నేడు సీఎం కర్నూలు పర్యటన | today cm kurnool tour | Sakshi
Sakshi News home page

నేడు సీఎం కర్నూలు పర్యటన

Published Fri, Nov 4 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

నేడు సీఎం కర్నూలు పర్యటన

నేడు సీఎం కర్నూలు పర్యటన

గార్గేయపురం నగరవనం సందర్శన రద్దు
– ఉదయం 9.45కు కర్నూలుకు చేరుకోనున్న సీఎం
– సాయంత్రం 4.45కు ముగియనున్న పర్యటన
 
కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా కర్నూలు మండలం గార్గేయపురంలోని నగరవనాన్ని సందర్శించేలా ముఖ్యమంత్రి పర్యటనను జిల్లా యంత్రాంగం రూపొందించింది. అయితే చివరకు ఇది రద్దయింది. కేవలం నగర పర్యటనకు మాత్రమే ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు చేశారు. ఉదయం 9.45 గంటలకు కర్నూలు చేరుకోనున్న ముఖ్యమంత్రి పర్యటన సాయంత్రం 4.45 గంటలకు ముగుస్తుంది. కర్నూలు నగరంలో మూడు గంటల పాటు జనచైతన్య యాత్రలో భాగంగా పాతబస్తీలో పాదయాత్ర నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ కార్యక్రమంలో, మధాహ్నం 2.30 నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
పర్యటన వివరాలు ఇలా..
  •  ఉదయం 9.45 గంటలకు హెలిక్యాప్టర్‌లో ఏపీఎస్‌పీ బెటాలియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10 గంటలకు కిడ్స్‌ వరల్డ్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 10 నుంచి 12 గంటలకు జనచైతన్య యాత్రలో భాగంగా కిడ్స్‌ వరల్డ్‌ నుంచి ఉస్మానియా కళాశాల, గీతా మందిర్‌ మీదుగా కోల్స్‌ కళాశాల వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. 
  • మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు కోల్స్‌ కళాశాలలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 2.10 గంటలకు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ చేరుకొని 2.30 వరకు రిజర్వులో ఉంటారు.
  • 2.30 గంటలకు స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నుంచి బయలు దేరి అవుట్‌ డోర్‌ స్టేడియంకు వెళ్తారు.
  •  2.35 నుంచి 4.30 గంటల వరకు డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. 4.45 గంటలకు ఏపీఎస్‌పీ బెటాలియన్‌ గ్రౌండులోని హెలిప్యాడ్‌ చేరుకొని హెలిక్యాప్టర్‌లో విజయవాడకు బయలుదేరుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement