ప్రకాశం(ఒంగోలు): కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్ధార్ వనజాక్షిపై భౌతికంగా దాడిచేసి అసభ్య పదజాలంతో దూషించిన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకరరావును వెంటనే అరెస్టు చేసి పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం ఒంగోలు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అధికారపార్టీ సంపూర్ణ సహకారంతో నడుస్తోందని ధ్వజమెత్తారు.
అక్రమాలను గుర్తించిన వారిపై దాడులకు దిగుతున్నారంటూ ముసునూరు తహసీల్ధార్ ఉదంతాన్ని ప్రస్తావించారు. చట్టాన్ని కాపాడాల్సిన శాసనసభ్యుడే భౌతికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.