చెరువు గట్టుపై జన్మభూమి సభకు స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ
తడకనపల్లె నుంచే నాల్గో విడత ‘జన్మభమి’
Published Fri, Dec 30 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
- 2న సీఎం ప్రారంభిస్తారు
– సీఎం సభా, హెలీప్యాడ్‌లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కల్లూరు: నాల్గో విడత జన్మభూమి కార్యక్రమాన్ని మండల పరిధిలోని తడకనపల్లె గ్రామం నుంచే సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. శుక్రవారం ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ హరికిరణ్ ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ తడకనపల్లెలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలకు పాడి పంట బాగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం ప్రధాన ఉద్దేశమన్నారు. అందులో భాగంగా తడకనపల్లెలో పశువుల వసతి క్షేత్రాన్ని జనవరి 2న జన్మభూమి సందర్భంగా సీఎం ప్రారంభించనున్నారన్నారు. అలాగే జిల్లా ప్రజల చిరకాల వాంఛ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు. కేసీ కాలువ ద్వారా 30 నుంచి 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
జన్మభూమి పర్యటనలో భాగంగా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పరిసరాల పరిశుభ్రతతోపాటు మొక్కలు పెంచి ట్రీ గార్డ్స్ ఏర్పాటుచేయాలని డీపీఓ ఆనంద్‌ను ఆదేశించారు. పశువుల షెడ్లు , సీసీ రోడ్లు, ఇరువైపులా మొక్కలు ట్రీ గార్డ్స్ ఏర్పాటుచేయాలని పంచాయతీ రాజ్ ఎస్‌ఈ సుబ్బరాయుడును ఆదేశించారు. పశువుల షెడ్లు ప్రారంభించడానికి ముందు క్షీర సాగర సదనంగా పేరు వేయించి తడకనపల్లె కర్నూలు జిల్లాగా వృత్తాకార బోర్డు ఏర్పాటుచేయించాలన్నారు. గ్రామంలో ఉన్న పశువులన్నింటిని షెడ్లకు తరలించాలని పొదుపు మహిళలను ఆదేశించారు. ఎలక్ట్రికల్ హెవీలైన్ డౌన్ చేసి హెలిప్యాడ్, బారికేడ్, అప్రోచ్ రోడ్డు ఏర్పాట్లు చూడాలని ట్రాన్స్‌కో ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తడకనపల్లె చెరువు గట్టుపై గ్రామ సభ ఏర్పాటుచేయాలని, చెరువులో జంగిల్ క్లియరెన్స్ చేసి నీరు నింపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ భార్గవ రాముడు, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, పశుసంవర్దకశాఖ జేడీ డాక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు.
Advertisement