సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఏలూరులో ఎన్నికలు నిలిపి వేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ సరిగా చేయడం లేదని గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటర్ల జాబితాను సరి చేయాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో 14న పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన, జనగణన, కులగణన సరిగా చేయకుండానే ఎన్నికలు జరుపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
ముగిసిన ప్రచారం
పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ నిర్వహించనున్నారు.
చదవండి: మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ
చదవండి: మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment