భారంగా తయారైంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారాలు సమర్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ఏకాభిప్రాయం కుదిరిన డివిజన్లు, వార్డుల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేసి ఏకాభిప్రాయం కుదరని ఒకటీ అరా స్థానాల్లో 22లోగా బలమైన అభ్యర్థులను గుర్తించి బీ ఫారాలు ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. జీహెచ్ంఎసీ ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్న చోట కూడా సిట్టింగ్ కార్పొరేటర్ల ఒత్తిళ్లకు తలొగ్గి మళ్లీ టికెట్లు ఇవ్వడం నష్టం చేసిందని పార్టీ గుర్తించింది. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒత్తిళ్లకు లొంగకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లకు పార్టీ ఇన్చార్జీలు.. ఎన్నికలు జరుగుతున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్చార్జీలను నియమించారు. వరంగల్ కార్పొరేషన్లో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖమ్మం కార్పొరేషన్‌కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించనుననారు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, పరకాల, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో వరంగల్ కార్పొరేషన్ విస్తరించి ఉండగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. దీంతో సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేయడంలో పార్టీ ఇన్చార్జీలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిపై ఇన్చార్జీలు నివేదికలు సమర్పించనున్నారు. వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచారం తదితరాలను సమన్వయం చేయనున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఒంటి చేత్తో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నిర్వహిస్తుండగా కొత్తూరులో వి.శ్రీనివాస్‌గౌడ్, అచ్చంపేటలో నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌లో జగదీశ్‌రెడ్డి, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. టికెట్ల కోసం పోటెత్తుతున్న అభ్యర్థులు... మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తుతుండటంతో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది. ఒక్కో డివిజన్, వార్డులో సగటున నలుగురు చొప్పున పోటీ పడుతుండటంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. శనివారం సాయంత్రం వరకు 43 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీలో రెండు విడతల్లో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మిగతా మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఒక్క అభ్యర్థి పేరునూ ప్రకటించకపోవడం ఆశావహుల నడుమ టికెట్ల కోసం నెలకొన్న పోటీకి అద్దం పడుతోంది. ఆదివారం మధ్యాహ్నంలోగా 80 శాతానికిపైగా అభ్యర్థులు ఖరారయ్యే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. వరంగల్ కార్పొరేషన్ మినహా మిగతా చోట్ల బీజేపీతో పెద్దగా పోటీ ఉండక పోవచ్చనే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్... ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులకు డివిజన్లవారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. చదవండి: అందని ఆక్సిజన్ -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఏలూరులో ఎన్నికలు నిలిపి వేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ సరిగా చేయడం లేదని గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటర్ల జాబితాను సరి చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో 14న పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన, జనగణన, కులగణన సరిగా చేయకుండానే ఎన్నికలు జరుపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముగిసిన ప్రచారం పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ చదవండి: మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్ -
పోస్ట్‌మేన్‌లా ఎన్నికల కమిషనర్: అచ్చెన్నాయుడు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టుమేన్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడంపై కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తిరుపతితోపాటు ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, అక్రమ కేసులు మోపుతున్నారని ఆరోపించారు. -
ఎన్నికల వేళ టీడీపీ ఎంపీ కేశినేనికి ఎదురుదెబ్బ
విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడిన వివాదం దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయవాడలోని కేశినేని నానికి సంబంధించిన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే 34వ డివిజన్ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఏర్పడింది. 34వ డివిజన్ టికెట్ ఇచ్చే వరకు కదలమని ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! -
‘కార్పొరేషన్’ బరిలో ట్రాన్స్‌జెండర్
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి సారిగా ట్రాన్స్‌జెండర్ బరిలోకి దిగారు. నగరంలోని 16వ డివిజన్ అభ్యర్థిగా తెలంగాణ ట్రాన్స్‌జెండర్ సమితి నాయకులు జరీనా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ, తనను గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్స్ సమితి కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లత తదితరులు పాల్గొన్నారు. -
హడావుడిగా ‘మున్సిపోల్స్’ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం పాలక మం డళ్ల గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారులను నియమించినందున ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుండా హడావుడిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, లోక్‌సత్తా విజ్ఞప్తి చేశాయి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును 119 రోజుల గడువు కోరి, మరోవైపు ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)పై ఒత్తిడిని తీసుకొస్తోందని విమర్శించాయి. సోమవారం ఎస్ఈసీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, గట్టు రామచంద్రరావు (టీఆర్ఎస్) మర్రి శశిధర్‌రెడ్డి, జి.నిరంజన్ (టీపీసీసీ), మల్లారెడ్డి (బీజేపీ) రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీటీడీపీ), పల్లా వెంకటరెడ్డి (సీపీఐ), ఎన్.నర్సింహారెడ్డి (సీపీఎం), సయ్యద్ అమీనుల్ జాఫ్రీ (ఎంఐఎం), ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఓటర్ల డ్రాఫ్ట్ షెడ్యూల్ జారీ, రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన తేదీలతో పాటు 15న నోటిఫికేషన్ ఇచ్చి ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్ఈసీ వర్గాలు తెలిపాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానంతరం వెల్లడించారు. కాగా, ఈనెల 10న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధమవుతుందని, ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులతోపాటు దీనికి సంబంధించి సలహాలు, సూచనలు 12వ తేదీలోపు మున్సిపల్ కమిషనర్‌కు తెలియజేయవచ్చునని కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. 14న ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అదే రోజు రిజర్వేషన్ల జాబితాను కూడా ఇస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారన్నారు. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 19 వరకు పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తామన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్ కేంద్రాలపై మున్సిపాలిటీల వారీగా ఈనెల 13న రాజకీయ పక్షాలతో సమావేశం ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార ఖర్చు పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని ఇంకా ఖరారు చేయలేదని వివరించారు. ఎన్నికల నివేదికల్లో మాత్రం ఖర్చు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రచార ఖర్చును రెండింతలు చేశారు. మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఇప్పటివరకు రూ. 1 లక్ష ఉండగా... ఈ ఎన్నికల్లో రూ. 2 లక్షలకు పెంచుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో గతంలో రూ. 1.50 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ. 3 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. -
మున్సిపల్ ఎన్నికలు.. ఎవరి గుర్తులు వారికే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ భేటీలో రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన, ఓటర్ల తుది జాబితా వంటి అంశాలపై వారితో చర్చించారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఈనెల 10న సిద్ధమవుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 15 రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ లోపే ఎన్నికలు జరుపుతామని.. సుమారు 50 లక్షల ఓటర్లు పొల్గొనే అవకాశం ఉందని చెప్పారు. సమావేశం అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ.. పలు వివరాలను వెల్లడించారు. ‘‘మున్సిపల్, వార్డుల జాబితాను త్వరలోనే విడుదల చేస్తాం.12వ తేదీలోపు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వచ్చు. 14వ తేదీ వరకు ఎన్నికల ఓటర్ జాబితాను ప్రకటిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకొని నూతన జాబితా సిద్ధం చేస్తాం. ప్రతి వార్డులో ఎంత మంది ఉన్నారో తెలిశాక పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లు ఉండే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నికలను నిర్వహిస్తాం. దాదాపు పాత పోలింగ్ కేంద్రాలనే ఈ ఎన్నికలకు కూడా ఉపయోగిస్తాం. ఈ నెల11న అధికారులతో మరోసారి సమావేశం ఉంటుంది. 13వ తేదీన పోలింగ్ కేంద్రాలపై మున్సిపల్ కమిషనర్లతో సమావేశం అవుతాం. 14న రిజర్వేషన్లు ఖరారు అవుతాయి. ఆ తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. గుర్తింపు పొందిన పార్టీల గుర్తులు వారికే కేటాయిస్తాం’’ అని తెలిపారు. నాగిరెడ్డితో భేటీలో హాజరైన రాజకీయ పార్టీల నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నిరంజన్, బీజేపీ మల్లారెడ్డి, సీపీఐ పళ్ల వెంకట్ రెడ్డి, సీపీఎం నంద్యాల నర్సింహారెడ్డి, ఎంఐఎం జాఫ్రీ మున్సిపల్. -
‘బీజేపీ అలా చేయకుంటే మేమే గెలిచేవాళ్లం’
లక్నో: కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ పాల్పడిందని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ఎన్నికల ఫలితాలపై శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంపరింగ్‌కు పాల్పడకుంటే తమ పార్టీ అభ్యర్థులే గెలిచేవారన్నారు. 2014 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయినా మొత్తంగా చూస్తే మేం ఓటమి చెందినట్లు కాదని, రెండో స్థానంలో నిలిచామన్నారు. ఈ విజయం కేవలం దళితుల మద్దతుతోనే పొందలేదని ఇతర వెనుకబడిన వర్గాలు, ముస్లింలు సైతం తమ పార్టీకి మద్దతు తెలిపాయని ఆమె పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరి ఆశయం.. ప్రతి ఒక్కరి సంతోషం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించామన్నారు. అందరి సంక్షేమం కోసం బీఎస్పీ పాటుపడుతోందని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నీతి, నిజాయితీకి కట్టుబడి ఉంటే.. దేశప్రజలు మీ వైపు ఉన్నారని భావిస్తే ఈవీఎంలను నిషేదించి బ్యాలెట్‌పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ఆమె సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ గెలువదన్నారు. ఇక 16 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 14 చోట్ల బీజేపీ రెండు చోట్ల బీఎస్పీ (అలీగఢ్, మీరట్ నగరాల) మేయర్ పదవులను కైవసం చేసుకుంది. -
యూపీలో బీజేపీ విజయభేరి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 16 మునిసిపల్ కార్పొరేషన్లలో 14 చోట్ల బీజేపీ జెండా ఎగురవేసింది. ఆశ్చర్యకరంగా బీఎస్పీ అలీగఢ్, మీరట్ నగరాల మేయర్ పదవులను కైవసం చేసుకుంది. అలహాబాద్, వారణాసి, అయోధ్య, గోరఖ్‌పూర్, ఘజియాబాద్, బరేలీ, ఆగ్రా, ఫిరోజాబాద్, మథుర, లక్నో, కాన్పూర్, సహరాన్పూర్, ఝాన్సీ, మొరాదాబాద్లలో బీజేపీ అభ్యర్థులే మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారు. కాంగ్రెస్ కంచుకోట, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి పాగా వేసింది. 2019లో క్లీన్‌స్వీప్: యోగి ఈ విజయంపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అమేథీ సహా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం చరిత్రాత్మకమన్న సీఎం.. మోదీ దార్శనికత, అమిత్ మార్గనిర్దేశత్వం కారణంగా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ప్రజలు కుల, కుటుంబ, ప్రలోభపెట్టే రాజకీయాలను పక్కనపెట్టి బీజేపీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపారనేది సుస్పష్టమైందని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. కాగా, జీఎస్టీకి ప్రజల మద్దతుకు ఈ ఎన్నికల ఫలితాలు తార్కాణమని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. వ్యాపారులకు అనుకూల వాతావరణం నిర్మాణం జరుగుతోందన్నారు. ‘జీడీపీ వృద్ధి, యూపీ ఎన్నికల ఫలితాలు.. ఇలా ఎటుచూసినా శుభవార్తలే వినిపిస్తున్నాయి’ అని ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో బీజేపీ కార్యకర్తలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ప్రసంగంలో పేర్కొన్నారు. బీజేపీలో జోష్.. కాంగ్రెస్‌లో నిరాశ ఈ ఫలితాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి అదనపు బలాన్నివ్వగా.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌కు పగ్గాలు అప్పజెప్పనున్న నేపథ్యంలో ఈ ప్రదర్శన కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. లక్నోకు తొలి మహిళా మేయర్ యూపీ రాజ ధాని లక్నోకు ప్రథమ మహిళా మేయర్‌గా సం యుక్త భాటియా చరిత్ర సృష్టించా రు. ప్రత్యర్థిపై 1,31,356 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 19 మంది బరిలో నిలవగా.. కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు వరుసగా మూడు, నాలుగు స్థానాలకు పరిమితమయ్యారు. దేశానికి మొదటి మహిళా గవర్నర్‌గా సరోజినీ నాయుడు (1947–1949), తొలి మహిళా సీఎంగా సుచేతా కృపలానీ (1963–1967) యూపీ వారే. -
ఎలక్షన్... మంత్రులకు టెన్షన్
♦ అంటీముట్టనట్టుగా మంత్రి యనమల ♦ చిన రాజప్పకు పరీక్ష సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ కీలక నేతలకు కఠిన పరీక్షగా మారాయి. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత.. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. చంద్రబాబు అంటే మండిపడుతున్న కీలక సామాజికవర్గాలు.. అభివృద్ధికి నోచుకోని కాకినాడ స్మార్ట్‌సిటీ.. ఇలా అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇక జిల్లాకు చెందిన మంత్రులకైతే అగ్నిపరీక్షే. ప్రజావ్యతిరేకతను ఎదురొడ్డి కాకినాడ కార్పోరేషన్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై మంత్రులు ముల్లగుల్లాలు పడుతున్నారు. ఆమడ దూరంలో యనమల ఇటు పార్టీలోను.. అటు మంత్రివర్గంలో సీనియర్‌గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణడు కార్పోరేషన్ ఎన్నికలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనెప్పుడూ ఇదే పంధాను అనుసరిస్తుంటారు. కాని గత కొంతకాలంగా జిల్లాలో తనమాట చెల్లుబాటు కాని పరిస్థితుల్లో పూర్తిగా దూరంగా ఉండే అవకాశముందని టీడీపీ నేతలంటున్నారు. జెడ్పీ చైర్మన్ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మాటకే అదిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే వాదనలు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు రావడం యనమల పాత్ర చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక అంతా సర్వేలు, ఐవీఆర్ఎస్ విధానంతో ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడం కూడా ఆయన పాత్ర పెద్దగా లేదన్నట్టుగా చేసింది. రాజప్ప చుట్టూ ఉచ్చు... ఇక ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మాత్రం ఈ ఎన్నిక అగ్నిపరీక్షే. రాజప్ప కార్పొరేషన్‌ను ఆనుకుని ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మార్పు వంటి విషయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల బాధ్యత కూడా పార్టీ ఆయనకే అప్పగించింది. దీంతో గెలిపించాల్సిన బాధ్యత సహజంగా రాజప్ప మీదనే ఉంది. రాజప్పకు సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలోను, ఉద్యమాన్ని ఆణిచివేసే విషయంలో రాజప్ప సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా ముద్రగడను ప్రతీ విషయంలోనూ టార్గెట్ చేస్తూ రాజప్ప మాట్లాడడం ద్వారా కాపువర్గీయులు రాజప్ప పేరు చెబితేనే మండిపడుతున్నారు. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ సామాజికవర్గం ఓట్లను పొందేందుకు కాపు మహిళకు మేయర్ పదవి కేటాయిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని ఆ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజప్ప ఆ సామాజికవర్గాన్ని ఎంత వరకు పార్టీ మెప్పించకువస్తారనేది వేచి చూడాల్సిందే. హోమ్... ఆర్థిక వంటి కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న రాజప్ప, యనమల ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే రాజకీయంగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తోంది. -
కార్పొరేషన్ ఎన్నికలు లేనట్టే
► తేల్చేసిన మంత్రి నారాయణ ► ఎన్నికలకు వెళితే పరాభవం తప్పదని సర్వేల్లో వెల్లడి ► ఏక కాల ఎన్నికలకు స్థానికత ముడి తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికలుపై గత కొంత కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెరదించారు. దేశ వ్యాప్తంగా ఏక కాల ఎన్నికలకు కేంద్రం యోచిస్తోంద ని చెబుతూ స్థానిక ఎన్నికలు కూడా అప్పుడే నిర్వహించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు మంత్రి నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేవని, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఏక కాల ఎన్నికలతోనే నిర్వహించనున్నట్టు తేల్చి చెప్పారు. ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టంలేకపోయినా మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలని చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం కొత్తగా ఏక కాల ఎన్నికలను తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల నుంచి పారిపోయేందుకు సిద్ధమైంది. ఊరిస్తూ వచ్చిన ఎన్నికల సందడిపై నీళ్లుచల్లడంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ వ్యక్తం అవుతోంది. అనుకున్నదే అయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కుంటి సాకులు చెబుతూ ఎన్నికలకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో న్యాయస్థానం దీనిపై స్పందిస్తూ కంటెంట్‌ను విధించింది. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఏడాది క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలను పంపుతూ వివిధ సాంకేతిక కారణాలు చూపుతూ కాల యాపన చేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్, మే నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. దీంతో ఈసీ కూ డా కుల, మహిళా ఓటర్ల గ ణనకు ఆదేశించింది. ప్రసుత్తం ఈ నెల చివరికి పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా సిద్ధం కానుంది. ఎన్నికలపై అందరికీ అనుమా నం వున్నా మ రో రెం డు మూడు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగుతాయనే అనుకున్నారు. ఈ సమయంలో ఏక కాల ఎన్నికల పేరుతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లడంలేదని తేల్చేసింది. సర్వేల్లో వెనుకంజే కారణమా? తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. ప్రజల్లో అధికార పార్టీ బలం ఏ మేరకు ఉంది.. తెలుగదేశం పార్టీ ఎన్నికల హామీల అమలుపై ఏమనుకుంటున్నారు.. కాపు రిజర్వేషన్, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గుర్తించేందుకు ఇలా 18 ప్రశ్నలతో సర్వేను నిర్వహించారు. ఏకంగా ప్రభుత్వం రంగంలోకి దిగి గత ఏడాదిలోనే మూడు పర్యాయాలు తిరుపతిలో కులం, మహిళా, యువత ఆధారంగా వేర్వేరుగా సర్వే చేసింది. అన్ని సర్వేల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయినా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుని, ఆ ఫలితాల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఊహించని విధంగా మేధావి వర్గం అధికార పార్టీ అభ్యర్థులను చిత్తు చేయడంతో కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లకపోవడమే మంచిదని భావించింది. ఇదే సమయంలో ఏక కాల ఎన్నికలు తెరైకి రావడంతో దీనికి ముడిపెడుతూ కార్పొరేషన్ ఎన్నికలపై నీళ్లు చల్లేశారు. ఇదే విషయాన్ని న్యాయస్థానం ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. -
బాబువి..దిగజారుడు రాజకీయాలు
– ముస్లిం మైనార్టీ ఓటర్ల కోసమే పాదయాత్ర – వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రావు – వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ధ్వజం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మునిసిపల్ ఎన్నికల్లో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య మండిపడ్డాడు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజాధనం వృథాకావడం తప్ప ప్రయోజనం ఉండదనా్నరు. రెండున్నరేళ్లలో సీఎం కర్నూలుకు 13 సార్లు వచ్చి 23 హామీలు ఇచ్చారని, అందులో ఒక్కదానిని కూడా నెరవేర్చాలేదని, ఇందుకు దమ్ముంటే టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీ ఓటర్ల కోసం పాతబస్తీలో పాదయాత్ర చేసినా, పడుకొని పోయినా వారు బాబును నమ్మరని పేర్కొన్నారు. వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఆ ప్రాంతంలో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి నిరోధక పార్టీగా సీఎం ఆనడం దారుణమన్నారు. తమ పార్టీ అధినేత జగన్, తాము ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వం చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో మంచి పనులకు తమ సహకారముంటుంందని ఈ విషయాన్ని టీడీపీ నాయకులు గమనించాలని హితవు పలికారు. 2014 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారన్నారు. అందులో గుండ్రేవుల రిజర్వాయర్, టెక్స్టైల్ పార్కు, జింకలపార్కు, మైనింగ్ యూనివర్సిటీ ఉన్నాయన్నారు. హామీలిచ్చి రెండేళ్లు గడిచినా అతీగతీ లేదనా్నరు. తీవ్ర వర్షాభావంతో నష్టపోయిన అన్నదాతలను ఇప్పటి వరకు ఆదుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేకు అవమానం కోల్స్ కళాశాలలో జరిగిన పార్టీ సమావేశంలో దళిత ఎమ్మెల్యే మణిగాంధీకి అవమానించారని బీవై రామయ్య అనా్నరు. నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియకు సీఎం సభలో కూర్చునేందుకు సీటు లేకుంటే దళిత ఎమ్మెల్యే అయినా మణిగాంధీని లేపి వారిని కూర్చోబెట్టడం దారుణమన్నారు. టీడీపీలోకి వెళ్లిన వలస నాయకులకు అక్కడ ఎలాంటి మర్యాద ఉందో ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్: హఫీజ్ ఖాన్ కర్నూలు నగరంలో సీఎం పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్ అయిందని, నగరవాసులెవరూ ఆయన వెంట నడవలేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హాఫీజ్‌ఖాన్ పేర్కొన్నారు. కర్నూలుకు వచ్చిన ముఖ్యమంత్రి నగరానికి వరద రక్షణ గోడ , అండర్ డ్రెయినేజి, సుద్ధవాగు, రోడ్ల నిర్మాణానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. ముస్లింలను మభ్యపెట్టేందుకు ఉర్దూ యూనివర్సిటీని ప్రారంభించిన దానికి ఇంతవరకు సెంటుభూమి, ప్రొఫెసర్లను నియమించలేదన్నారు. దోమలపై దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం నగరంలో ఎక్కడ దోమలు లేకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఇందులో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మంచినీటి సమస్యను పట్టించుకోని సీఎం– నరసింహులు యాదవ్ కర్నూలు నగర జనాభా పెరగడంతో కొన్ని కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని వైఎస్ఆర్సీపీ నగర కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్ పేర్కొన్నారు. అయితే, నీటి సమస్య పరిష్కారానికి సీఎం ఎలాంటి హామీ ఇవ్వకపోవడాన్ని బట్టి ఆయనకు కర్నూలు ప్రజలపై ఉన్న ప్రేమ ఏ పాటిదో తెలిసిపోయిందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయకుమారి, నాయకులు మద్దయ్య, జహీర్‌అహ్మద్‌ఖాన్, ఫిరోజ్‌ఖాన్, గోపీనాథ్‌యాదవ్, భాస్కరరెడ్డి, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
5న కర్నూలులో ముఖ్యమంత్రి పాదయాత్ర
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 5న నగరంలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జనచైతన్య యాత్రలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో.. ముఖ్యంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న పాతబస్తీలో మూడు గంటల పాటు మూడు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సాగనుంది. గురువారం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రజాప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాదయాత్ర నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, శాసనమండలి సభ్యుడు శిల్పాచక్రపాణిరెడ్డి, సుధాకర్‌బాబు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్‌రెడ్డి, ఎస్పీ ఆకె రవికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోల్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు. పర్యటన సాగుతుందిలా... - 5వ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం కర్నూలుకు చేరుకుంటారు. - మధ్యాహ్నం 1.30 వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ( కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళాశాల, అమ్మవారిశాల, వన్‌టౌన్, రాధాకృష్ణ టాకీస్ మీదుగా కోల్స్ కళాశాల వరకు మూడు కిలోమీటర్ల పాదయాత్ర. కోల్స్ కళాశాలలో జనచైతన్య యాత్ర. అమృత్ స్కీం ప్రారంభోత్సవం. ) - ఆ తర్వాత 2.30 వరకు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో భోజనం, విశ్రాంతి. - 2.30 నుంచి 4.30 వరకు అవుట్డోర్ స్టేడియంలో డ్వాక్రా మహిళలు, రైతులతో బహిరంగ సభ. డ్వాక్రా మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి కింద రూ.127 కోట్లు మహిళల ఖాతాలకు జమ. - 2015 కరువుకు సంబంధించి రైతులకు రూ.277 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల. - చంద్రన్న బీమా పథకం కింద 87 క్లెయిమ్‌లకు పరిహారం పంపిణీ. -
'ప్రత్యేక ప్యాకేజీ పచ్చి మోసం'
-ఓటమి భయంతోనే కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం వెనుకంజ -విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాల్సిందే - వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అనకాపల్లి: ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ మసిబూసి మారేడుకాయ చేసే చందంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఇష్టాగోష్టిలో స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ ఐదేళ్లు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులనే ప్యాకేజీగా చిత్రీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీపై నిజంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉత్తర్వులు జారీ చేశారా అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ రెండేళ్లుగా దీక్షలు, ధర్నాలు, యువభేరి వంటి కార్యక్రమాలు నిర్వహించిందని, ఈ క్రమంలోనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విశాఖపట్నంలో పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి నవంబర్ 6న బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. హోదా వచ్చేవరకు తమ పార్టీ ఉద్యమాలు ఆపదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు వెస్సార్సీపీ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఉద్యమాలు చేశారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ విశాఖకు రైల్వే జోన్ ఇచ్చితీరాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ బిల్లును సమర్థిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఇందులో విశాఖ నగర పాలకసంస్థకు కూడా ఉందని, అయితే టీడీపీకి విజయావకాశాలు లేకపోవడంతో కాలయాపన చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలు ఎదుర్కోలేకే...
గుంటూరు : రాష్ట్రంలో కార్పొరేషన్ ఎన్నికలను ఎదుర్కోలేకే టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను అడ్డదార్లలో తొలగిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం, పాత గుంటూరు, పట్టాభిపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారన్నారు. ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేస్తామని అప్పిరెడ్డి హెచ్చరించారు. -
కార్పొరేషన్ ఎన్నికలపై బాబు తర్జనభర్జన
-
బీసీ ఉద్యమాలను బలోపేతం చేస్తాం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు కర్నూలు(అర్బన్): బీసీ సమస్యలపై ఉద్యమాలను బలోపేతం చేయనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. బుధవారం స్థానిక టీజీవీ కళా క్షేత్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వై నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కర్నూలు, కడప. అనంతపురం జిల్లాల్లో బీసీలు అధికంగా ఉన్నారని, వీరంతా రాజకీయంగా ఎదగాలని శంకరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ భవ న్ల ఏర్పాటుకు కర్నూలు జిల్లాను మార్గదర్శకంగా చూపిస్తామన్నారు. బీసీలను అన్ని పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంఘం నేత నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్మన్రాజు పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలన్నారు. యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు యు సురేష్, కేతూరి మధు, విజయకుమార్, వాడాల నాగరాజు, జీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కలిసిన నేతలు.. కలవని మనసులు
కర్నూలులో నువ్వానేనా! ► ఆధిపత్యం కోసం పార్టీ మారిన నేత ఆరాటం ► తన వర్గంలో చేరితే మేయర్‌ను చేస్తానని ఆఫర్ ► నగరంలో నందికొట్కూరు తరహా రాజకీయాలు? ► కార్పొరేషన్ ఎన్నికలకు ముందే రాజుకుంటున్న చిచ్చు ► కలిసి పనిచేస్తామంటూనే కత్తులు దూస్తున్న వైనం సాక్షి ప్రతినిధి, కర్నూలు: సొంత పార్టీలో మరో వర్గంలోని నేతలను తన వర్గంలో చేర్చుకుని పార్టీ మారిన తరహాలో కండువాలు కప్పుకునే నందికొట్కూరు తరహా అధికార పార్టీ రాజకీయం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికీ పాకిందా? అధికార పార్టీలో ఉన్న ఇరువురు నేతల మధ్య క్రమంగా దూరం పెరుగుతోందా? కలిసి పనిచేస్తామంటూనే ఆధిప్యత రాజకీయాలకు తెరలేసిందా? అనే వరుస ప్రశ్నలకు నిజమేనని ఆ పార్టీలోని కొందరు నేతలే ఘంటాపథంగా చెబుతున్నారు. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రంగా చేసుకుని కొత్తగా అధికార పార్టీలో చేరిన నేత ఒకరు అవతలి వైపున్న నేతలకు గాలం వేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తన వెంట నడిస్తే కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కలిసి పనిచేస్తామని ప్రకటనలు ఇస్తూనే కత్తులు దూసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అధికార పార్టీలో చర్చ మొదలయింది. ఇక్కడ నాదే పైచేయి రానున్న కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు కేంద్రంగా అధికార పార్టీలో రాజకీయం జరుగుతోంది. వాస్తవానికి ఇప్పటికీ కార్పొరేషన్ మేయర్ పీఠం ఏ వర్గానికి కేటాయిస్తారనే విషయంలో స్పష్టత రాలేదు. గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం బీసీ మహిళకు అవకాశం ఉంది. అయితే.. మారిన జనాభా, వార్డుల నేపథ్యంలో ఎవరికి పీఠం దక్కుతుందనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా బీసీ జనరల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరికొద్ది మంది అధికార పార్టీ నేతలు ఓసీ జనరల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. దీని ఆధారంగా ఎన్నికల ముందు నుంచి అధికార పార్టీలో ఉండి.. తాజాగా పెద్దల సీటు సంపాదించిన నేత వెనుక నడుస్తున్న బీసీ నేతకు తాజాగా పార్టీలో చేరిన నేత గాలం వేసినట్టు సమాచారం. కార్పొరేషన్లో పైచేయి తనదేనని.. సీట్ల కేటాయింపులోనూ తన మాటే చెల్లుబాటు అవుతుందనే ప్రచారం ఆయన చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. తన వర్గంలో ఉంటే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు గెలిపించుకుంటానని కూడా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో తనదే పైచేయి అనే సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోననే చర్చ అధికార పార్టీలో మొదలయింది. -
హామీల అమలుకు పోరాటాలు
♦ కార్పొరేషన్ ఎన్నికల్లోప్రజాతీర్పును స్వాగతిస్తున్నాం ♦ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ♦ సమీక్ష సమావేశంలో ఎంపీ పొంగులేటి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. - సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పోరాటం సాగిద్దామని నగరంలోని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేషన్ ఎన్నికల కో-ఆర్డినేటర్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికలకు నగరంలో సీఎం కేసీఆర్ పర్యటించి, అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్య పెట్టారని, టీఆర్ఎస్కు ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామన్నట్టుగా భయభ్రాంతులను చేశారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించిన ప్రజలకు సేవ చేయడం ద్వారా వారి రుణం తీర్చుకుంటామని అన్నా రు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా ఈ ఎన్నికలపై కొంతవరకు పడిందని, పాలకుల అధికార దుర్వినియోగం తోడైందని అన్నారు. ‘‘ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు.. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీల నాయకులు నన్ను సంప్రదించారు. మీ పార్టీకి (వైఎస్సార్ సీపీకి) పదికి పైగా సీట్లు వస్తాయని; మద్దతునిస్తే మేయర్, ఉప మేయర్ పదవులను పంచుకుందామని అన్నారు’’ అని చె ప్పారు. ప్రతి ఓటమి వెనుక ఒక గెలుపు ఉంటుం దన్న విషయాన్ని పోటీ చేసిన అభ్యర్థులు గమనంలో ఉంచుకుని.. ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని, సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. దుష్ర్పచారం సాగిస్తున్నారు ‘‘రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రాబల్యం తగ్గిందని, ఈ పార్టీ నాయకులు త్వరలోనే వేరే పార్టీలో చేరతారని కొందరు దుష్ర్పచారం సాగిస్తున్నారు. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’’ అని అన్నారు. ‘‘గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పార్టీ బలమేమిటో అందరూ చూశారు. దానిని మర్చిపోయి ఇలా దుష్ర్పచారం సాగిస్తే ప్రజలు సహించరు’’ అని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. సమావేశంలో 4, 32 డివిజన్ల కార్పొరేటర్లు సలువాది వెంకయ్య, దోరేపల్లి శ్వేత; పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా దయానంద్, కార్యదర్శి ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, సంయుక్త కార్యదర్శులు షర్మిలాసంపత్, సూతగాని జైపాల్; జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గుండా వెంకటరెడ్డి; పాలేరు, వైరా నియోజకవర్గాల ఇన్చార్జిలు సాధు రమేష్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్; జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు బీమా శ్రీధర్, కొంగర జ్యోతిర్మయి, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి; యువజన, మహిళ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి.ముస్తఫా, కీసర పద్మజారెడ్డి, గుమ్మా రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ‘తీన్’మార్
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలో టీఆర్ఎస్ ఘన విజయం ♦ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలో ఘన విజయం ♦ వరంగల్‌లో 58 డివిజన్లకు 44 డివిజన్లలో జయకేతనం ♦ ఖమ్మంలో టీఆర్ఎస్ ఖాతాలోకి 34 డివిజన్లు ♦ అచ్చంపేటలో అన్ని స్థానాలు క్లీన్‌స్వీప్ ♦ మూడు చోట్ల ఖాతా కూడా తెరవలేకపోయిన టీడీపీ ♦ వరంగల్, ఖమ్మంలో తొలిసారి మేయర్ పగ్గాలు చేపట్టనున్న అధికార పార్టీ గ్రేటర్ వరంగల్ (58 డివిజన్లు) టీఆర్ఎస్ 44 కాంగ్రెస్ 4 బీజేపీ 1 సీపీఎం 1 స్వతంత్రులు 8 ఖమ్మం (50 డివిజన్లు) టీఆర్ఎస్ 34 కాంగ్రెస్ 10 వైఎస్సార్ సీపీ 2 సీపీఎం 2 సీపీఐ 2 అచ్చంపేట నగర పంచాయతీ (20 వార్డులు) టీఆర్ఎస్ 20 మహాకూటమి 0 సాక్షి, వరంగల్/ఖమ్మం/అచ్చంపేట/హైదరాబాద్: గులాబీ మరోసారి గుబాళించింది. పుర ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లపై తొలిసారి గులాబీ జెండా ఎగరేసింది. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలో క్లీన్‌స్వీప్ చేసి ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈ మూడు పురపాలికలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 44 డివిజన్లలో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. బీజేపీ, సీపీఎంలు ఒక్కో డివిజన్లో గెలిచాయి. ఇక ఖమ్మం కార్పొరేషన్‌లోని 50డివిజన్లలో టీఆర్ఎస్ 34 డివిజన్లలో నెగ్గింది. కాంగ్రెస్ 10, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2, సీపీఎం 2, సీపీఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అచ్చంపేట నగర పంచాయతీలో విజయం పూర్తిగా ఏకపక్షమైంది. ఇక్కడ 20కి 20 వార్డులను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. వరంగల్‌లో రెబల్సే పోటీదారులు వరంగల్ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ తొలిసారి దక్కించుకోనుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్కు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయాయి. టీఆర్ఎస్ టికెట్ దక్కని వారే పార్టీకి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. వరంగల్‌కు ‘గ్రేటర్’ హోదా వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 44 చోట్ల నెగ్గగా.. ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు 8 డివిజన్లలో విజయం సాధించారు. రెబల్స్‌గా బరిలో దిగినా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంతో వారంతా టీఆర్ ఎస్ సభ్యులుగానే కొనసాగే వీలుంది. గతంలో ఎప్పుడూ లేనంత దారుణంగా కాంగ్రెస్ కేవలం 4 డివిజన్లకు పరిమితమైంది. గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నిక ఈ నెల 15న జరగనుంది. మేయర్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఖమ్మంలో నల్లేరుపై నడకే.. ఖమ్మంలో విపక్షాల నుంచి గట్టి పోటీ ఉంటుందని భావించినా పరిస్థితి అలా కనిపించలేదు. కాంగ్రెస్ 10 స్థానాల్లో నెగ్గి పరువు దక్కించుకున్నా.. 48 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. ఓట్ల లెక్కింపులో మొదట్నుంచీ గులాబీ పార్టీ మెజారిటీ కనబరచడంతో.. ఒక దశలో ఆ పార్టీకి 40 స్థానాలు వస్తాయని భావించారు. అయితే రెండు, మూడు రౌండ్లలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ కొన్ని డివిజన్లు దక్కించుకోవడంతో టీఆర్ఎస్ 34 డివిజన్లకు పరిమితమైంది. ఖమ్మంలో కాంగ్రెస్.. సీపీఐతో పొత్తు పెట్టుకోగా, మిగతా పార్టీలన్నీ ఒంటరిగా బరిలో నిలిచారుు. 2005లో ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పొత్తుతో వెళ్లాయి. అప్పట్లో మొత్తం 41 వార్డులకు కాంగ్రెస్ 9, సీపీఎం 18, సీపీఐ 2, టీడీపీ 12 వార్డులు దక్కించుకున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే టీఆర్ఎస్ పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. మేయర్ పదవిని ఎస్టీ(జనరల్) అభ్యర్థికి రిజర్వ్ చేశారు. ‘అచ్చ’మైన విజయం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా పోటీ చేసినా.. టీఆర్ఎస్ ముందు నిలవలేకపోయాయి. ఇక్కడ 20కి 20 వార్డుల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. నగర పంచాయతీలో 18,614 మంది ఓటర్లు ఉండగా... ఈ నెల 6న జరిగిన పోలింగ్‌లో 13,193 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 85 మంది నోటాకు ఓటేశారు. ఓట్ల లెక్కింపు ఐదురౌండ్లతోనే పూర్తయింది. 8, 9, 14 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మహాకూటమి అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. ఈ వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం 32, 33, 68 ఓట్ల మెజార్టీతో గెలిచారు. విజేతలకు కేసీఆర్ శుభాకాంక్షలు వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలో పార్టీకి అపూర్వ విజయం అందించిన ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం సీఎంను కలిశారు. వీరిని అభినందించిన కేసీఆర్.. ‘‘ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లు దీవించారు. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అభినందనలు’’ అని పేర్కొన్నారు. ఫలించిన మంత్రుల వ్యూహం రెండు కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో వ్యవహరించింది. ఈ మూడు చోట్లా ఎన్నికలు ఖాయమని తేలాక డివిజన్ల వారీగా సర్వేలు చేయించింది. ఎన్నికల ప్రకియ మొదలయ్యే సరికి అధికార పార్టీ కనీసం అయిదు సర్వేలు చేయించిందని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దించింది. మూడుచోట్లా ఆయా జిల్లాల మంత్రులకు ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పింది. మొదట్లో వరంగల్ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చూసినా.. రెబల్స్ బెడద పెరగడం, చివరకు ఎమ్మెల్యేలు కూడా అలక బూనడంతో సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌ను బరిలోకి దించారు. ప్రచారం చివరి రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రచారంలో పాల్గొని నగర అభివృద్ధికి హామీలు ఇచ్చారు. ఇక ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల బాధ్యతలు చూశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎన్నిక బాధ్యతలను చూశారు. -
టీడీపీకి మరో షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టంలా కనిపిస్తోంది. నిన్న గ్రేటర్ హైదరాబాద్‌కు జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ...నేడు వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం నగర పాలక సంస్థ, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పోటీ చేసిన ప్రతి చోట ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. వరంగల్‌లో 51 డివిజన్లలో, ఖమ్మంలో 48 డివిజన్లలో, అచ్చంపేటలో 4 వార్డులలో పోటీ చేసిన టీడీపీ ఏ ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్న టీడీపీకి ఇప్పుడు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట నగర పంచాయతీ ఫలితాలు మరో షాక్. -
మూడు రౌండ్లు.. మూడు గంటలు
ఇదీ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ తీరు ♦ మొత్తం డివిజన్లు 50 ♦ పోలైన ఓట్లు 1,79,827 ♦ పోలింగ్ కేంద్రాలు 265 ♦ బరిలో ఉన్న అభ్యర్థులు 291 ♦ లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు 20 ♦ ప్రక్రియలో పాల్గొనే అధికారులు 100మంది ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11గంటలలోపు తుది ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నా రు. మొత్తం 3 రౌండ్లుగా విభజించి.. ఒక్కో రౌండ్‌కు గంట చొప్పున సమయం కేటాయించి.. ఫలితాలు మూడు గంటల వ్యవధిలో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల బరిలో నిలబడి పోటాపోటీగా ప్రచా రం నిర్వహించిన అభ్యర్థుల్లో కౌంటింగ్ ప్రక్రి య ప్రారంభమవుతుండటంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. తొలుత అన్ని రాజకీయ పార్టీ ల నాయకుల సమక్షంలో పత్తి మార్కెట్లోని స్ట్రాంగ్‌రూమ్ సీల్ తీసి ఈవీఎంలను బయటకు తీసుకొస్తారు. ఉదయం 8గంటలకు ఈవీఎంలు ఉంచిన టేబుళ్ల వద్దకు అభ్యర్థులు లేదా వారి తరపున ఒక ఏజెంట్‌ను గాని పిలిచి పోస్టల్ బ్యాలెట్ లెక్కించి పార్టీల వారీగా నమోదు చేసుకుంటారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేసి పోలింగ్స్టేషన్ల వారీగా రాజకీయ పార్టీలకు పడిన ఓట్లను నమోదు చేసుకుంటారు. అన్ని పోలింగ్స్టేషన్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. పత్తి మార్కెట్లో... ♦ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లను 3 రౌం డ్లుగా విభజించి.. 3 గంటల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. ఖమ్మం పత్తి మార్కెట్లో లెక్కింపు కోసం 20 కౌంట ర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్లో నలుగురు జిల్లాస్థాయి అధికారులను నియమించారు. ♦ ఒకటి నుంచి 20వ డివిజన్ వరకు తొలి విడతగా తీసుకుని ఒక్కో కౌంటర్ వద్ద డివిజన్లోని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను ఉంచుతారు. ఇలా 20 కౌంటర్లలో 20 డివిజన్లకు సంబంధించిన ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ♦ 2వ రౌండ్‌గా 21వ డివిజన్ నుంచి 40వ డివిజన్ వరకు ఈవీఎంలను తీసుకొచ్చి లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ♦ 3వ రౌండ్లో 41 నుంచి 50 డివిజన్ వరకు ఈవీఎంలను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఉదయం 8గంటల నుంచి ప్రారంభమై 11గంటల వరకు పూర్తి చేస్తారు. అర్థగంటలోనే ఆ ఆరు డివిజన్ల ఫలితాలు.. ♦ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన అర్థగంటలోనే తక్కువ పోలింగ్స్టేషన్లు ఉన్న డివిజన్ల ఫలితాలు వెల్లడించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. వీటిలో నాలుగే పోలింగ్ కేంద్రాలున్న 1, 5, 15, 16, 18, 20 డివిజన్ల ఫలితాలు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ♦ అభ్యర్థి లేదా.. అతడి తరఫు ఏజెంట్‌కే అనుమతి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థి లేదా అతడి తరఫున ఏజెంట్‌ను మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు. -
మాటల్లేవ్.. చేతలే..
♦ ప్రచార సభలో మంత్రి కేటీఆర్ ♦ కార్పొరేషన్ ఎన్నికల్లో ♦ టీఆర్ఎస్ గెలుపు ఖాయం ఖమ్మం అర్బన్ : ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాల మాదిరిగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, మాది చేతల ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో గురువారం రోడ్‌షోలో పాల్గొన్నారు. బల్లేపల్లి, పాండురంగాపురం, ఖానాపురం, రోటరీ నగర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు జంక్షన్లలో అభ్యర్థులు ధారావత్ రామ్మూర్తినాయక్, డాక్టర్ పాపాలాల్, కొనకంచి సరళ, నాగండ్ల కోటి, దయాకర్, హనుమాన్, కొత్తపల్లి నీరజ, చావా నారాయణరావు, ఎస్కే.జాన్‌బీ, కూరాకుల వలరాజు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేశారు. ఖమ్మంలో అభివృద్ధి చూసిన ప్రజలు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిస్తే.. మరింత అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చేతల సీఎంగా కేసీఆర్, ఖమ్మంలో చేతల మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని, వీరి ద్వారా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య జల సమస్య కొనసాగుతోందని, అపర చాణక్యుడిలా 950 టీఎంసీల నీటిని సాగుకు ఉపయోగించుకునేలా సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాలను మెప్పించారన్నారు. జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి రెండు ప్రధాన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోటీ లో ఉన్న పచ్చ, ఎర్ర, మూడు రంగుల పార్టీల పరిస్థితి జోగిజోగి రాసుకుంటే బూడిద రాలిన చందంగా ఉంటుందని, మీ ఓటు బూడిదకా.. అభివృద్ధి చేసే టీఆర్ఎస్కా అనేది నిర్ణయించుకొని.. ఓటు వేయాలన్నారు. ఇంకా సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడారు. ఖమ్మానికి ఒరిగిందేమీ లేదు.. ఖమ్మం వైరారోడ్ : ప్రతిపక్షాల పాలనలో ఖమ్మంకు ఒరిగిందేమీ లేదని, పట్టణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో గురువారం నిర్వహించిన పలు రోడ్‌షోలు, జహీర్‌పుర తండా, గాంధీచౌక్, సారధినగర్ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థులను పరిచయం చేస్తూ.. కారు గుర్తుకే ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఐదేళ్లు తమకు అవకాశం ఇస్తే నగర రూపురేఖలు పూర్తిగా మారుస్తామని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.బి.బేగ్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్షీనారాయణ, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, ఫజీయుద్దీన్, కార్పొరేషన్ ఎన్నికల ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణ పాల్గొన్నారు. ఓడించలేకే కుట్రలు ఖమ్మం కల్చరల్/జెడ్పీసెంటర్ : టీఆర్ఎస్ను ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలన్నీ అంతర్గతంగా కుమ్మక్కై.. కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున గురువారం ఆయన ప్రచారం చేశారు. ముస్తఫా నగర్, చర్చి కాంపౌండ్, రోటరీ నగర్లలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రోడ్‌షోలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని, పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు 11 నుంచి 25వ డివిజన్ అభ్యర్థులు మేడా ప్రశాంత లక్ష్మి, గాజుల వసంత, ఆళ్ల నిరీష, మందడపు మనోహర్‌రావు, వీరస్వామి రమణమ్మ, కమర్తపు మురళి, పునుకుండ్ల నీరజ, వంగర కిషోర్, సయ్యద్మీరా బేగం, కర్నాటి కృష్ణమూర్తి, చావా నారాయణరావు, పోట్ల శశికళ, బత్తుల మురళి, మచ్చా నరేందర్ పాల్గొన్నారు. బోస్ విగ్రహ ఏర్పాటుకు తొలి తీర్మానం ఖమ్మం గాంధీచౌక్ : కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేసి.. బోస్ సెంటర్లో సుభాష్ చంద్రబోస్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు తొలి తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని బోస్ బొమ్మ సెంటర్లో గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఎర్రన్నలకు చాలా అవకాశాలు ఇచ్చారని, అయినా అభివృద్ధి జరగలేదన్నారు. 41,42,43 డివిజన్ల అభ్యర్థులు మెంతుల గీత, బాదె సుజాత, కోడి విజయ లక్ష్మిలను పరిచయం చేస్తూ.. వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు. బోస్ బొమ్మ సెంటర్ నుంచి మార్కెట్ రోడ్, పొట్టి శ్రీరాములు రోడ్ మీదుగా రోడ్‌షో సాగింది. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
2019లో ఒంటరి పోరు: కిషన్‌రెడ్డి
ఖమ్మం: 2019 నాటికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని, రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మంలో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి.. డబ్బుంటే అధికారం చేజిక్కించుకోవచ్చనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ధన రాజకీయాలు చేస్తోందన్నారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని పిలుపునిచ్చారు. కిషన్‌రెడ్డి వెంట జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు..
♦ ప్రజల ఆశీస్సులే విజయ రహస్యం కాంగ్రెస్ విమర్శ అర్థరహితం ♦ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో దోస్తీ కట్టినందుకే పోటీలో నిలిచాం ♦ కార్పొరేషన్ ఎన్నికలొస్తే తప్ప సీఎంకు జిల్లా గుర్తురాలేదు ♦ మీట్ ది ప్రెస్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం : ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల గుండెల్లో ఆయన నిలిచే ఉన్నారు. ఆయన ఆశయసాధన కోసం ఆవిర్భవించిన వైఎస్సార్సీపీకి ప్రజల అండదండలు ఉన్నాయి. మాటల గారడీతో ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేరు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్స్‌లో టీయూడబ్ల్యూజే.. హెచ్143, టీయూడబ్ల్యూజే.. ఐజేయూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి మాట్లాడారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందని, రైతు రుణమాఫీ ఇప్పటికీ అందలేదని, డబుల్బెడ్రూం ఇళ్లు అడ్రస్ లేవని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోవడాన్ని విస్మరించిన టీఆర్ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడుతూ పాలిస్తారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని, పింఛన్లు అందజేస్తామని హామీలు ఇస్తూ ఓట్లు అడుగుతున్నారన్నారు. ప్రజలు టీఆర్ఎస్ నాయకులను నమ్మరన్నారు. సీఎం కేసీఆర్‌కు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే తప్ప ఖమ్మం జిల్లా గుర్తుకు రాలేదని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్‌రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పడం, నిధుల విడుదలకు జీఓ జారీ చేయడం శోచనీయమన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థిని బరిలో దింపుదామనుకున్నామని, అయితే కాంగ్రెస్.. టీడీపీతో దోస్తీ కట్టడంతో వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థిని బరిలో దింపి తమ సత్తా ఏమిటో నిరూపించామని చెప్పారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీలో ఉంటే కాంగ్రెస్ ఓట్లు చీలుతాయని, టీఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. జిల్లాలో తమ పార్టీ బలంగా ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు దీటుగా తమకు ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. ప్రజల మద్దతు తమకుందని, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఎంపీ నిధులు వెచ్చించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తానని, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, జాతీయ రహదారుల నిర్మాణం, ఇతర సంక్షేమ పథకాలు అర్హులకు అందిస్తామని వివరించారు. జిల్లాలో ఐటీ పరిశ్రమ లేని లోటు ఉందని, ఇందుకోసం పలు ఐటీ కంపెనీల యజమాన్యంతో మాట్లాడానని, తొలి దశలో 150 నుంచి 180 మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టు తీసువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎంపీ వివరించారు. తనకు ప్రజాశీస్సులు ఉన్నాయని, వారి అభిమతానికి విరుద్ధంగా ఏనాడు నడుచుకోలేదని, మునుముందు కూడా ఇలాగే ఉంటానని చెప్పారు. మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసేన్, ఏనుగు వెంకటేశ్వరరావు, టెమ్జూ అధ్యక్ష, కార్యదర్శులు నాగేందర్, ఖదీర్, ఐజేయూ అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకట్రావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు బొల్లం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వరంగల్, ఖమ్మంలో రేపటి నుంచి కేటీఆర్ ప్రచారం
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరపున రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖా మంత్రి కె.తారకరామావు ప్రచారంలో పాల్గొననున్నారు. చివరి రెండు రోజుల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు ఖమ్మం, పాండురంగాపురం వద్ద రోడ్డు షో మొదలు పెట్టి రాత్రి 9గంటల దాకా సుడిగాలి ప్రచారం నిర్వహిస్తారు. గ్రేటర్ వరంగల్‌లో శుక్రవారం ప్రచారం చేయనున్న కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రెండు నగరాలకు చెందిన స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి పార్టీ తరపున ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆ రెండు జిల్లాల మంత్రులు, నాయకులతో ఇప్పటికే చ ర్చించారు. ఈ రెండు కార్పొరేషన్ల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రతిపక్షాలపై పూర్తి స్థాయిలో పై చేయి సాధించే వ్యూహంలో భాగంగా ఈ ఎన్నికలను పార్టీ సవాలుగా తీసుకుంది. కాగా, జీఎంహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబట్టిన మంత్రి కేటీఆర్ ప్రస్తుతం మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నందున ఈ నగరాల్లో ఇవ్వాల్సిన హామీలపై స్పష్టతకు వచ్చారు. దీనికోసం చివరి రెండు రోజులు ఆయనను ప్రచారానికి పంపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఓరుగల్లు నుంచే టీఆర్ఎస్ కు గుణపాఠం
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచే టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పడం ప్రారంభం కావాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింద న్నారు. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో..!
44 డివిజన్లో హైడ్రామా కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడు.. ఎవరు ఏ పార్టీలోకి మారుతారో తెలియని పరిస్థితి. ఈ రోజు ఈ పార్టీలో ఉన్న వ్యక్తి రేపు మరో పార్టీ కండువాతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని త్రీటౌన్ 44వ డివిజన్లో శనివారం ఓ హైడ్రామా చోటుచేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నున్నా మాధవరావు ఇంటికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు అకస్మాత్తుగా వచ్చారు. మంత్రి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న 42, 43, 44 డివిజన్ల కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులు మాధవరావు ఇంటి వద్దకు చేరుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ‘తుమ్మల గోబ్యాక్..’ అని నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలను అక్కడ నుంచి తరిమేశారు. మంత్రి మాధవరావుతో మాట్లాడి వెళ్లాక తిరిగి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పార్టీ మారవద్దని, కాంగ్రెస్‌లోనే కొనసాగాలని మాధవరావు ఇంటి ఎదుట ధర్నా చేశారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ హుటాహుటిన మాధవరావు ఇంటికి వచ్చి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి అజయ్ మాట్లాడుతూ డివిజన్లలో ముమ్మర ప్రచా రం చేయాలని పిలుపునిచ్చి వెళ్లారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు. - ఖమ్మం గాంధీచౌక్ -
50 డివిజన్లకు బరిలో నిలిచింది వీరే
ఎన్నికల్లో బహుముఖ పోరు కాంగ్రెస్, సీపీఐల నడుమ పొత్తు సాక్షిప్రతినిధి, ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో బహుముఖ పోరు నెలకొంది. పలు పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకు 291 మంది బరిలో మిగిలారు. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒంటరి పోరు చేస్తుండగా.. కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అధికార టీఆర్ఎస్ రెబల్స్‌ను నయానో భయానో బుజ్జగించింది. ఆ పార్టీ ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ కార్పొరేషన్లోనే తిష్ట వేసి.. ఒకే డివిజన్ నుంచి రెండు మూడు నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరణ చేయించడం గమనార్హం. ఎన్నికల్లో అన్ని పార్టీలు, స్వతంత్రులతో కలిపి 50 డివిజన్లకు మొత్తం 587 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ నుంచే ఆశావహులు 139 మంది నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ ఆశావహులు తమకే బీఫాం వస్తుందని ఆశించి.. చాలా మంది చివరికి భంగపడ్డారు. ఆ పార్టీ నేతలు దగ్గరుండి మరీ నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరించుకునేలా చేశారు. కొందరు బీఫాం రాలేదని ఆవేదనకు లోనైతే.. మరికొందరు కన్నీటి పర్యంతమయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకుని బరువెక్కిన హృదయంతో వెళ్లిపోయారు. తాము పార్టీకేం అన్యాయం చేశామంటూ ఆవేదన వెలిబుచ్చారు. శుక్రవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణలు జరిగాయి. 587 నామినేసన్లు దాఖలైతే.. ఇందులో 11 నామినేషన్లను తిరస్కరించారు. ఒకే అభ్యర్థి రెండు మూడు నామినేషన్లు వేసిన 100 నామినేషన్లను పక్కన పెట్టారు. అలాగే మరో ఐదు నామినేషన్లు ఇతర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 471 నామినేషన్లు అర్హత సాధిస్తే.. ఇందులో 180 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇవన్నీ పోగా.. 291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సామ, దానాలతో దారికి... టీఆర్ఎస్ నుంచి ఆశావహులు చాలామంది నామినేషన్లు వేశారు. వారిని ఎలాగైనా బరిలో నుంచి తప్పించేందుకు ఆ పార్టీ నేతలు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించారు. సుమారు రెండింతల ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడం.. చివరి వరకు వీరు బీఫాం కోసం ఆరాటపడ్డారు. అయితే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ దగ్గరుండి మరీ ఆ పార్టీ నేతలు వేసిన నామినేషన్లను చాలా వరకు ఉపసంహరించుకునేలా చేశారు. పార్టీ పరంగా సహకారం, మంచి భవిష్యత్ ఉంటుందని అన్ని రకాలుగా నామినేషన్లు వేసిన వారికి బుజ్జగింపులు, హెచ్చరికలు చేసి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. చాలామంది తమకు బీఫాం ఇవ్వాలని, తాము పార్టీ కోసం కష్టపడి పని చేశామంటూ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఎమ్మెల్సీ పల్లా, రెడ్యానాయక్‌ను వేడుకుని.. కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా నామినేషన్లు వేసిన ఆశావహులను ఆ పార్టీ నేతలు విత్‌డ్రా చేయించడంలో సఫలీకృతులయ్యారు. 42 మంది స్వతంత్రులు టీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి బీఫాం అందక, ఇతరులు మొత్తం 42 మంది బరిలో ఉన్నారు. వీరిని కూడా తమ పార్టీకే సహకరించాలని ఇప్పటికే అన్ని పార్టీలు ఉప సంహరణల అనంతరం బుజ్జగింపులకు దిగాయి. వారికి డివిజన్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయో అంచనా వేసుకుని ఎంతో కొంత నజరానా ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది ఇలా పార్టీల వైపు ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మిగిలిన కొంతమందిలో కీలకమైన అభ్యర్థులు తమ ఓట్లను కొల్లగొడతారేమోనని పార్టీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు హైరానా పడుతున్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
హైదరాబాద్: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట మున్సిపల్ ఎన్నికలకు బుధవారం మధ్యాహ్నంతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఖమ్మం కార్పొరేషన్లో 50 డివిజన్లకు 587 నామినేషన్లు, వరంగల్ కార్పొరేషన్లో 58 డివిజన్లకు 1350 నామినేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలో 20 వార్డులకు 135 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు శుక్రవారం వరకు గడువు ఉంది. మార్చి 6వ తేదీన పోలింగ్, మార్చి 9న ఫలితాలు వెలువడనున్నాయి. -
కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీలకు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఆఖరి తేది ఫిబ్రవరి 24 వరకు కొనసాగనుంది. ఈ నెల 25న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు. మున్సిపల్ ఎన్నికల చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసి గతంలో 21 (మూడు వారాలు) రోజుల పాటు ఉండే ఎన్నికల ప్రక్రియను 14 రోజులకు (రెండు వారాలు) కుదించింది. ఎన్నికల నిర్వహణ మధ్యలో సెలవులు వచ్చినా పని దినాలుగానే ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ‘నోటా’ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మార్చి 6న పోలింగ్ నిర్వహించి, మార్చి 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
కార్పొరేటర్ అభ్యర్థులపై టీఆర్ఎస్ కసరత్తు
వరంగల్: వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై టీఆర్ఎస్ వాడీవేడీగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ ఎన్నికలపై సోమవారం టీఆర్ఎస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురి నేతలు హాజరయ్యారు. కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ముందుగా ఆశావహుల జాబితాను సిద్ధం చేసి పంపుతామని, అధినేత తుది నిర్ణయం తీసుకుని జాబితాను ఖరారు చేస్తారని నాయకులు చెబుతున్నారు. -
మా చావుకొచ్చింది...
ఆత్మహత్యాయత్నం నేరం కాదన్న కేంద్ర నిర్ణయం నగర పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కొందరు ఆత్మహత్యాయత్నాలంటూ హల్చల్ చేస్తుంటారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో వారిపై కేసులు పెట్టేవారు. జైలు శిక్ష భయంతో చాలామంది వెనక్కి తగ్గేవాళ్లు. దాంతోపాటు మంటల్ని ఆర్పే యంత్రాలు, అగ్నిమాపక శకటాలు, వలలు, నిచ్చెనలతో అప్రమత్తంగా ఉండేవారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్లకు అడ్డుకట్ట కష్టమన్నది పోలీసుల భావన. ముఖ్యమైన ప్రాంతాలు, ప్రముఖుల పర్యటనలకు మాత్రమే పోలీసు బందోబస్తు, పహారా, నిఘా ఉండేది. ఇప్పుడు ఎత్తై ప్రాంతాలు, భవనాలు, హోర్డింగ్స్, కిరోసిన్, పెట్రోల్ విక్రయించే ప్రాంతాలను నిఘా పరిధిలో చేర్చాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద పోలీసు సిబ్బంది పహారా ఉండనున్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
కార్పొరేషన్ ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు
హైదరాబాద్‌లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం కులగణన పూర్తిచేసేలా అధికారుల చర్యలు మేయర్ పీఠం దక్కించుకునేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ కసరత్తు తిరుపతి: కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి కార్పొరేషన్ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. వివిధ కారణలతో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై ఇటీవలే హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సంబంధించి గణన చేపట్టేందుకు వీలుగా ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. వార్డుల రిజర్వేషన్ల తతంగం ముగిసేందుకు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలిసింది. తిరుపతి మున్సిపాలిటీ 2007 మార్చి 2వ తేదీన కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. అప్పటిలో ఉన్న 36 వార్డులను 50 డివిజన్లుగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు 2007లో మేయర్ పీఠం ఎస్టీలకు రిజర్వ్ అయింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టు కెళ్లడంతో ఎన్నిక వాయిదా పడింది. ఏపీ విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన 13 కార్పొరేషన్లలో రిజర్వేషన్ల పరంగా తిరుపతి కార్పొరేషన్‌ను జనరల్ మహిళకు కేటాయించారు. తిరుపతి కార్పొరేషన్లో తిమ్మనాయుడుపాళెం, ఎంఆర్‌పల్లి, రాజీవ్‌నగర్ పంచాయతీలను 2013 జూన్‌లో కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రస్తుతం తాజాగా కులగణన జరిగితే మేయర్ పీఠంకు సంబంధించి రిజర్వేషన్లలో మార్పు జరిగే అవకాశం ఉంది. నవంబర్‌లో ఎన్నికలు జరపాలని.. ఎన్నికను జూన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ప్రభుత్వానికి నివేదికలు చేరాయి. దీనికితోడు వేసవి కావడంతో విద్యుత్తు, నీటి సమస్యలు నగరవాసులను వెంటాడుతున్నాయి. ఈ ప్రభావం కార్పొరేషన్ ఎన్నికలపై పడుతుందని ప్రభుత్వం భయపడుతున్నట్లు సమచారం. ముఖ్యంగా నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలదే కీలక పాత్ర. వారికి సంబంధించి ప్రభుత్వ ం ఇంతవరకు రుణాలను మాఫీ చేయలేదు. దీంతో వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీని ప్రభావం ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే దేశం వర్గాలు అంచనాకు వచ్చాయి. జూన్‌లో ఎన్నికలు జరిపితే ఎదురీత తప్పదని, వీటిని నవంబరులో జరిపితే కొంతమేర ఊరట చెందవచ్చునని అంచనా వేస్తున్నాయి. ఆలోపు కనీసం పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తే గండం నుంచి గట్టెక్క వచ్చునని టీడీపీ ఆలోచిస్తోంది. పార్టీలు సమాయత్తం.. కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి ఇన్చార్జులుగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిలను నియమించారు. కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందుకు వీలుగా నగరంలోని ముఖ్యనేతలతో సమావేశమవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు. తెలుగుదేశం పార్టీ సైతం డివిజన్లలో పార్టీ అధ్యక్షుల నియామకాలతో పాటు నగర అధ్యక్ష ఎన్నికలను పూర్తిచేసి కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. -
కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్చార్జుల నియామకం
తిరుపతి మంగళం : కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన పరిశీలకుల్లో జిల్లాకు చెందిన నలుగురికి చోటు దక్కింది. తిరుపతి కార్పొరేషన్‌కు సంబంధించి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గుంటూరుకు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైజాగ్‌కు నియమించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వీరు పార్టీ గెలుపునకు కృషి చేస్తారు. తిరుపతికి పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి నియామకంపై పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. -
అర చేతిలో స్వర్గం
అన్నీ హామీలే.. నిధులు శూన్యం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాల జల్లు కార్యకర్తల్లో మనోధైర్యం నింపే యత్నం తిరుపతి: కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హఠాత్తుగా తిరుపతి నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిం చడం వెనుక ఎన్నికల వ్యూహం దాగి ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దామినీడు, అవిలాలలో అసంపూర్తిగా ఉన్న పేదల గృహాలకు రూ.250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేస్తామని చెప్పారు. తాత్కాలికం గా నీటి సమస్య పరిష్కారం కోసం రూ.25 కోట్లు ఇవ్వాలని టీటీడీని కోరుతామన్నారు. అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేస్తామని హెచ్చరించారు. తిరుపతి నుంచి కల్యాణిడ్యామ్ వరకు భూములను సేకరించి మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీటీడీ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తిరుపతి నగర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించే యత్నం చేశారు. నిజంగా ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే తిరుపతి నగరం రాష్ట్రంలోనే తలమానికంగా మారనుంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ సమస్యల పరిష్కారం అటకెక్కే ప్రమాదముందని జనం చర్చించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. ఆ సంగతి మరువక ముందే తిరుపతి ప్రజలను మరోసారి ముఖ్యమంత్రి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నగర ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేవలం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నగరంలోని సమస్యలపై దృష్టి సారించలేదు. ముఖ్యంగా నగరాన్ని తాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. దాన్ని అధిగమించేందుకు తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేయలేదనే అసహనం వ్యక్తమవుతోంది. అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ పనుల ఊసే ఇంతవరకు లేదు. అర్ధంతరంగా ఆగిపోయిన పేదల ఇళ్ల నిర్మాణాలపై కనీసం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు సమీక్షలు జరిపిన దాఖాలాలు కూడా లేవు. విజయోత్సవ సభలో లుకలుకలు తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుతో విజయోత్సవ సభ పేరుతో కార్యకర్తలను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇచ్చారు. అయితే ఈ సభలోనే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపించాయి. ఒక గ్రూపునకే ప్రాధాన్యత ఇచ్చారని నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. సన్మానిస్తామని చెప్పి మైనారీటీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలను పిలిచి వారికి వేదికపై చోటు కల్పించపోవడంతో ఆ వర్గాలు అగ్రహం వ్యక్తంచేశాయి. దీనికి తోడు విజయోత్సవ సభకు వచ్చిన వారికి కంటే వేదికపైనే నాయకులు ఎక్కువ ఉన్నారంటూ సాక్షాత్తూ చంద్రబాబే అసహనం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఫొటోలకు ఫోజులు తప్ప పనిచేసేది ఏమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీనికితోడు తిరుపతి నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే ర్యాలీలో స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో అప్పటికప్పుడు కార్యక్రమ షెడ్యూల్‌ను మార్చారు. 19వ తేదీ పద్మావతి అతిథిగృహంలో బస చేయాల్సి ఉన్నా, దానిని రద్దు చేసుకుని తిరుమల కొండకు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలంటూ షెడ్యూల్ మార్చారు. -
ఓటర్ల గుర్తింపు సర్వే షురూ
తిరుపతి కార్పొరేషన్: కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు కార్పొరేషన్లోకి ఎం ఆర్పల్లి, రాజీవ్‌నగర్, తిమ్మినాయుడుపాలెం పంచాయతీలను విలీనం చేసి జనాభాను నగర పాలక సంస్థలోని 50 డివిజన్లలోనే సర్దుబాటు చేసింది. తద్వారా ఆయా డివిజన్ల సరిహద్దులు గుర్తించడం, జనాభా సర్దుబాటు వంటి కీలక ఘట్టాలను పూర్తి చేసింది. దీంతో అధికారిక లెక్కల ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలోని జనాభా 3,74,260 మందికి చేరుకుంది. పురుషులు 1,87,931 మంది, మహిళలు 1,86,329 మందిగా గుర్తించారు. ప్రస్తుతం సర్దుబాటు చేసిన 50 డివిజన్ల జనాభా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల గణనను పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 10 నుంచి 26వ తేదీ వరకు మూడు కులాల గణన పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలనాధికారి సాంబశివరావు ఈ నెల ఆరో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. మొదట ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు .. నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు. అందులో అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల పదో తేదీ నుంచి 19 తేదీ వరకు ఇంటింటా సర్వే నిర్వహించి ఓటర్లను గుర్తిస్తారు. 20 నుంచి 21వ తేదీ వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. 22న తుది జాబితాను ప్రకటిస్తారు. అభ్యంతరాలను 26వ తేదీ వరకు స్వీకరిస్తారు. అభ్యంతరాలపై 27వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పరిశీలిస్తారు. జనవరి నాలుగో తేదీన తుది జాబితాను ప్రకటించి ప్రభుత్వానికి పంపించనున్నారు. పది నుంచి బీసీ ఓటర్ల గుర్తింపు.. ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు తరహాలోనే నగర పాలక సంస్థ పరిధిలోని బీసీ ఓటర్ల గుర్తింపును చేపట్టనున్నారు. ఈనెల పదో తేదీ నుంచి 26వ వరకు ఇంటింటా నిర్వహిస్తారు. 27,28 తేదీల్లో జాబితాను సిద్ధం చేసి 29వ తేదీన ప్రకటిస్తారు. 30వ తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలిస్తారు. పదో తేదీ నుంచి 13వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. జనవరి 17న తుది జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. తద్వారా ఫిబ్రవరిలో తిరుపతి కార్పొరేషన్‌కు నిర్వహించాలనుకుంటున్న ఎన్నికలకు వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. -
మేయర్ పీఠాన్ని సాధిద్దాం
సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు. తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మేయర్ పీఠాన్ని సాధిద్దాం
సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు. తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మేయర్ పీఠాన్ని సాధిద్దాం
సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు. తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మేయర్ పీఠాన్ని సాధిద్దాం
సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు. తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మేయర్ పీఠాన్ని సాధిద్దాం
సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు. తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నిజామాబాద్ కార్పొరేషన్లో ఉద్రిక్తత
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు తెలిపింది. దీంతో మజ్లిస్ మద్దతుతో కార్పొరేషన్ మేయర్ పదవి టీఆర్ఎస్ అభ్యర్థికి దక్కే అవకాశం ఏర్పడింది. అయితే.. కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళనకు దిగింది. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి చేశారు. ఈ పరిస్థితి మధ్యనే ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. స్థానిక ఎంపీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఓటు కూడా ఇక్కడ కీలకం కానుంది. -
ఈ తీర్పు చరిత్రాత్మకం: చంద్రబాబు
మున్సిపల్ ఫలితాలపై బాబు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న ఆయన పేరుతో పార్టీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ పట్ల విశ్వాసం ఉంచి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు బాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ తీర్పును స్పష్టంగా, టీడీపీని బలోపేతం చేసే విధంగా ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల కృషి వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. టీడీపీ విధానాల పట్ల ప్రజలకున్న అపార నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామనే సెంటిమెంట్‌తో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలను కొంత మేరకు ప్రభావితం చేయటం వల్ల తమకు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో తమ వెన్నంటి ఉన్న ప్రజలకు భవిష్యత్‌లో అండగా ఉంటామని చెప్పారు. కాగా, పురపాలక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకొన్నారు. -
టీడీపీ ఖాతాలో రాజమండ్రి కార్పొరేషన్
రాజమండ్రి: రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయితీను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. తుని, అమలాపురం, మండపేట, రామచంద్రాపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు టీడీపీ కైవసం చేసుకుంది. ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయితీల్లో మాత్రం టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ముమ్మిడివరం, గొల్లప్రోలులో రెండు పార్టీలు సమానంగా గెలుచుకున్నాయి. ఏలేశ్వరంలో మాత్రం టీడీపీకి ఒక వార్డు ఆధిక్యం లభించింది. -
ప్రాదేశిక పోరు.. పల్లెల్లో జోరు
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఓట్ల లెక్కింపు తేదీపై కోర్టు తీర్పు కోసం ప్రజలు, అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల ఘట్టం పట్టణాల నుంచి పల్లెలకు మళ్లింది. పట్టణాలతో పోల్చి చూస్తే పల్లెల్లోనే ఎన్నికల జోరు ఎక్కువగా కన్పిస్తుంది. ఉగాది, శ్రీరామనవమి పండుగలు కూడా కలిసి రావడంతో గ్రామాల్లో జోష్ పెరిగింది. ఎనిమిది సంవత్సరాల తరువాత పల్లె సీమల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6వ తేదీన 31 మండలాల్లోనూ... 11వ తేదీన 32 మండలాల పరిధిలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 63 జెడ్పీటీసీ స్థానాలకు 239 మంది, 849 ఎంపీటీసీ స్థానాల బరిలో 2,131 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పురపాలక ఓటర్ల కన్నా మూడింతలు ఎక్కువగా 21 లక్షల ఓటర్లు ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. పల్లెల్లో గత నెల 25వ తేదీ నుంచే ప్రచార పర్వం ప్రారంభమైనా పురపాలక ఎన్నికలు ఉండటంతో కొంత మందకొడిగా సాగింది. ఇప్పుడు పురపాలక ఎన్నికలు ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. రైతు కుటుంబాలు, రైతు కూలీలు, శ్రామికులు, మహిళలు ఎక్కువగా ఉండే పల్లెల్లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి ఊపు మీద కనిపిస్తున్నారు. కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రులు నామమాత్రంగా బరిలో ఉన్నారు. జెడ్పీ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించడంతో ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి వైఎస్సార్సీపీ శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది. మొదటి విడత ఎన్నికల ప్రచార పర్వం ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగుస్తున్నందున ఈ నాలుగు రోజులూ తార స్థాయికి చేరుకోనుంది. రెండో విడత ప్రాంతాల్లో ప్రచారానికి తొమ్మిది రోజులు సమయం మిగిలి ఉంది. రానున్న ఈ తొమ్మిది రోజులూ పల్లెల్లో ప్రచారం జోరుగా కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎంలు) కాకుండా 42 లక్షల బ్యాలెట్ పత్రాలు, 7 వేలకు పైగా బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. కాగా, అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీపై చర్చలు, అంచనాలు, ఆ తరువాత మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీలు), జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరనే అంశంపై పల్లెల్లో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. తొలి విడత పోరుకు ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు చేరినట్లు సమాచారం. మిగతా ఏర్పాట్లలో జెడ్పీ, జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. -
మున్సిపోల్స్‌కు గట్టి బందోబస్తు: ఎస్పీ
కడప అర్బన్, న్యూస్‌లైన్: ఈనెల 30న జరగనున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత, ప్రశాంత పోలింగ్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 640 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో ఏపీఎస్పీకి చెందిన ఒక కంపెనీ బలగాలు కూడా పాల్గొంటున్నాయని, వీరితోపాటు 2800 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని ఎస్పీ వివరించారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు ఎస్ఐల నేతృత్వంలో 84 మొబైల్ బృందాలు, సీఐల నేతృత్వంలో 27 స్టైకింగ్ బలగాలు, డీఎస్పీ లేదా సీఐల నేతృత్వంలోని 20 ప్రత్యేక స్టయికింగ్ బలగాలు రంగంలో ఉంటాయని వివరించారు. ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగిసిందని, ఎక్కడైనా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలుస్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. -
మహిళా ఓట్లే కీలకం..
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు. వివిధ డివిజన్లకు పోటీ పడుతున్న వారి గెలుపోటములను శాసించనున్నారు. నగరపాలక సంస్థలో మహిళా ఓట్లు 1,09,986 ఉన్నాయి. ఇందులో 42,404 మంది అమ్మాయిలు (యూత్) ఉన్నారు. దాదాపు సగం డివిజన్లలో పురుషులతో సమానంగా ఓటర్లు ఉన్నారు. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు వీరి ఓట్లపైనే ఆధారపడుతున్నారు. మహిళలు ఓటు వేస్తామని మాటిస్తే తమ గెలుపు నల్లేరుమీద నడకేనని భావిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలోనూ మహిళలే ముందుంటారని సర్వేలు చెబుతుండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. స్వశక్తి సంఘాలతో మారిన తీరు 2004 వరకు ఎన్నికల్లో పురుషులదే పైచేయిగా ఉండేది. ఎన్నికలొచ్చాయంటే ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి తమకు ఓటేయాలని, గెలిస్తే ఫలానా అభివృద్ధి పనులు చేస్తామని అభ్యర్థించే వారు. కానీ.. ఆ పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు అయినప్పటి నుంచి మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంటోంది. దీంతో వారిని ఒప్పించేం దుకు అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. నగరంలో మొత్తం 3005 సంఘాలున్నాయి. ఇందులో 30050 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘాలకు భవనాలు, కుటీర పరిశ్రమలకు రుణాలు.. తదితర ప్రభుత్వ పథకాలను తెప్పిస్తానంటూ హామీ ఇస్తున్నారు అభ్యర్థులు. మహిళా సంఘాల ఓట్లు రాబట్టగలిగితే.. వారి కుటుంబంలోని ఓట్లు సైతం వస్తాయన్న నేతల్లో ఉంది. అయితే తమకు అభివృద్ధి పనులు చేసిన.. చేస్తారన్న నమ్మకం ఉన్నవారికే ఓటు వేస్తామని మహిళలు తెగేసి చెబుతుండడం గమనార్హం. -
జోరుగా అభ్యర్థుల ప్రచారం
కరీంనగర్ కల్చరల్/కమాన్‌చౌరస్తా/టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గురువారం వివిధ డివిజన్లలో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేశారు. 23వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటి ప్రభావతి, 27లో టీడీపీ అభ్యర్థి సునావత్ అపసూర్య, 29లో సీపీఐ అభ్యర్థి నందికొండ అంజిరెడ్డి, 21లో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల ప్రకాశ్, 33లో స్వతంత్ర అభ్యర్థి ఎస్డీ.ఆరీఫ్ హుస్సేన్, 45లో టీడీపీ అభ్యర్థి వంచ శ్రీనివాస్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి ఆకుల నాగరాజు, మూ డో డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి వైద్యుల శ్రీదే వి, 22లో స్వతంత్ర అభ్యర్థి కనుకుంట్ల సంధ్యారాణి, 50లో బీజేపీ అభ్యర్థి మందల జానకమ్మ, 47లో కాంగ్రెస్ అభ్యర్థి మేచినేని అశోక్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి బండారి వేణు, 48లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, 49లో టీఆర్ఎస్ అభ్యర్థి డి.సంపత్, 50లో టీఆర్ఎస్ అభ్యర్థి వొంటెల సుమ, 17లో టీఆర్ఎస్ అభ్యర్థి వరాల జ్యోతి, 43లో కాంగ్రెస్ అభ్యర్థి మీస బీరయ్య, స్వతంత్ర అభ్యర్థి మేకల నర్సయ్య, 26, 29 డివిజన్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి ప్రచారం చేశారు. 30 డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి చొప్పరి జయశ్రీ, కాంగ్రెస్ అభ్యర్థి పత్తెం పద్మ ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. 50 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి వొంటెల సుమ, 31, 32, 33 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు చిటీ రామారావు, ఏవీ.రమణ, వొడ్నాల రాజు, 34,35లో కాంగ్రెస్ అభ్యర్థులు వావిలాల హన్మంత రెడ్డి, చాడగొండ కవిత, 32లో బీజేపీ అభ్యర్థి గడ్డం లత, 47లో బండారి మాలతి, కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌రావు, 49లో టీఆర్ఎస్ అభ్యర్థి డి.సంపత్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి కోసం ఆశీర్వదించండి నగరపాలక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. గురువారం 41వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా స్వరూపారాణి భారీ ర్యాలీ నిర్వహించారు. -
సైకిల్‌కు తగ్గుతున్న గాలి
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీటుగా బరిలోకి దిగడంతో టీడీపీ దిగాలు పడుతోంది. ఫ్యాన్ స్పీడ్ పెరగ్గా తమ సైకిల్ గాలి తగ్గుతోందని తెలుగుదేశం అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తమకు హ్యాట్రిక్ ఖాయం అంటూ తొలుత ప్రచారం చేసుకున్న నేతలు ఇప్పుడు జన స్పందన చూసి అయోమయంలో పడ్డారు. చాపకింద నీరులా అంతర్గత విభేదాలు ప్రచారంపై ప్రభావం చూపుతుండడంతో తెలుగుదేశం నేతలు సతమతమవుతున్నారు. సీనియర్లకు కాదని... టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్లకు కాదని తనకు అనుకూలంగా వ్యవహరించే కొత్త వారికి సీట్లు ఇవ్వడంతో పలు డివిజన్లలో అసంతృప్తి వర్గం చాపకింద నీరులా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. దాంతో తమ ఓట్లు చీలిపోతాయేమోననే ఆందోళన ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రచారం గడువు ముగిసే సమయం ముంచుకొస్తున్న కొద్దీ టీడీపీ నేతల్లో ఈ గుబులు ఎక్కువ అవుతోంది. ప్రచారం జోరు పెంచిన వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి ఎంపికతో యువతకు పెద్ద పీట వేస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చాటి చెప్పారు. అర్హులైన కార్యకర్తలను కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎంపిక చేయడంతో పార్టీ పరిస్థితి పటిష్టంగా మారింది. నగరాధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ సారథ్యంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ కార్యకర్తలు ప్రచారాన్ని వేగవంతం చేశారు. మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మేడపాటి షర్మిలా రెడ్డి తన మూడో డివిజన్‌తో పాటు ఇతర డివిజన్లలో కూడా ప్రచారం సాగిస్తున్నారు. -
గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే!
:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొన్నా జీవీఎంసీలో మాత్రం ఆ జాడ లేదు. భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, పది గ్రా మ పంచాయతీల విలీనంతో వా ర్డుల పునర్విభజన జరగలేదు. పైగా ఇందులో ఐదు పంచాయతీ ల విలీనాన్ని రద్దు చేస్తూ తక్షణమే ఎన్నికలు నిర్వర్తించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీన ప్రక్రియకూడా ఆటంకాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లేవని ఉన్నతాధికారులు చెప్తున్నారు. వేరుపడనున్న భీమిలి? భీమిలి, జీవీఎంసీకి మధ్య అనుసంధానంగా ఉన్న కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జేవీ అగ్రహారం గ్రామాల విలీన ప్రక్రియను రద్దు చేసి ఈ ఐదు పంచాయతీలకు ఏప్రిల్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పీళ్లుకు వెళ్తుందనుకున్న రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) కూడా వీటిని జీవీఎంసీ నుంచి విముక్తి కలిగి స్తూ ఉత్తర్వులు సిద్ధం చేసినట్టు తెలిసిం ది. భీమిలి విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు మళ్లీ మొదటికొచ్చాయి. గతం లో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఆయన అనుంగు అనుచరుడైన స్థానిక నేత అడ్డగోలుతనం వల్లే భీమిలి విలీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, స్థానికులెవరికీ భీమిలి విలీనం ఇష్టం లేదంటూ స్థానికలు ఆందోళనకు దిగుతున్నారు. దక్షిణ భారతదేశంలో తొలి పురపాలక సంఘంగా భీమిలికున్న చారిత్రక ప్రాశస్త్యానికి భంగం కలిగించొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఏయూడీ కూడా భీమిలిని మున్సిపాలిటీగానే ఉంచేం దుకు నిర్ణయానికొచ్చినట్టు జీవీఎంసీలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. వార్డుల పునర్విభజనకు కనీసం ఆరు నెలలు! : భీమిలి, ఐదు పంచాయతీల్ని మినహాయించి అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీల మేరకు వార్డుల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ ప్రారంభించినా.. కనీసం ఆరు నెలలు పడుతుందని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. భీమిలి విలీనంపై సందిగ్ధత తొలగేందుకు ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నెలాఖరులోగా తొలి విడత మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. వీటి అనంతరం కోర్టు కేసులున్న మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జీవీఎంసీలో ఉన్నట్టుగా విచిత్ర పరిస్థితి మరే కేసులోనూ లేదు. దీంతో జీవీఎంసీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆధారపడి ఉందని అధికారులు చెప్తున్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
కరీంనగర్:పార్టీల టికెట్ల కేటాయింపులో నేతల అనుసరిస్తున్న వైఖరి కార్యకర్తల్లో అసహనం కలగజేస్తోంది. రానున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా నేతలు వారి అనుచరులకే పెద్ద పీట వేయడం కాస్తా కొంతమంది కార్యకర్తలు అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నంచేసిన ఘటన మంగళవారం సంభవించింది. కరీంనగర్ జిల్లాలోని రామగుండం కార్పోరేషన్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కార్పోరేషన్ టికెట్ల కేటాయింపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన అనుచరులకే టికెట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాడని ఆరోపిస్తూ అదే పార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.