chinatamaneni prabhakar
-
దెందులూరు కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం కొల్లేరు లంక గ్రామం పైడి చింత పాడులో పెన్షన్ పంపిణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.జనసేన గ్రామ సర్పంచ్ ముంగర తిమోతిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రామ సర్పంచిని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు లేదంటూ సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గ్రామంలో తాము చెప్పింది జరగాలంటూ జనసేన సర్పంచిని బండబూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దారు. ఇరు పార్టీల నేతలు బాహబాహికి దిగటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొత్తులో ఉంటూ తమపై దాడి చేయడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి'
ప్రకాశం(ఒంగోలు): కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్ధార్ వనజాక్షిపై భౌతికంగా దాడిచేసి అసభ్య పదజాలంతో దూషించిన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకరరావును వెంటనే అరెస్టు చేసి పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం ఒంగోలు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అధికారపార్టీ సంపూర్ణ సహకారంతో నడుస్తోందని ధ్వజమెత్తారు. అక్రమాలను గుర్తించిన వారిపై దాడులకు దిగుతున్నారంటూ ముసునూరు తహసీల్ధార్ ఉదంతాన్ని ప్రస్తావించారు. చట్టాన్ని కాపాడాల్సిన శాసనసభ్యుడే భౌతికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. -
ఎమ్మార్వో వనజాక్షికి చంద్రబాబు ఫోన్
విజయవాడ : ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒత్తిడి చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యాఖ్యానించారు. ఆమె శుక్రవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్‌ను కాపాడేందుకు ప్రభుత్వం వనజాక్షిపై తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వం బ్లాక్మెయిల్ చర్యలకు ఉద్యోగ సంఘాలు భయపడాల్సిన అవసరం లేదని ఉప్పులేటి కల్పన అన్నారు. మరోవైపు వనజాక్షిపై దాడికి నిరసనగా ధర్నాకు దిగిన రెవెన్యూ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, సీపీఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...ఎమ్మార్వో వనజాక్షితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు అప్పగించారు.