ముగిసిన ఖమ్మం-వరంగల్‌-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ | Sakshi
Sakshi News home page

ముగిసిన ఖమ్మం-వరంగల్‌-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్

Published Mon, May 27 2024 7:23 AM

Warangal and Khammam and Nalgonda Graduate MLC bypoll Updates In Telugu

Updates

  • ముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
  • క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం

మహబూబాబాద్‌ 

  • 2 గంటల వరకు పోలింగ్‌ శాతం
  • పురుషులు: 10745
  • మహిళలు: 6462
  • మొత్తం: 17207
  • శాతం: 49.26%

 

సూర్యాపేట జిల్లా :

  • ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ 2 గంటల వరకు 52.8 శాతం
  • Male: 17968
  • Female: 9220
  • Total: 27188

యాదాద్రి భువనగిరి జిల్లా

  • జిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదు
  • పురుషులు:9673
  • మహిళలు: 6659
  • మొత్తం: 16332
  • శాతం: 47.92
     

జనగామ జిల్లా:

  • జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు 

వరంగల్ జిల్లా 

  • వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %

జనగామ జిల్లా:

  • జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదు

మహబూబాబాద్ జిల్లా:

  • వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదు

హనుమకొండ: 

  • ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
  • ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90

యాదాద్రి భువనగిరి జిల్లా

  • జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు 
  • పురుషులు: 5902
  • మహిళలు: 3543 
  • మొత్తం: 9445 

 

నల్లగొండ జిల్లా:
  • జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదు


నల్గొండ:

  • సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ  ఉప ఎన్నికల పోలింగ్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%
  • పురుషులు: 10813
  • మహిళలు: 5290
  • మొత్తం: 16103

 నల్గొండ:

  • మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.

నల్గొండ:

  • తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్

నల్లగొండ:

  • నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు గన్ మెన్ కేటాయింపు
  • నార్కెట్‌పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయం

వరంగల్‌:

  • మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ
  • పోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ
  • 200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదం

నల్లగొండ 

  • ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యం
  • వికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనం
  • మేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానం
  • ఇబ్బందులు పడుతోన్న వికలాంగులు

 

నల్లగొండ 

  • నార్కెట్‌పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు

 

నార్కట్‌పల్లి  పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్

  • తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని‌ నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసన
  • స్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్

 

సూర్యాపేటలో 11 శాతం పోలింగ్‌..

  • సూర్యాపేట జిల్లా:
  • ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:
  • Male: 4258
  • Female: 1570
  • Total: 5828
  • Percentage: 11.32%
     

 

నల్లగొండ:

  • నార్కెట్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత
  • ఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్
  • ఇరు వర్గాల మధ్య  వాగ్వాదం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్

 

నల్గొండ: 

  • యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు
     

 

నల్గొండ: 
సూర్యాపేట: 

  • గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్‌లో  సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
     

వరంగల్‌:

  • మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్‌  మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

వరంగల్‌: 

  • జనగామ ప్రెస్టన్ కళాశాలలో  జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఖమ్మం

  • ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.
  • చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.
  • వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
  • గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.
  • కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది.
      

 

  • పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది
  • మూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు
     

 

వరంగల్:
హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు

 

నల్లగొండ:
మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

 

వరంగల్:

  • పట్టభద్రుల ఉప ఎ‍న్నిక  పోలింగ్‌ కొనసాగుతోంది
  • హనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
     

సూర్యాపేట 

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది
  • సూర్యాపేట బీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే  జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు

 

 

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది
  • ఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు 
  •  ఓటు వేయడానికి క్యూలైన్‌లో నిల్చున్నారు

 

నల్లగొండ 

  • జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్

 

వరంగల్ : 

  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
  • వరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు
  • వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారు
  • వీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు
  •  ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

 

  • ప్రారంభమైన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌
  • నేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.
  • పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులు
  • సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
  • బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ 
  • కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
  • 605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  • మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.
  • వరంగల్,  ఖమ్మం,  నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.
  • వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
  • ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లు
  • నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
  • పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారం
    ఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు
  • ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.
  • ఈరోజు తేదిన ప్రత్యేక సెలవు
  • వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ నియోజకవర్గం
  • ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు

Advertisement
 
Advertisement
 
Advertisement