వరంగల్, ఖమ్మంలో రేపటి నుంచి కేటీఆర్ ప్రచారం | tomorrow onwords KTR campaign in Warangal, Khammam | Sakshi
Sakshi News home page

వరంగల్, ఖమ్మంలో రేపటి నుంచి కేటీఆర్ ప్రచారం

Published Wed, Mar 2 2016 7:19 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

tomorrow onwords KTR campaign in Warangal, Khammam

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరపున రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖా మంత్రి కె.తారకరామావు ప్రచారంలో పాల్గొననున్నారు. చివరి రెండు రోజుల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు ఖమ్మం, పాండురంగాపురం వద్ద రోడ్డు షో మొదలు పెట్టి రాత్రి 9గంటల దాకా సుడిగాలి ప్రచారం నిర్వహిస్తారు. గ్రేటర్ వరంగల్‌లో శుక్రవారం ప్రచారం చేయనున్న కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.

ఈ రెండు నగరాలకు చెందిన స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి పార్టీ తరపున ఇవ్వాల్సిన హామీలపై కసరత్తు చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆ రెండు జిల్లాల మంత్రులు, నాయకులతో ఇప్పటికే చ ర్చించారు. ఈ రెండు కార్పొరేషన్ల ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రతిపక్షాలపై పూర్తి స్థాయిలో పై చేయి సాధించే వ్యూహంలో భాగంగా ఈ ఎన్నికలను పార్టీ సవాలుగా తీసుకుంది.

కాగా, జీఎంహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు రాబట్టిన మంత్రి కేటీఆర్ ప్రస్తుతం మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నందున ఈ నగరాల్లో ఇవ్వాల్సిన హామీలపై స్పష్టతకు వచ్చారు. దీనికోసం చివరి రెండు రోజులు ఆయనను ప్రచారానికి పంపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement