5న కర్నూలులో ముఖ్యమంత్రి పాదయాత్ర
5న కర్నూలులో ముఖ్యమంత్రి పాదయాత్ర
Published Thu, Nov 3 2016 9:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 5న నగరంలో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం జనచైతన్య యాత్రలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో.. ముఖ్యంగా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న పాతబస్తీలో మూడు గంటల పాటు మూడు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సాగనుంది. గురువారం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రజాప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాదయాత్ర నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్, శాసనమండలి సభ్యుడు శిల్పాచక్రపాణిరెడ్డి, సుధాకర్‌బాబు, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి, ఎస్పీ ఆకె రవికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోల్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు.
పర్యటన సాగుతుందిలా...
- 5వ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం కర్నూలుకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 1.30 వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
( కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కళాశాల, అమ్మవారిశాల, వన్‌టౌన్, రాధాకృష్ణ టాకీస్ మీదుగా కోల్స్ కళాశాల వరకు మూడు కిలోమీటర్ల పాదయాత్ర. కోల్స్ కళాశాలలో జనచైతన్య యాత్ర. అమృత్ స్కీం ప్రారంభోత్సవం. )
- ఆ తర్వాత 2.30 వరకు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో భోజనం, విశ్రాంతి.
- 2.30 నుంచి 4.30 వరకు అవుట్‌డోర్ స్టేడియంలో డ్వాక్రా మహిళలు, రైతులతో బహిరంగ సభ. డ్వాక్రా మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి కింద రూ.127 కోట్లు మహిళల ఖాతాలకు జమ.
- 2015 కరువుకు సంబంధించి రైతులకు రూ.277 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
- చంద్రన్న బీమా పథకం కింద 87 క్లెయిమ్‌లకు పరిహారం పంపిణీ.
Advertisement