
సాక్షి, అమరావతి: పంచాయతీఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినా ఎస్‌ఈసీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఎస్‌ఈసీతో పాటు చంద్రబాబుకు నోటిసులు జారీ చేయాలని కోరగా హైకోర్టు అందుకు అంగీకరించినట్లు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment