
సాక్షి,ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం కొల్లేరు లంక గ్రామం పైడి చింత పాడులో పెన్షన్ పంపిణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జనసేన గ్రామ సర్పంచ్ ముంగర తిమోతిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచిని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు లేదంటూ సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
గ్రామంలో తాము చెప్పింది జరగాలంటూ జనసేన సర్పంచిని బండబూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దారు. ఇరు పార్టీల నేతలు బాహబాహికి దిగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొత్తులో ఉంటూ తమపై దాడి చేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment