citu
-
తిరుమల లడ్డుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు
-
చిరు వ్యాపారుల పొట్టకొడుతున్న చంద్రబాబు.. CITU నేతలు హెచ్చరిక
-
104 కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
సుల్తాన్‌బజార్: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ధర్నా చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్‌చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్ పాల్గొన్నారు. -
సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడుతూ సిద్దిపేటరెడ్డి సంక్షేమ భవన్లో నిర్వహించే మహాసభల ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్యల పేర్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారన్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాని చెప్పారు. మహాసభల చివరి రోజు జరిగే బహిరంగ సభకు కేరళ మంత్రి శివమ్స్ కుట్టి వస్తారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు. -
మార్చి 28, 29న దేశవ్యాప్త సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: కార్మిక సమస్యలు, ప్రైవేటీకరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ వ్యతిరేకంగా, రైతు డిమాండ్లు, సామాన్య ప్రజల డిమాండ్ల కోసం కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర అఖిల భారత ఫెడరేషన్ అందరూ కలిసి మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు హేమలత ప్రకటించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ వల్ల కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఉపాధిహామీ కూలీ పెంచడంతో పాటు పనిదినాలు పెంచాలని ఏడాదిన్నరగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్లకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని, కీలక రంగాలకు పథకాలకు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, కార్మిక, రైతు ప్రజా సమస్యలపై చేస్తున్న నిరసనలు, సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని హేమలత పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం: వెంకట్ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని, విభజన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పేర్కొన్నారు. తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని చట్టంలో ఉన్న అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.60 వేల కోట్ల నిధులు తగ్గించారని విమర్శించారు. యూపీ ఎన్నికల్లో భాగంగా 9 ప్రాంతాల్లో సంయుక్త కిసాన్ మోర్చా సమావేశాలు పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. -
విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సవరణ చట్టం–2021ను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ ఉద్యోగుల జాతీయ కో–ఆర్డినేషన్ కమిటీ జాతీయ కన్వీనర్ ప్రశాంత్‌చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రశాంత్‌చౌదరి మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలను సంప్రదించలేదన్నారు. అయితే ఫైనాన్స్ అడ్వైజరీ, ఫిక్కీ తదితర సంస్థ ప్రతినిధులు వంటి పెట్టుబడిదారుల ప్రతినిధులను సంప్రదించడం దారుణమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విద్యుత్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ఇప్పుడున్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అదే జరిగితే.. వినియోగదారులపై రూ.4 వేల అదనపు భారంతో పాటు, రీచార్జ్ చేయకుంటే వెంటనే విద్యుత్ ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలకు సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యం, విద్యుత్ రంగాలపై రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు
కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత విమర్శించారు. సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభను శనివారం కుషాయిగూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలో కార్మిక చట్టాలు నీరుగారిపోవడంతో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్లకు పెద్దపీఠ వేశారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కోడ్ బిల్లు మూలంగా చట్టసభల్లో కార్మికుల సమస్యలు ప్రస్తావించే అవకాశముండదని, సమ్మెను చట్టవిరుద్ధంగా పరిగణిస్తారని తెలిపారు. ఇక తెలంగాణలో నియంత దొరపాలన సాగుతోందని హేమలత ఆరోపించారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి ఆర్టీసీ కార్మికుల సమ్మేనని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే జనవరి 8న జరిగే జాతీయ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ సమ్మె: ‘నిరుద్యోగులు.. ప్లీజ్ సహకరించండి’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె విషయంలో మొండి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లీకేజీలు ఇచ్చి ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. కార్మికులెవరూ భయపడవద్దని.. అందరికీ తాము అండగా ఉంటామని తెలిపారు.ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డితో పాటు జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు పద్మనాభన్ పాల్గొన్నారు.(చదవండి : ఆర్టీసీ సమ్మె; రేపు బంద్.. ఉత్కంఠ) సమ్మెకు సహకరించండి.. ఆర్టీసీ జేఏసీని విచ్చిన్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని రాజిరెడ్డి విమర్శించారు. ‘నిరుద్యోగులెవరూ తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లుగా వెళ్ళకండి. ప్రజా రవాణా వ్యవస్థను విచ్ఛన్నం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దయచేసి నిరుద్యోగులు కార్మికులుగా వెళ్ళకండి. సమ్మెకు సహకరించండి’ అని రాజిరెడ్డి విఙ్ఞప్తి చేశారు. ఇక పద్మనాభన్ మాట్లాడుతూ.. కార్మికులంతా కలిసి ఆర్టీసీ కార్మికుల కోసం ఉద్యమం చేయడం మంచి పరిణామం అన్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండి కార్మిక చట్టాల గురించి కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ‘సెల్ఫ్ డిస్మిస్ అనే పదం రాజ్యాంగంలో లేదు. ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తాను అంటే ఎట్లా..100 ఏండ్ల నుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి. మనం నిజాం పాలనలో లేము. రాజ్యాంగ పరమైన దేశంలో ఉన్నాము. సమ్మె చేయడం కార్మికుల హక్కు. బ్రిటిష్ రాజు లాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యమానికి రాజకీయ పార్టీలు కలిసి రావడం మంచి పరిణామం. దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు’అని పేర్కొన్నారు. -
పోటీకి ‘ఫ్రంట్’
గతంలో ఒంటరిగా లేదా ప్రధాన పార్టీల కూటమి భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే సొంత కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఇప్పటికే ప్రజా సంఘాలు, చిన్నా చితకా పార్టీలతో జట్టు కట్టిన సీపీఎం, ఎన్నికల నాటికి భావసారూప్య పార్టీలకు చేరువ కావాలని భావిస్తోంది. పార్టీ పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతమవుతూనే, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనుంది. పార్టీ అనుబంధ ప్రజా సంఘాల సభ్యులను ఓటు బ్యాంకుగా మా ర్చుకోవాలనే వ్యూహంతో పనిచేస్తోంది. అదే సమయంలో ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను ఎన్నికల నాటికి బీఎల్ఎఫ్ గొడు గు కిందకు తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సీపీఎం) వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించింది. గతంలో మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఐతో కలిసి ప్రధాన రాజకీయ పార్టీల కూటమి భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం వచ్చే ఎన్నికల్లో సొంతంగా ఏర్పాటు చేసే రాజకీయ కూటమికి నేతృత్వం వహించాలని నిర్ణయించింది. సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు మిత్ర పక్షం సీపీఐ.. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమితో జట్టు కట్టే అవకాశం ఉందని సీపీఎం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐతో సంబంధం లేకుండా వివిధ ప్రజా సంఘాలు, భావ స్వారూప్యత కలిగిన చిన్నా, చితకా పార్టీలతో కూటమిగా ఏర్పడాలని నిర్ణయించింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఇప్పటికే జిల్లాలో ఎంసీపీఐ, మహాజన సమాజ్‌పార్టీ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, మజ్లీస్ బచావో తహరీక్ (ఎంబీటీ) తదితర పార్టీలతో కలిసి పనిచేస్తోంది. వీటితో పాటు అంబేడ్కర్ భావజాల సంఘాలు, పలు ఎస్సీ, ఎస్టీ కుల సంఘాలు కూడా బీఎల్ఎఫ్లో భాగస్వామిగా ఉన్నాయి. ఎన్నికల నాటికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఏర్పాటయ్యే రాజకీయ పార్టీతోనూ కలిసి పనిచేయాలని భావిస్తోంది. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితితో కూడా రాజకీయ అవగాహన కోసం మంతనాలు జరుపుతోంది. మూడు స్థానాలపై ప్రత్యేక దృష్టి బీఎల్ఎఫ్ పక్షాన పూర్వపు మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు, అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను నిలపనుంది. పార్టీ పరంగా మాత్రం కేవలం మూడు అసెంబ్లీ స్థానాలపైనే దష్టి కేంద్రీకరించాలని సీపీఎం భావిస్తోంది. సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా కొంత బలంగా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో సంగారెడ్డి, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని భారీ, మధ్య తరహా పరిశ్రమల ఎన్నికల్లో పార్టీ అనుబంధ కార్మిక విభాగం సీఐటీయూ వరుస విజయాలు సాధిస్తోంది. పార్టీ అనుబంధ సంఘాలు సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం తదితరాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా సుమారు 1.50లక్షల మంది సభ్యులున్నారు. ఎన్నికల నాటికి అనుబంధ సంఘాల సభ్యుల ఓట్లను పార్టీ ఓటు బ్యాంకు మార్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పార్టీ సంస్థాగతంగా బలంగా లేని బీఎల్ఎఫ్ అభ్యర్థులను బరిలోకి దించాలనేది సీపీఎం వ్యూహంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 350 గ్రామ కమిటీలను ఏర్పాటు చేసింది. మండల, నియోజకవర్గాల కమిటీల నిర్మాణంపై కసరత్తు చేస్తోంది. అసంతృప్తులపైనా వల ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, క్రియాశీల కార్యకర్తలు సీపీఎంలో ఇమడలేరనే భావనను తొలగించాలని సీపీఎం భావిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో రాజకీయ అవకాశం దక్కని అసంతృప్త నేతలను ఎన్నికల నాటికి బీఎల్ఎఫ్ కూటమి గొడుగు కిందికి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలతో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం మంతనాలు సాగిస్తోంది. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో ప్రధాన పార్టీలకు చెందిన ఎనిమిది మంది ముఖ్య నేతలు, టికెట్ దక్కని పక్షంలో బీఎల్ఎఫ్ తరపున పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్లు సీపీఎం లెక్కలు వేస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఎన్నికల నాటికి రాజకీయ వేడిని పెంచేందుకు పార్టీ పరంగా, బీఎల్ఎఫ్ ద్వారా ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సీపీఎం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట అటుంచి, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగాలన్నదే తమ ప్రయత్నమని పార్టీ ముఖ్య నేత ఒకరు చేసిన వ్యాఖ్య పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. -
సుప్రీంకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా..?
తిరుపతి అర్బన్: టీటీడీలో పనిచేస్తున్న 14వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలంటే అధికారులకు లెక్కలేదా..? అని సీఐటీయూ జాతీయ నేత వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం చేపట్టిన ‘సమరభేరి’ కార్యక్రమానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ పరిపాలనా భవనం ముందు నిర్వహించిన ధర్నాలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వల్లే అత్యధిక శాతం పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే వారి కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. టీటీడీలో కొనసాగుతున్న కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేరును అడ్డుపెట్టుకుని కార్మికులపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పొట్టగొట్టే వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని టీటీడీలో రద్దు చేయాలని కోరారు. ఎన్నిసార్లు పోరాటాలు చేసినా టీటీడీలో చలనం రానందువల్లే ఈనెల 15తో డెడ్‌లైన్ ఇచ్చి నిరవధిక ఆందోళనలకు సన్నద్ధం అయ్యామని ప్రకటించారు. ధర్నాలో భాగంగా కళాకారులు శ్రీవారి పాటలు, నామ సంకీర్తనలు ఆలపించి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యదర్శి గోల్కొండ వెంకటేశం, నాయకలు మునిరాజా, నాగార్జున, గోపీనా«థ్, మోహన్‌రావు, ఈశ్వర్‌రెడ్డి, వాసు, చంద్రశేఖర్, గంగులప్ప, వెంకటయ్య, మురళి పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికులందరికీ బోనస్ చెల్లించాలి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థకు చెందిన భూగర్భ గనుల్లో టన్నెల్, బెల్ట్ క్లీనింగ్, రూఫ్ బోల్టింగ్ తదితర పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ 2018 ఏప్రిల్ నుంచి 8.33 శాతం బోనస్ చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు యర్ర గాని కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే-7షాఫ్ట్, పీవీకే-5బీలో కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రొడక్షన్ సైడ్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టరు చెల్లించటంలేదని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ కార్మికుల శ్రమను దోచుకుంటుంటే గని అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మి కులు ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె కిరణ్, బాలకృష్ణ, మోహన్, సురేష్, సత్యనారాయణ, విజయ్, కిరణ్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్ రద్దు చేయండి
న్యూఢిల్లీ: వందకుపైగా వర్తక సంఘాలు 16 బిలియన్ డాలర్ల వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు వ్యతిరేకంగా గళంవిప్పాయి. డీల్ వల్ల చిన్న వర్తకులకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని, కొన్ని వేల ఉద్యోగాలకు ముప్పు ఉందని ఉందోళన వ్యక్తంచేశాయి. వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాలను తెలియజేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహా ఈ వర్తక సంఘాలన్నీ బహిరంగ ప్రకటన చేశాయి. డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఒకవేళ డీల్‌ను అనుమతిస్తే ఇండియన్ రిటైల్ రంగంలో అమెరికా కంపెనీల (వాల్‌మార్ట్, అమెజాన్) అధిపత్యం పెరుగుతుందని, అలాగే ఈ సంస్థలు కన్సూమర్ డేటాను నియంత్రించే అవకాశముందని హెచ్చరించాయి. ‘వాల్‌మార్ట్‌కు అంతర్జాతీయంగా సప్లై చైన్ గుర్తింపుంది. ఇది చైనా నుంచి సరఫరా చేసే చౌక ధర సరుకు వల్ల దేశీ తయారీదారులు, సప్లయర్లు నష్టపోతారు’ అని చాంబర్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ప్రెసిడెంట్ మోహన్ గుర్నాని తెలిపారు. చిన్న చిన్న రిటైల్ స్టోర్లు, ఎస్ఎంఈలు, సప్లయర్లు ఎక్కువగా ఇబ్బందికి గురౌతారని పేర్కొన్నారు. కాగా దాదాపు 127 వర్తక సంఘాలు ఇప్పుడు వాల్‌మార్ట్–ఫ్లిప్‌కార్ట్ డీల్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, ఆల్ ఇండియా ఆన్లైన్ వెండర్స్ అసోసియేషన్ వంటివి ఈ డీల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తలుపు తట్టాయి. మరోవైపు వాల్‌మార్ట్ ఇండియా చీఫ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి రజ్నీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో మేం దాదాపు దశాబ్ద కాలం నుంచి క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తున్నాం. చిన్న కిరాణాదారులు అభివృద్ధికి సాయమందిస్తున్నాం. దేశంలోని రైతులు, సప్లయర్ల నుంచే 95 శాతానికిపైగా సరుకు సమీకరిస్తున్నాం. స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు. డీల్ వల్ల కొత్తగా లక్షల ఉద్యోగాలు వస్తాయని, వేలమంది స్థానిక సప్లయర్లు లబ్ది పొందుతారని తెలిపారు. అలాగే వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు రెండూ విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. -
పంచాయతీల్లో ఆకలి కేకలు..!
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని పంచాయతీల్లో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. 3 నుంచి 11 నెలల వరకు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కందులాపురం పంచాయతీలో 9 నెలలు, కంభం పంచాయతీలో 3 నెలలు, వై.పాలెంలో 7 నెలలు, త్రిపురాంతకంలో 6 నెలలు, దోర్నాలలో 5 నెలలు, దర్శి, కురిచేడు పంచాయతీలలో ఐదు నుంచి ఆరు నెలల వరకు కార్మికులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. అదే విధంగా కరేడు పంచాయతీలో 6 నెలలు, ఉలవపాడులో 3 నెలలు, సింగరాయకొండలో 5 నెలలు, మూలగుంటపాడులో 5 నెలలు, ఎన్జీపాడులో 4 నెలలు, బి.నిడమానూరు పంచాయతీలో 11 నెలల వరకు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాకుండా ఇంకా జిల్లాలోని చాలా పంచాయతీల్లో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు అందటం లేదు. నెలల తరబడి జీతాలు అందకపోవడం, దుకాణాలలో బకాయిలు పెరిగిపోవడంతో అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. నిద్రలేచి పంచాయతీలను శుభ్రం చేస్తున్నా కార్మికులకు నెలవారీ జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారంటూ సీఐటీయూ నాయకుల పివి శేషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌ఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. వేతనాలపై ఫ్రీజింగ్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. పంచాయతీ కార్మికులకు కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రోజు వారి వేతనం రూ.386 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంటే నెలకు రూ.11, 580 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప పారిశుద్ధ్య పనిలో ఉన్న కార్మికుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక లేకపోవడం దారుణమని అన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు టెండర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 1028 పంచాయతీలలో కార్మికుల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి నుంచి కార్మికులను విముక్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
నిరాశావర్కర్లు
► ఆశ కార్యకర్తలకు భరోసా కరవు ► పని భద్రత, పీఎఫ్, ప్రమాదబీమా సౌకర్యాలు లేవు ► విధులు విస్తారం.. పారితోషికం పాక్షికం.. ► రేపటి నుంచి సమ్మెకు సిద్ధమవుతున్న వైనం పర్చూరు: మాతా శిశు సంరక్షణ–సంక్షేమం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నియమించిన ఆశ వర్కర్లకు భరోసా లేకుండా పోయింది. భవిష్యత్‌పై ఆశతో ఏళ్ల తరబడి వెట్టిచాకిరి చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదు. వీరికి ఇచ్చే పారితోషికం నెలల తరబడి చెల్లించకపోవడం, వారి డిమాండ్ల పరిష్కారంపై పాలకులు పట్టించుకోకపోయినా వారి విధులు మాత్రం సక్రమంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. మాతా శిశు సంక్షేమానికి పనికి తగ్గ పారితోషికం పేరుతో ప్రభుత్వం పదేళ్ల క్రితం ఆశ వర్కర్లను నియమించింది. జిల్లాలో 91 పిహెచ్సీల పరిధిలో సుమారు 3000 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పనికి తగ్గ పారితోషికం సకాలంలో అందక కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థాయిలో అన్ని రకాల విధులు నిర్వర్తిస్తున్న ఆశాలకు ఇచ్చే పారితోషికం ఏ నెలకు ఆ నెల సక్రమంగా అందకపోవడంతో అవస్థలు తప్పటం లేదు. ఐదేళ్లుగా యూనిఫాం సరఫరా చేయలేదు. అప్పట్లో ఇచ్చిన యూనిఫారాలనే నేటికి ఆశాలు వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. డిమాండ్లు ఇవీ... ♦ పన్నెండేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న ఆశాలకు కనీస వేతనం రూ.6వేలు చెల్లించాలి ♦ ఏటా యూనిఫాం సరఫరా చేయాలి. ♦ పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాదబీమా, పనిభద్రత కల్పించాలి. ♦ చంద్రన్న సంచార చికిత్స బకాయిలు వెంటనే చెల్లించి, పారితోషికం రూ.300కి పెంచాలి. ♦ 2013–2014 నుంచి యూనిఫాం, అలవెన్స్ లు వెంటనే చెల్లించాలి. ♦ అర్హులైన వారికి ఏఎన్ఎం శిక్షణ ఇవ్వాలి. ♦ శిక్షణ పొందిన వారికి 2వ ఏఎన్ఎంగా తీసుకోవాలి. ఈ డిమాండ్లతో ఆశ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో సమ్మె చేపట్టనున్నారు.11వ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో ఆందోళనలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం కళ్లు తెరవాలి ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కళ్లు తెరవాలి. తెలంగాణలో ఆశాలకు ఇస్తామన్న గౌరవవేతనం ఏపీలో వెంటనే అమలు చేయాలి. సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 5న పీహెచ్‌సీల వద్ద, 6న నోటికి నల్లబ్యాడ్జీలతో తహశీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా, 7న డివిజన్ సెంటర్ల వద్ద రాస్తారోకోలు నిర్వహిస్తాం. – జి.ప్రతాప్‌కుమార్ సీఐటీయూ పర్చూరు డివిజన్ కార్యదర్శి.. ఆశతోనే పనిచేస్తున్నాం.. ఆశ ర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, గౌరవ వేతనం ఇస్తుందని, జీవనం గడుస్తుందన్న ఆశతోనే పనిచేస్తున్నాం. ప్రభుత్వం సానుభూతితో సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పిస్తుందన్న ఆశతోనే ఉన్నాం. తెలంగాణలో ఆశవర్కర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని మాకూ అమలు చేయాలి. – సుజాత, ఆశ కార్యకర్త శ్రమకు తగ్గ ఫలితం లేదు గ్రామాల్లో తాము పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం అందటం లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా న్యాయం చేస్తుందన్న నమ్మకంతో వేరే పనికి వెళ్లలేకపోతున్నాం. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్న ఆశతోనే పనిచేస్తున్నాం. – సుభాషిణి, ఆశ కార్యకర్త -
మగువలపై విరిగిన లాఠీ!
♦ ఆశ, అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసుల కర్కశత్వం ♦ ధర్నాకు వచ్చిన మహిళలపై దారుణంగా లాఠీచార్జి ♦ భయంతో పరుగులు తీసి మురుగుకాల్వలో పడిన వైనం ♦ ఐదుగురు మహిళలు, సీఐటీయూ నాయకుడికి గాయాలు ♦ బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోని దాష్టీకం ♦ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఎంతటి కాఠిన్యం... మహిళల్ని హడలెత్తించారు... భయాందోళనలు కల్పిం చి పరుగులెత్తించారు... హక్కులపై ఉక్కు పాదం మోపారు... కలెక్టరేట్ సాక్షిగా మహిళల రక్తం కళ్లజూశారు... సమస్యలు తీర్చాలని వేడుకుంటుంటే ఈడ్చి పారేశారు... కడుపు మండిపోతోందంటే కాఠిన్యం ప్రదర్శిం చారు... బకా యిలివ్వండంటే బహిరంగంగా బాదేశారు... వేతనాలిచ్చి బతి కించమంటే లాఠీలతో చావ బాదారు... శ్రమకు తగ్గ ఫలితం ఇమ్మంటే రక్తం చిందేలా కొట్టారు... జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సోమవారం నిర్వహించిన ఆందోళనపై సిసలైన జులుం ప్రదర్శించారు. కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే పోలీసులు తమ ప్రతాపం చూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో లాఠీఛార్జి చేసి మరో బషీర్‌బాగ్‌ను తలపించారు. విజయనగరం కంటోన్మెంట్: జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంగన్వాడీ, ఆశ, ఆయుష్ కార్యకర్తల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అంతవరకూ సామరస్యంగా సాగిపోతున్న కార్యక్రమంలో నేతలు ప్రసంగిస్తుండగా పోలీసులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. తొలుత జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీఐటీయూ నాయకులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయూష్ కింది స్థాయి ఉద్యోగులు ధర్నాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా పోలీసులు ఒక్కసారిగా వారి వద్దకు వచ్చి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలని చూడకుండా పోలీసులంతా వారిని ఈడ్చుకెళ్లడంతో మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే భారీ సంఖ్యలో కాపుకాసి ఉన్న మహిళా పోలీసులు, స్పెషల్ ఫోర్స్ సిబ్బంది వారిపై విరుచుకుపడ్డారు. లాఠీఛార్జికి ఆదేశాలు రావడంతో సాధారణంగా కనిపించిన పోలీసులంతా ఉగ్రరూపం దాల్చా రు. చేతిలోని లాఠీలతో ఒక్కసారిగా మహిళలపైకి దూసుకొచ్చారు. వారంతా భయాందోళనలతో తలోదిక్కు కు పరుగులెత్తారు. అప్పటికే లాఠీదెబ్బల కు గాయపడిన వారంతా కిందపడి మరింత నరకయాతన అనుభవించారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ధర్నా చేస్తున్న మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు వారి బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోలేదు. కొందరు వయసులో పెద్దయిన మహిళలున్నా ఖాతరు చేయలేదు. మహిళలంటే ఇదేనా గౌరవం అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. దెబ్బలను చూపిస్తూ విలపించారు. ఆవేదనతో ఆర్తనాదాలు చేశారు. మీ కేం అన్యాయం చేశామని ఇలా చావగొట్టారు? ఆడాళ్లను కొట్టి రమ్మని మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పంపించాడా? ఇంతకు ముందు తొమ్మిదేళ్లు ఇంట్లో కూచున్నాడే! మర్చిపోయాడా? మళ్లీ అదే గతి పడుతుందనేనా ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్నాడని శాపనార్థాలు పెట్టారు. మీకు నెలయ్యే సరికి జీతాలు పడతాయి. మాలా కడుపు మాడితే మీకు మా కష్టాలేమిటో తెలిసొచ్చేవంటూ తిట్ల దండకం అందుకున్నారు. వేతనాలడిగితే... ఇలా వేధిస్తారా... రాత్రీ... పగలూ తేడా లేకుండా తాము చాకిరీ చేసి వేతనాలడిగితే ఇలా విచక్షణారహితంగా కొట్టి తరిమేయడం ఎంతవరకు సబబని వారంతా గొల్లుమన్నారు. పోలీసు దెబ్బలకు గాయపడిన వారిని కూడా సాధారణ రీతిలో వ్యానులోనే పడేశారనీ మహిళలు ఆరోపించారు. ఆ దెబ్బలతో మూడు గంటలపాటు స్టేషన్లో ఉంచేసి తమను చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు గాయాలు పోలీసుల దాడితో మహిళలంతా తలోదిక్కుకు పరుగులు తీశారు. ఈ దశలో ఒకరినొకరు తోసుకుని కొందరు కిందపడిపోయారు. ఒకవైపు లాఠీ దెబ్బలు... మరోవైపు గాజులు పగిలి రక్కేయడంతో రక్తస్రావమయింది. మరికొందరు భ యంతో పరుగులు తీసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై పడ్డారు. పూసపాటిపాలేనికి చెందిన ఆర్గౌరి అనే కార్యకర్త కాలి అం త ర్భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఓ పోలీసు అధికారి వచ్చి గట్టిగా కొట్టారనీ ఆమె కాలు విరిగిపోయిందనీ మహిళలంతా గోల చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ అరెస్టులు కలెక్టరేట్‌వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు తరలివస్తున్న నాయకులు, ఆందోళనకారులను ఎక్కడికక్కడే పోలీసులు నిలుపుదల చేసి, అరెస్టు చేశారు. సీఐటీయూ రాష్ట్ర కా ర్యదర్శి, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి టి.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవ, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.వెంకటరావు, బూర్లె రమణ, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా కార్యదర్శి బొత్స సుధారాణి, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, ఎస్.కోట సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు బత్తిలి రమణను ఆందోళనలో భాగంగా అరెస్టు చేయగా జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావును హౌస్ అరెస్టు చేశారు. డెంకాడకు చెందిన అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మోపాడ కృష్ణవేణి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్.వై.నాయుడు, అంగన్వాడీ గౌరవ అధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, తదితరులు అరెస్టయినవారిలో ఉన్నారు. చలానా తీయలేదట! ధర్నాలో తాము చేసిన లాఠీఛార్జికి పోలీసు అధికారులు కొత్త కారణం చెప్పారు. వింత వాదన చేశారు. జిల్లాలో సెక్షన్ –30తో పాటు పలు నిషేధాజ్ఞలు అమలులో ఉ న్నాయనీ... ఎక్కడయినా ధర్నా చేస్తే ముందుగా తెలి యపర్చాలనీ కానీ ఉద్యమకారులు తమకు తెలియజేయలేదన్నారు. దీనిపై తాము ముందుగా తెలియపర్చిన తరువాతే ధర్నాకు దిగామని వారు చెబితే సెక్షన్ –30 ప్రకారం చలానా తీయలేదని బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత వాదించారు. జిల్లాలో చలానాలు తీసే సంప్రదాయం లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ధర్నా సమాచారం ఉండటంతో అది విజయవంతం కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నుంచి వచ్చే బస్సులు ఇతర వాహనాలను దారి మళ్లించారు. జేఎన్టీయూ జంక్షన్ నుంచి బస్సులను తిప్పేయాలని అక్కడ పోలీసులను మోహరించడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఎన్టీయూ నుంచి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజలు నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. మరికొందరు ఆటో డ్రైవర్లు ఇదే సందంటూ రూ.పదిచొప్పున వసూలు చేశారు. -
రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన సాగుతోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు ధ్వజమెత్తారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట కార్మిక నాయకులు మూడు రోజుల రిలేదీక్షలను చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల అభివృద్ధి, సమస్యల ఆయన ఎజెండాలో లేవని ఎద్దేశా చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వాలపై పోరాటానికి కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెంకటేశ్, నగర కార్యదర్శి గోపాల్, శ్రామిక మహిళ ఫోరం కన్వీనర్ దిల్షాద్, ఆశా వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి, మధ్యాహ్న బోజన పథకం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి, మునిసిపల్ కార్మిక సంఘం నాయకుడు నాగభూషణం, ఆశా వర్కర్ల సంఘం నాయకురాళ్లు లక్ష్మి, పార్వతి, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
వేతనాల పెంపులో నిర్లక్ష్యం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాదిరిగా ఏపీలో జీతాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రతి కార్యకర్తకు నెలకు రూ. 10,500, సహాయకులకు రూ. 6000 ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్సు అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం స్కీం కార్మికులు, చిరుద్యోగుల నుంచి శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. అంగన్వాడీలను తెలంగాణ ప్రభుత్వం రెగ్యూలర్ చేసిందని, జీతాలు పెంచి వారిని ఆదుకుందని తెలిపారు. అలాగే ఏపీలోనూ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సమావేశాలు ప్రతి నెల నిర్వహించాలని, అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని కోరారు. అంగన్వాడీ సంఘం నాయకులు హిమప్రభ, ఎ.సూజాత మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వేతనాలు ప్రతి నెల ఇవ్వాలని, నాలుగు నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. కార్యక్రమం ముగింపు సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వైద్యసేవలకు తరలించారు. -
‘సమర సమ్మేళనానికి కదలాలి’
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, కార్మికుల కనీస వేతనాల అమలుపై జరుగుతున్న సమర సమ్మేళన సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.సాయిబాబు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ధర్నా చౌక్‌ను రద్దు చేస్తూ అక్కడి నుంచి ఎత్తివేయడం అప్రజాస్వామికమని, కార్మిక, ప్రజాపోరాటలపై దాడి అని అన్నారు. అంగన్వాడీలు, వీఆర్వోలు, వీఆర్ఏలు పోరాడితే కొద్దిపాటి జీతాన్ని పెంచి పాలాభిషేకం చేయించుకుంటూ సీఐటీయూపై విషం చిమ్ముతున్న వైనాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయకుండా కొద్ది మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామని వీఆర్ఏల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కరిని కూడా చేయలేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశలు, అంగన్వాడీ మినీ సెంటర్ వర్కర్లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు యాకలక్ష్మి, రోశపతి, పెంటయ్య, ముత్యాలు, రంగయ్య, పరమేష్, సుందరయ్య, తిరుపతమ్మ పాల్గొన్నారు. -
పోరాటయోధుడు బీబీ నాయుడు
వందలాది మందితో అంతిమ యాత్ర కోటిలింగాలపేటలో దహన సంస్కారాలు కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మికోద్యమ నేత, సీఐటీయు నాయకుడు బీబీ నాయుడు చూపిన బాటలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నడవాలని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. మూత్ర పిండాల వ్యాధితో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సీఐటీయూ నాయకుడు బీబీ నాయుడు భౌతిక కాయానికి శనివారం మధ్యాహ్నం కోటిలింగాల పేట కైలాస భూమిలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న బీటీఆర్ భవ¯ŒS నుంచి బీబీ నాయుడు భౌతిక కాయానికి వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన యాత్ర పేపరుమిల్లు మీదుగా నందం గనిరాజు జంక్షన్, జాంపేట, గణేష్‌చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా కోటిలింగాల పేట కైలాస భూమికి చేరుకుంది. మధ్యాహ్నం దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రముఖుల నివాళి ఎర్ర జెండా పట్టుకుని అదే జెండా కింద నిబద్ధతతో నడిచిన బీబీ నాయుడు బాటలో అంతా నడవాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. నాయుడు మృతి కార్మిక లోకానికి తీరనిలోటన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణే ఊపిరిగా బీబీనాయుడు బతికారని మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మిడియం బాబూరావు అన్నారు. కుల రహిత సమాజం కోసం అంతా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకరచౌదరి సూచించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్ని కృష్ణ, సీసీసీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు, సీపీఎం అర్బ¯ŒS జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ నాయకులు మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, బయ్యా జోసఫ్, ట్రేడ్ యూనియ¯ŒS నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, డి.శేషుబాబ్జీ మాట్లాడారు. -
ఫీజుల పెంపు శరాఘాతం
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాకృష్ణ - 24న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఆర్టీఏ చలానాల పెంపు ఆటో రంగ కార్మికులకు శరాఘాతంగా మారిందని, జీవనాధారంగా ఉన్న ఆటోలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్రోల్, డిజిల్ ధర పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులపై ప్రభుత్వం చలానాల భారం మోపడం సరికాదన్నారు. ‘పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులు- ఆటోరంగం, దాని అనుబంధ రంగాలపై ప్రభావం’ అనే అంశంపై ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో సదస్సు నిర్వహించారు. నగరంలోని ప్రయివేటు ఫైన్సార్లు, ఆటో మొబైల్ యజమానులు, ఆటో మెకానిక్‌లు, పెయింటర్లు, ఎలక్ట్రిషీయన్లు, స్పేర్‌పార్ట్స్ షాపుల యజమానులు హాజరై సీఐటీయూ పోరాటాలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో ఎఫ్‌సీ లేటు ఫీజు కింద రోజుకు రూ.50 వసూలు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీనివల్ల ఆటోలను గంపగుత్తగా అమ్ముకోవాల్సిందేనని స్పష్టంచేశారు.పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈనెల 24న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.రాధాకృష్ణ, కే.ప్రభాకర్ పాల్గొన్నారు. -
20న దేశవ్యాప్త సమ్మె
అనంతపురం అగ్రికల్చర్ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు 2017–18 బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 20న స్కీం వర్కర్లు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ అనుబంధ స్కీం వర్కర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి నాగవేణి, అంగన్వాడీ వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నాగమణి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఎన్హెచ్ఎం, ఎన్ఆర్ఎల్ఎం, ఉపా«ధి హామీ పథకం, సాక్షర భారత్, సర్వశిక్షా అభియాన్ తదితర పథకాల్లో పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. -
కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా
ఆదిలాబాద్ అర్బన్ : సమ్మెకాలంలో ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశావర్కర్లకు కనీసం వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, అర్హత కలిగిన వారిని రెండో ఏఎన్ఎంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీనిచ్చి ఏడాది గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. యూనిఫాం అలవెన్స్‌లు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నామని, కానీ ఇంత వరకు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మమత, ఆశావర్కర్లు రాధ, లక్ష్మి, కాంత, శోభ, పద్మ, లలిత, స్వప్న, కవిత, పుష్పలత, వెంకటమ్మ, తులసీ, సునిత, పుష్ప, భారతీ, తదితరులు పాల్గొన్నారు -
జీవో-279ని రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు నెహ్రూనగర్ (గుంటూరు): మున్సిపల్ కార్మికులను ఇబ్బందులకు గురిచేసే జీవో నం.279ని రద్దు చేయకుంటే దీర్ఘకాలిక పోరాటం చేయకతప్పదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. జీవో 279ని రద్దు చేయాలని, 151, 193 జీవోల ప్రకారం జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బు«ధవారం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జీవో నం : 279 వల్ల అటు కార్మికులకే కాకుండా ఇటు ప్రజల నెత్తిన ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. తెనాలి, చీమకుర్తి మున్సిపాల్టీల్లో 279 జీవో ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం నిర్వహణ, జీతాల కంటే అదనంగా దాదాపు రూ.50 లక్షల దాకా ఖర్చువుతుందని చెప్పారు. అదనపు ఖర్చుల భారమంతా ప్రజలపై వేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికే నెల్లూరు, విజయనగరం, తెనాలి, సాలూరు మున్సిపాల్టీల్లో జీవో 279 అమలు పరిచి విఫలమయ్యారని తెలిపారు. 151, 193 జీవోల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు జీతాలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడించేందుకు సైతం వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. ధర్నాలో సీఐటీయూ నాయకులు పి.రామచంద్రరావు, ఎం.డేవిడ్, కె.తిరుపాల్, ధనలక్ష్మి, సుబ్బారావు, నాగభూషణం, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి
ఏలూరు(సెంట్రల్)ః రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో బయోమోట్రిక్ పేరుతో వేధిస్తున్నారని ఎపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ఆరోపించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారని ఫలితంగా రోజుకు రూ. 20 నుండి 40 వరకు వారికి ఖర్చు అవుతుందన్నారు. రెండు పూటలా రెండు గంటలకు పైగా వారికి సమయం వృధా అవుతుందని ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టలేని పరిస్ధితిలో అంగన్వాడీలున్నారన్నారు. బయోమెట్రిక్ విధానానికి తమ యూనియన్ వ్యతిరేకం కాదని, ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఫ్రీ స్కూల్‌ను నిర్వహించేందుకు సమయం లేMýంండా ఇతర అదనపు పనులు కేటాయిస్తూ ప్రభుత్వాధికారులే అంగన్వాడీ కేంద్రాలను బలహీనపరుస్తున్నారని, ఎస్ఎంఎస్ల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ సూపర్వైజర్లు చేయాల్సిన పనులు సైతం వర్కర్లతోనే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని ఆమె ఆరోపించారు. అర్హత కలిగిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉన్న జిల్లా అధికారులు నిబంధనలు పాటించకుండా అన్యాయం చేస్తున్నారని, వేతనాల పెంపు సందర్భంగా రూ. 63ను ఇంక్రిమెంట్లో కోత విధించి అంగన్వాడీలపై సవిత తల్లి ప్రేమ కనబరిచారన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వాగ్ధానం చేసిన చంద్రబాబుకు ఆ వాగ్ధానం గుర్తు లేదా అని ప్రశ్నించారు. జిల్లాలోని తక్షణమే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని, లేదా ఆయా కేంద్రాల్లోనే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సుబ్బరావమ్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, కె.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పర్యాటకాన్ని ప్రైవేటుపరం చేయోద్దు
హైదరాబాద్: ప్రభుత్వ బడ్జెట్‌తో అభివృద్ధి చేసిన పర్యాటక కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎ.గఫూర్, ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎక్కువ మందికి ఉపాధి లభించాలన్నా, సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నా పర్యాటక రంగం ప్రభుత్వరంగంలో ఉండడమే ఉత్తమమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో ఇక్కట్లు పడుతూ కూడా ఉద్యోగులు టూరిజం కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆధీనంలో 39 ప్రాజెక్టులు, 3 వేసైడ్ (దారిపక్క) వసతిగృహాలను ప్రైవేటు ఆపరేటర్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి వర్తించే ఏపీ టూరిజం పాలసీని హడావిడిగా ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కనీసం కేబినెట్ భేటీలో కూడా చర్చించకుండా ఈమేరకు 15వ నెంబర్ జీవోను జారీ చేసిందని వివరించారు. అమరావతి, విశాఖ, తిరుపతి, రాజమండ్రిలో సిటీ టూరిజం కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నదని, ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన ఆస్తులను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెడితే తీవ్ర అనర్థాలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న వాటిలో భవానీ ఐలాండ్, దిండి, కాకినాడ, బరంపార్క్ ఉన్నాయని, ఒకప్పుడు ఈ విషయాన్ని వ్యతిరేకించిన సీం చంద్రబాడు నాయుడు స్వయంగా తానే తిరిగి వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడడం అన్యాయమని పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
బద్వేలు అర్బన్: ఆర్థిక, రాజకీయ చైతన్యం పునాదిగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ డివిజన్ అధ్యక్షులు జి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ రెండవ మహాసభలలో ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గంపై ప్రభుత్వం, పోలీసులు ఒక వైపు , కిరాయి గుండాలు మరోవైపు అణచివేతకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకల సంపదలకు సృష్టికర్తలైన కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసులు మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యం పేరుతో ఉద్యోగ అవకాశాలు కుదిస్తున్నారని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయడంతోపాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మైదుకూరు డివిజన్ కార్యదర్శి సురేష్‌బాబు, బద్వేలు, పోరుమామిళ్ల సబ్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, పిసి.కొండయ్య, నాగేశ్వర్‌రెడ్డి, మాబు, వివిధ మండలాల యూనియన్ నేతలు పాల్గొన్నారు. -
కార్మికులను దోచుకుంటున్నారు
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ గూడూరు : ఆంధ్రాలో టీడీపీ, తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల శ్రమను దోచుకుని పెట్టుబడిదారి వర్గాలకు కొమ్ముకాస్తున్నాయని సీఐటీయూ ఏపీ జనరల్ సెక్రటరీ ఎంఏ గఫూర్ అన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరులోని శ్రీ కటాలమ్మ దేవాలయ కల్యాణమండపంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం 32వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గఫూర్ మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేమంటున్న టీడీపీ ప్రభుత్వం 2015– 16 సంవత్సరాల్లో కార్పొరేట్ వర్గాలకు పన్ను రాయితీ రూ.లక్ష కోట్లకు పైగా ఇవ్వడం జరిగిందన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్ ఎం.కష్ణన్ మాట్లాడుతూ తపాలా శాఖలో ఇప్పటివరకు పోరాటాల్లో పోస్టుమన్, ఎంటీఎస్‌ల పాత్రే కీలకమన్నారు. సమావేశంలో పోస్టుమన్, ఎంటీఎస్ ప్రధాన కార్యదర్శి సీతాలక్ష్మి, పోస్టుమన్ ఎంప్లాయీస్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కె.చంద్రశేఖర్, హుమయున్, ప్రసాద్, విద్యాసాగర్, సంఘం డివిజనల్ కార్యదర్శి సుధాకర్, పురుషోత్తం పాల్గొన్నారు. -
28 నుంచి శ్రామిక మహిళా జాతీయ మహాసభలు
గుంటూరు వెస్ట్: శ్రామిక మహిళా 11వ అఖిల భారత మహాసభలు ఈనెల 28 నుంచి 30 వరకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో జరుగుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి తెలిపారు. బ్రాడీపేటలోని యూనియన్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28న మధ్నాహ్నం 2 గంటలకు ‘శ్రామిక మహిళలు, జీవన భద్రత’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సదస్సుకు శ్రామిక మహిళా జాతీయ కన్వీనర్ డాక్టర్ కే.హేమలత, శ్రామిక మహిళా అఖిల భారత నాయకురాలు ఎస్.వరలక్ష్మి ముఖ్యఅతిధులుగా హాజరై ప్రసంగించనున్నారని తెలిపారు. 29, 30 తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతాయని చెప్పారు. 29న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో ‘ప్రస్తుత పరిస్థితులు, ఉద్యోగ కార్మికవర్గం ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. సీఐటీయు జాతీయ అధ్యక్షుడు ఏ.కె.పద్మనాభన్ సదస్సుకు హాజరై ప్రసంగించారని తెలిపారు. ఈసందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించండి
దూసి(ఆమదాలవలస రూరల్): కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. దూసి గ్రామంలో కాన్‌కాస్ట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా మంగళవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అండతో కాన్‌కాస్ట్ యాజమాన్యం కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని, డీఏ పాయింట్‌కు రూ. 12 ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఎడ్యుకేషన్ అలవెన్స్, యూనిఫాం వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో కార్మికులు బమ్మిడి రమణ, రామచంద్రరాజు, మోహన్‌రావు, బి.కాళిదాస్, టి.రాము, పి.రాజశేఖర్, సి.హెచ్.జానకిరావు, వి.రాజు, వై.వాసుదేవరావు, బి.తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం ఇస్కాన్‌కు ఇవ్వద్దు
– కలెక్టరేట్ ముట్టడి, ధర్నా, నినాదాలు – వాగ్వాదం, తోపులాటలు, అరెస్టులు చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్నభోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించకూడదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.చైతన్య డిమాండ్ చేశారు. జిల్లాలోని మధ్యాహ్నభోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేట్లను మూసివేసి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. చైతన్య మాట్లాడుతూ మధ్యాహ్నభోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అందజేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ఉదయం ఎప్పుడో చేసిన భోజనాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డిస్తుండటంతో జ్వరాల బారిన పడుతున్నారన్నారు. జిల్లా అధికారులు ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్నభోజన పథకాన్ని అప్పగించేందుకు రహస్య చర్యలు చేపడుతున్నారని ఆయన దుయ్యపట్టారు. ఈ పథకాన్ని ఇస్కాన్‌కు అప్పగిస్తే జిల్లా వ్యాప్తంగా 9వేల మంది మధ్యాహ్నభోజన కార్మికులు వీధినపడాల్సి వస్తుందన్నారు. 13 ఏళ్లుగా మధ్యాహ్నభోజన పథకాన్ని కార్మికులు అప్పులు చేసి నిర్విఘ్నంగా నిర్వహించారన్నారు. కార్మికులకు మధ్యాహ్నభోజన పథకాన్ని అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బహిర ంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఓ దశలో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్మికులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు తోపులాట జరిగింది. కొందరు మహిళా కార్మికులు కిందపడిపోయారు, దాదాపు 100 మంది కార్మికులను పోలీసులు అరెస్టుచేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాణి, మధ్యాహ్నభోజన పథకం కార్మిక నాయకులు అముద, మంజుల, విమల, సావిత్ర తదితరులు పాల్గొన్నారు. –19సీటీఆర్ 18 – -
పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు
హిందూపురం టౌన్ : పెట్టుబడిదారులకు, పరిశ్రమల యాజమాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొత్తులుగా మారాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ మండిపడ్డారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కార్మిక చట్టాలను ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్నారన్నారు. ఆ చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్ఏ రావ్‌తార్ పరిశ్రమల్లో అన్యాయంగా 183 మంది కార్మికులను తొలగించి 15 నెలలు గడిచినా విధుల్లోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రజలకు, కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన ఎమ్మెల్యే బీకె పార్థసారథి పరిశ్రమ యాజమాన్యం ఇచ్చే నోట్ల కట్టలకు దాసోహం అయ్యాడని విమర్శించారు. కార్మికుల సమస్యపై ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్, మంత్రి, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించినా ఫలితం లేదని ఆవేదన చెందారు. దీంతో అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఎస్ఏ రావ్‌తార్ కార్మిక సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి చేపట్టిన పాదయాత్ర 20వ తేదీకి అనంతపురం చేరుకుంటుందన్నారు. 21న కలెక్టరేట్ ఎదుట కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా 22న అన్ని రాజకీయ, ప్రజా సంఘాల, కార్మిక సంఘాలు, విద్యార్థి, రైతు, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జెడ్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కళ్లున్నకబోదిలా ప్రభుత్వాలు
హిందూపురం టౌన్ : ప్రభుత్వాలు, అధికారులు కార్మికులపై కళ్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. పరిగి మండలంలో ఉన్న ఎస్ఏ రావ్‌తార్ పరిశ్రమలో అన్యాయంగా 193 మంది కార్మికులను తొలగించి 15 నెలలు గడిచినా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. చట్టం ప్రకారం కనీస వేతనాలు పెంచాలని yì మాండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు, యువజన సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, వైఎస్సార్‌టీయూ ఆధ్వర్యంలో ఎస్ఏ రావ్‌తార్ కార్మిక సంఘీభావ కమిటీగా ఏర్పడి బుధవారం నుంచి పాదయాత్ర చేపట్టామన్నారు. హిందూపురంలో ప్రారంభమై అనంత కలెక్టరేట్ వరకు యాత్ర సాగుతుందన్నారు. దీంతో పాటు 16న కదిరి, 17న గుంతకల్లు, 18న తాడిపత్రిలో పాదయాత్రలు ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో సీఐటీ యూ డివిజన్ కార్యదర్శి జెడ్పీ శ్రీనివాసులు, నాయకులు రాజప్ప, నారాయణస్వామి, లింగారెడ్డి, పురుషోత్తం, రాము, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ తొలగింపును అడ్డుకున్నాం
జైపూర్ : అంగన్వాడీలు, వర్కర్స్ అండ్ హెల్పర్ల అక్రమ తొలగింపులను ఐక్యతతో అడ్డుకొని విజయం సాధించామని సీఐటీయూ అంగన్వాడీ, వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మయూరి తెలిపారు. జైపూర్ మండలం భీమారంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల స్థితి గతులు, పరిస్థితులు చూడకుండానే అక్రమంగా అంగన్వాడీలను, ఆయాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల అక్రమంగా అంగన్వాడీలు, ఆయాలను తొలగించగా ఐక్యంగా పోరాడామని పేర్కొన్నారు. ఫలితంగానే తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సమస్యలను పరిష్కరిస్తే ఎలాంటి అవకతవకలు జరగవని అధికారులకు సూచించారు. సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంకె రవి, చెన్నూర్ డివిజన్ అధ్యక్షుడు కష్ణామాచారి పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వండి
సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్ రాపూరు: విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను వెంటనే జీతాలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్ చేశారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బుధవారం సీఐటీయూ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌శాఖలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలలుగా, మీటర్ రీడింగ్ తీసే వారికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదన్నారు. వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. ప్రతి నెలా 7న ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విషయాలపై ఈనెల 13 వ తేదీ నుంచి దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్, ప్రధానకార్యదర్శిజాకీహుసేన్, డివిజనల్అధ్యక్షుడు రత్నయ్య, కార్యదర్శి మునికిష్టయ్య, నాయకులు రామయ్య, కిష్టయ్య, గిరిబాబు, యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు సార్వత్రిక సమ్మె
బీఎంఎస్ మినహా జాతీయ కార్మిక సంఘాల పిలుపు ఉద్యోగ, ఉపాధ్యాయ, వామపక్ష, ప్రజా, కార్మిక సంఘాల మద్దతు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కరీంనగర్ : ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు 12 డిమాండ్లతో శుక్రవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ(జే), బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందని, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడో వంతుకు పడిపోయినా దేశీయంగా ధరలు తగ్గించడం లేదని, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందని సమ్మె సైరన్ మోగించాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కార్మికులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని మండిపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాల సవరణకు పూనుకోవడంతో బీజేపీ అనుబంధ విభాగమైన బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు సై అనడం విశేషం. సమ్మెకు సంబంధించి గత నెలరోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ, ఎల్ఐసీ, తదితర సంఘాల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డిమాండ్లు ఇవే... –నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. –ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలి. –నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పనకు ఉపకరించే ప్రాజెక్టులను, పరిశ్రమలను నెలకొల్పాలి. –వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించాలి. –కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలి. కనీస వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలి. –అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలి. ఇందుకోసం ఆయా పరిశ్రమలు తమ ఆదాయంలో 3 శాతం వాటాను కేటాయించాలి. –అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను రెగ్యులరైజ్ చేయాలి. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ సదుపాయాలను వర్తింపజేయాలి. –కార్మిక సంఘం నమోదు కొరకు అభ్యర్థనను సమర్పించిన 45 రోజులలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. సంఘం ఉనికిని యాజమానులు, అధికారులు గుర్తించాలి. –2013 భూస్వాధీన చట్టంలోని సామాజికSప్రభావంపై అంచనా, తగు నష్టపరిహారం చెల్లించటం, పునరావాసం కలిగించడం, ప్రజల మధ్య విచారణ జరపటం, 70 శాతం మంది ప్రజల ఆమోదాన్ని పొందటం అనే నిబంధలను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలి. హక్కులను హరించడమే –ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోంది. సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల నడ్డివిరిచే చర్యలకు పూనుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోంది. కనీస వేతనాలు, ఉద్యోగభద్రత, పీఎఫ్, ఈఎస్ఐ,గ్రాట్యుటీ, బోనస్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక లోకం సంఘటితంగా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించాలి. జయప్రదం చేయండి –కాల్వ నర్సయ్యయాదవ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికలోకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. హమాలీ, ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, గ్రానైట్ కార్మికులు, షాపింగ్ మాల్స్‌లో పనిచేసే అసంఘటిత కార్మికులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, సామాన్య ప్రజానీకం సమ్మెలో పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పాలి. అందరూ సహకరించాలి సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం టవర్‌సర్కిల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డప్పుచాటింపు నిర్వహించారు. నాయకులు పైడిపల్లి రాజు, కటికిరెడ్డి లచ్చన్నయాదవ్, విష్ణు, రమేశ్, ప్రభాకర్, నాగరాజు, కోంరయ్య, సాయిలు, రవి, చంద్రయ్య, మల్లేశం, వెంకటి, నారాయణ, రాజయ్య, శంకర్, భూమయ్య, నాయక్ పాల్గొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్, గంజ్, గాంధీరోడ్లలో దుకాణాల వ్యాపారులతో ప్రచారం నిర్వహించారు. నాయకులు రమణారెడ్డి, ఎడ్లరమేశ్, మల్లారెడ్డి, అజయ్, సంతోష్, సదానందం, రవీందర్, రాజు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి: సీఐటీయు
కళాశాలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూసీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు బాలు, దేవయ్యలు మాట్లాడుతూ..రోజు కూలీ లెక్కన కార్మికుల చేత పని చేయించుకుంటున్న కళాశాల యాజమాన్యం కార్మికులకు కనీస వేతనాలు అందించడంలో విఫలం అవుతున్నాయని అన్నారు. రోజుకు రూ. 500 వందల చొప్పున ప్రతి కార్మికునికి వేతనాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కార్మికులకు జీతాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో పని చేస్తున్న మహిళా సిబ్బంది, లక్ష్మయ్య, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘సమ్మె విరమిస్తేనే...’
మణికొండ: డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు సమ్మె విరమిస్తేనే వారి సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు మణికొండలోని మంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారు ఆందోళనకు సిద్ధ పడుతుండగానే మంత్రి బయటకు వచ్చి వారితో చర్చించి వినతిపత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగటం తగదన్నారు. రెండవ ఏఎన్ఎంల విషయంలో తాను ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించామని, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పథకం కేంద్రం మంజూరు చేయాల్సి ఉన్నందునే ఆలస్యం జరుగుతుందన్నారు. సమ్మె విరమించి తన వద్దకు వస్తేనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. దాంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఐటీయూ నేతలు జైపాల్‌రెడ్డి, తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి బలరాం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 4వేల మంది రెండ వ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలన్నా రు. 10 పీఆర్సీ ప్రకారం ఏఎన్ఎంలకు బేసిక్ జీతం రూ. 21.300లతో పాటు డీఏ, హెచ్ఆర్ఏలు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోనందునే సమ్మెకు దిగామన్నారు. కార్యక్రమం లో కవిత, రోజా, రమాదేవి, అనిత, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటోజాతా
షాద్‌నగర్ : సెప్టెంబరు 2న నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సోమవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజు ఆటోజాతాను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు, కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారన్నారు. ప్రజా నిరసనను లెక్క చేయకుండా సంస్కరణలను మరింత దూకుడుగా అమలు చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్స్రెన్సు రంగంలోకి ఎఫ్‌డీఐ శాతాన్ని పెంచుతూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందన్నారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎఫ్‌డీఐలను వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన అనంతరం విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నారన్నారు. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రోజురోజుకు పరిశ్రమలు మూత పడుతున్నాయని దీంతో కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడుతున్నారన్నారు. సార్వత్రిక సమ్మెకు కార్మిక, ఉద్యోగ, నిరుద్యోగులు, మేధావులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాల్‌రెడ్డి, యాదగిరి, రాజశేఖర్, శ్రీనునాయక్, ఈశ్వర్, సుమన్, శివ, యాదిరెడ్డి, అజ్మీర్, శ్రీశైలం, యాదయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల అణచివేత విధానాలు తగదు
సత్తెనపల్లి (గుంటూరు): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను అణచివేయడానికి నిరంకుశ పద్ధతులు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి విమర్శించారు. సెప్టెంబరు 2న 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ స్థానిక ఎన్జీవో హోమ్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. ఈసదస్సుకు సీఐటీయూ సత్తెనపల్లి డివిజన్ ఉపాధ్యక్షులు పెండ్యాల మహేష్ అధ్యక్షత వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ 2015లో కార్మిక సంఘాల సమ్మె సందర్భంగా 12 డిమాండ్లు పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. ధరలు పెరుగుతున్నా ప్రధాని మోదీ నుంచి స్పందన కరువైందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సమ్మెలు, ధర్నాలు సహించనని కఠినంగా అణచివేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. కార్మికులను ఎటువంటి బలప్రయోగాల ద్వారా అణచలేరని, ఈ సమ్మె ద్వారా కార్మికుల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.వి.కె.సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలకు కార్మికుల గోడు వినిపించడం లేదన్నారు. తప్పని పరిస్థితుల్లోనే సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలన్ని సమ్మెకు సన్నద్ధమయ్యాయని చెప్పారు. కార్మికుల సహనాన్ని చేతకాని తనంగా చూడొద్దని హెచ్చరించారు. సదస్సులో ఐఎన్టీయూసీ ప్రతినిధి మాదంశెట్టి వేదాద్రి, వైఎస్సార్‌టీయూ ప్రతినిధి గరికపాటి ప్రభాకరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాసరావు, సీఐటీయూ సత్తెనపల్లి డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఆంజనేయులు నాయక్, గుంటూరు మల్లేశ్వరి, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి పొత్తూరి రామకోటయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి అవ్వారు ప్రసాదరావు, ముఠా వర్కర్స్ అధ్యక్షుడు తోటా పుష్పరాజ్, ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్.కె.సుభాని, ఆటో వర్కర్ యూనియన్ నాయకులు డీఆర్ మస్తాన్, ఎం.హరిపోతురాజు, వంకాయలపాటి ప్రభాకరరావు మాట్లాడారు. సదస్సులో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాలను తొలగించే కుట్రలను ఆపాలి
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పారిశ్రామికవాడ(కొత్తూరు) : కార్మికచట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చే ప్రక్రియను వెంటనే ఆపాలని, లేని పక్షంలో కార్మికుల పోరాటంతో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రం సమీపంలోని పారిశ్రామికవాడ సమీపంలో గురువారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదల అభివద్ధి లేదన్నారు. కేవలం ధనవంతులు మాత్రమే మరింతగా అభివద్ధి సాధించినట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పలు రంగాల్లోకి ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెను చేపట్టి మోదీకి గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఇండస్ట్రియల్ కమిటీ కన్వీనర్ పానుగంటి పర్వతాలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు బాల్‌రెడ్డి, ఎన్. రాజు, మండల కార్యదర్శి బాసా సాయిబాబా, నాయకులు మల్లేష్, శ్రీను, జంగయ్య, ర వీందర్, షకీల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
2న దేశవ్యాప్త సమ్మె
హుకుంపేట: కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 2న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను ఏజెన్సీలోని కార్మిక వర్గాలన్నీ విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు పుణ్యారావు కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్‌తో సీఐటీయు, అనుబంధ కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె చేపడుతున్నాయన్నారు. నిత్యావసరాల ధరలు అధికంగా పెరుగుతున్నా కార్మికులకు మాత్రం చాలీచాలని వేతనాలు ఇస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కొండలరావు, హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
దేశ ప్రయోజనాలు కాలరాసేందుకే ఎఫ్‌డీఐ
జమ్మలమడుగు: బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, రక్షణ,పౌరవిమానయాన రంగాల్లో దేశప్రయోజనాలకు భిన్నంగా కేంద్రప్రభుత్వం ఎఫ్‌ఐడి పరిమితి పెంచే ప్రయత్నం చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండేళ్లనుంచి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వాలన్నారు.భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి మళ్లించిన రూ.600కోట్లు తిరిగి జమచేసి అసంఘటిత రంగ కార్మికులకందరికీ సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐల పరిమితి పెంచే ప్రయత్నానికి నిరసనగా సెప్టెబర్ 2 న దేశ వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు చెప్పారు. -
దేశ ప్రయోజనాలు కాలరాసేందుకే ఎఫ్‌డీఐ
జమ్మలమడుగు: బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, రక్షణ,పౌరవిమానయాన రంగాల్లో దేశప్రయోజనాలకు భిన్నంగా కేంద్రప్రభుత్వం ఎఫ్‌ఐడి పరిమితి పెంచే ప్రయత్నం చేస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామమోహన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండేళ్లనుంచి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వాలన్నారు.భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధి నుంచి మళ్లించిన రూ.600కోట్లు తిరిగి జమచేసి అసంఘటిత రంగ కార్మికులకందరికీ సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌డీఐల పరిమితి పెంచే ప్రయత్నానికి నిరసనగా సెప్టెబర్ 2 న దేశ వ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు చెప్పారు. -
మోటారు బిల్లు పెంపుపై నిరసన
యాచారం: కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన మోటార్ వాహనాల బిల్లును పార్లమెంట్లో అమోదింపజేయవద్దని డిమాండ్ చేస్తు బుధవారం యాచారంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ బిల్లు అమోదింపజేయడానికి చూస్తోందని పలువురు నాయకులు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ చౌరాస్తాలో గంట పాటు ధర్నా అనంతరం సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి పి. బ్రహ్మయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల బిల్లును తెచ్చి డ్రైవర్ల మీద కేసులు, ఇతర పరిహారం చెల్లింపు విషయంలో కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో విపక్షాలు బిల్లు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా బిల్లు అమోదింపజేయడం కోసం పట్టుతో ఉండడంపై మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో వాహన డ్రైవర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. -
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
రామగిరి : ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానం మేరకు ఇంటి పనివారిని కార్మికులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సాగర్ల యాదయ్య, బోడ ఇస్తారి, గణేశ్, దండంపల్లి సరోజ, జానకి, డేగల రాములమ్మ, అంజమ్మ, పద్మ, వల్లమ్మ, ఏశమ్మ, ఎల్లమ్మ, జ్యోతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలి
కడప సెవెన్‌రోడ్స్: కనీస వేతనాల చట్టం కింద ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయ్‌మెంట్స్‌లో కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 18 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం వేతనాలను సవరించాల్సి ఉంటుందన్నారు. షెడ్యూల్డ్–1లోని 65 ఎంప్లాయ్‌మెంట్స్‌కు గాను 54 ఎంప్లాయ్‌మెంట్స్‌లో వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2011, 2012లో షెడ్యూల్డ్–1లోని మిగతా 11 ఎంప్లాయ్‌మెంట్స్‌కు జరిగిన వేతన సవరణల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆయిల్‌మిల్లులు, పేపరు మిల్లుల కార్మికులకు వేతనాలు తగ్గించడం అన్యాయమన్నారు. స్పిన్నింగ్ మిల్లులు, గార్మెంట్స్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు నిర్ణయించడం న్యాయం కాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా వేతన సవరణ పెండింగ్‌లోనే ఉందని విమర్శించారు. ఇందువల్ల కార్మికులు వేలాది కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బద్వేలు శ్రీను, రిమ్స్ సుబ్బయ్య, సునీల్, అన్వేష్, మున్సిపల్ వర్కర్లు, యార్డు హమాలీలు, ఆటో వర్కర్లు, ఐఎంఎల్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన
హిందూపురం టౌన్ : ఆశావర్కర్‌ను దూషించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ సీపీఎం, సీఐటీయూ, ఆశా వర్కర్లు మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్టు వైద్యురాలు మాధవి పరిగికి చెందిన ఆశా వర్కర్ పద్మను‘చెప్పుతో కొడతా’ అంటూ దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న ఆశావర్కర్లను దూషించిన డాక్టర్‌పై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంఓ రుక్మిణమ్మ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, రాజప్ప, రాము, లింగారెడ్డి, మారుతీ, ఆశావర్కర్లు భాగ్యలక్ష్మి, జయమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్స్ సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ వికారాబాద్ రూరల్: అసంఘటిత కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కార్మికుల బతుకులు దయనీయ స్థితిలో కొనసాగుతున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆటో డ్రైవర్స్ కార్మికల సమస్యలపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యమత్యమై సమస్యల సాధన కోసం పోరాడాలన్నారు. పెరిగిపోతున్న జనాభా అవసరాలు తీర్చడంలో ఆటో కార్మికులు సమాజంలో కీలకమన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ అగ్రభాగాన ఉంటుందన్నారు. ప్రస్తుత ఆటో కార్మికుల ఆటో అడ్డాల సమస్యలు, పోలీసుల అక్రమ చలాన్లు, జరిమానాలు, కోర్టు ఫైన్లు, ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం పెంచుతున్నారన్నారు. ఆటో కార్మికులు లైసెన్సు కోసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి నిబంధనలతో చదువురాని కార్మికులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆర్టీఏ అధికారులు, పోలీసుల వేధింపులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శులు పి.అశోక్, పి.మల్లేశం, ఆటో డ్రైవర్లు ప్రసాద్, శ్యామ్, అంబయ్య, జంగయ్య, అశోక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారి వెంట వీధి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోశపతి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పేరుతో రహదారుల వెంట గల వీధి వ్యాపారుల దుకాణాలను, తోపుడు బండ్లను తొలగించారన్నారు. దీంతో వందలాది మంది వీధి వ్యాపారులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో స్పందించిన నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య, కమిషనర్ సత్యనారాయణరెడ్డిలు వీధి వ్యాపారులతో చర్చలు జరిపారు. రహదారి ఆక్రమణకు గురికాకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కె.అక్బర్, చంద్రు, వెంకటేశ్వర్లు, పిచ్చమ్మ, శేఖర్, సైదులు, రామయ్య, ప్రసాద్, రాజేష్, మట్టయ్య, నాగమణి, రమణ, ఆదెమ్మ, కొండలు పాల్గొన్నారు. -
నేడు కార్మిక సంఘాల సదస్సు
విజయవాడ(గాంధీనగర్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా స్థాయి సన్నాహాక సదస్సు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాలు నాయకులు తెలిపారు. సన్నాహక సదస్సు కరపత్రాలను గురువారం దుర్గాపురంలోని సీఐటీయూ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు విడుదల చేశారు. ముజఫర్ అహ్మద్(సీఐటీయూ), రంగనాయకులు (ఏఐటీయూసీ), బి.వెంకటసుబ్బయ్య(ఐఎన్టీయూసీ), పి.ప్రసాదరావు (ఇఫ్టూ), ఆర్.అజయ్‌కుమార్(బెఫి) పాల్గొన్నారు. సన్నాహక సదస్సును హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ సదస్సులో అఖిల భారత కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సమ్మె ప్రాధాన్యతను వివరిస్తారన్నారు. -
ఆగస్టు 4న కార్మిక మంత్రి కార్యాలయం ముట్టడి
సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4న కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయాన్ని ముట్టడించేందుకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, డి.గోవిందరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణం ఇందిరానగర్ కాలనీలోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీ అమలు చేయలేదన్నారు. వేతన సవరణ గడువు పూర్తయి ఐదేళ్లు గడిచినా సవరించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో పరిశ్రమలు మూతపడడం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడినా కార్మిక మంత్రికి పట్టడం లేదని విమర్శించారు. మూసివేసిన పరిశ్రమలు తెరిపించకుండా అణువిద్యుత్ ప్లాంట్ వస్తే ఉపాధి కలుగుతుందని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని, వేతన అమలు సలహా బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, 65వ షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచాలని, కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, కార్మిక చట్టాలు సవరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కార్యాలయం ముట్టడికి పరిశ్రమలు, షాపులు, హోటళ్లు, ఇంటి పనివారు, జీడి, కొబ్బరి హమాలీ, మోటారు కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్ల సాధనకు సంతకాల సేకరణ చేయాలని కోరారు. ఈ మేరకు గోడ పత్రికను ఆవిష్కరించారు. -
రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని టీyీ పీ జిల్లా అధ్యక్షుడు గండ్రసత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంల సమ్మెను పురస్కరించుకుని సోమవారం హన్మకొండలోని ఏకశిలా పార్క్ లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి గం డ్ర సత్యనారాయణ, సారంపల్లి వాసుదేవరెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 2007–2008 సంవత్సరం నుంచి 4 వేల మంది కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలు కొనసాగుతున్నారన్నారు. వీరు 8 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశా రు. రెండో ఏఎన్ఎంలకు 35 రోజుల క్యాజు వల్ లీవ్‌లు ఇవ్వాలని, 180 రోజుల వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చే యాలని కోరారు. విధి నిర్వహణలోచనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డి మాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి బొట్ల చక్రపాణి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఆయా సం ఘాల నాయకులు ఎ.జనార్ధన్, జి.దయాకర్, జి.రమేష్, ఎస్.అనిత, శ్రీకాం త్, కె.అయిలయ్య, సి.హెచ్.అనిల్, చాడా రఘునాథరెడ్డి, డి.తిరుపతి, జె.సుధాకర్, ఏఎన్ఎంలు కె.సరోజ, సుజాత, పద్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల రక్షణకు నిరంతరం పోరాడుతాం
బోధన్: కార్మికులు, ఉద్యోగుల హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ డివిజన్ ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మిక రంగ సమస్యల పరిష్కారంలో తమ యూనియన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 30, 31 తేదీల్లో జిల్లా మహాసభలు ఈనెల 30, 31 తేదీల్లో ఆర్మూర్ పట్టణంలో యూనియన్ తొమ్మిదో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లలో చేపట్టిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. కార్మికుల అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ డివిజన్ ప్రతినిధులు జే శంకర్‌గౌడ్, రమాదేవి, షేక్ మీరాలు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలి
కార్మిక సంఘాల నాయకులు పిలుపు ఒంగోలు టౌన్ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గం సన్నద్ధం కావాలని జిల్లాకు చెందిన కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాన్ని 18 వేల రూపాయలకు తగ్గకుండా నిర్ణయించాలని, నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. మరోవైపు ఉద్యోగులు, కార్మికుల హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారన్నారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వాలకు హెచ్చరిక పంపాలని, అందుకోసం జిల్లాలోని ఉద్యోగ, కార్మికవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మజుందార్, చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి బి.వెంకట్రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్ చౌదరి, నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి ఆర్.మోహన్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రామస్వామి, కె.వీరాస్వామిరెడ్డి, జిల్లా నాయకులు చంద్రశేఖర్, జనార్దన్, వాసు, రఫీ పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నర్సింహరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పర్వతాలు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు. స్వదేశి జపం చేస్తున్న ఎఫ్‌డీఐలను దేశంలో ప్రవేశ పెడుతున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్నారు. ఇందులో 15 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని, ఆ రోజు నిర్వహించే సమ్మెను విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సమ్మె కరపత్రాన్ని విడుదల చేశారు. కా ర్యక్రమంలో నాయకులు షాహిద్‌అలీ, చంద్రకాంత్, రాంమోహన్, అంబదాస్, రాముయాదవ్, బాలస్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
చలో కలెక్టరేట్ విజయవంతం చేయండి
• సీఐటీయూ రాష్ట్ర నేత జి.ఓబులు హిందూపురం రూరల్ : గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్ట సాధన lకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ చేపట్టిన చలో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు జి.ఓబులు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం తూమకుంట పారిశ్రామిక వాడలో గార్మెంట్స్ పరిశ్రమల ముందు చలో కలెక్టరేట్ సెప్టెంబర్ 2న జరుగబోయే దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని కరపత్రాలు పంపిణీ చేశారు. గార్మెంట్స్ అనుబంధ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్మిక శాఖాధికారులు యాజమాన్యంతో లాలూచీ పడి చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. అదేవిధంగా తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం నిరసన చేపట్టిన విప్రో కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నారాయణస్వామి, పురుషోత్తం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలు మహిళలకే ఇవ్వాలి
మంచాల : మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలను మహిళలకే ఇవ్వాలని సీఐటీయూ రాష్ర్ట నాయకురాలు రమ అన్నారు. బుధవారం సాయంత్రం జీపుజాతా మంచాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా ప్రభుత్వ బడుల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేస్తున్నారన్నారు. సకాలంలో ప్రభుత్వం వేతనాలు, బిల్లులు ఇవ్వకపోయిన అప్పులు చేసి వంటలు చేయడం జరిగిందన్నారు. నేడు ఉన్నఫలంగా ప్రభుత్వ ప్రైవేట్ ఏజెన్సీలకు వంటలను అప్పజెప్పాలని చూడడం దారుణమన్నారు. అప్పుచేసి చాలీచాలని వేతనాలతో గత కొన్నేళ్లుగా.. వంటలు చేసి జీవనం పొందుతున్న మహిళలకే ఏజెన్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వంట గదులు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలి, సకాలంలో వేతనాలు ఇవ్వాలి, బిల్లులు ప్రతి నెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నర్సింహ, శ్యామల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా శేఖర్
కరీంనగర్ : సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా బండారి శేఖర్, ప్రధానకార్యదర్శిగా ఎరవెల్లి ముత్యంరావు ఎన్నికయ్యారు. సిరిసిల్లలో గత రెండు రోజులుగా జరిగిన సీఐటీయూ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్.సాయిబాబు, కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.జయలక్ష్మి సమక్షంలో ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, జ్యోతి, ముకుందరెడ్డి, తిరుపతి, వనజారాణి, కార్యదర్శులుగా జేవీ.రమణారెడ్డి, మూషం రమేశ్, రామాచారి, ఎడ్ల రమేశ్, కె.శంకర్, రామగిరి తులసి, ఎగమంటి ఎల్లారెడ్డి, కోశాధికారిగా రాజేశంలను ఎన్నుకున్నారు. 32 మందితో వర్కింగ్ కమిటీని, అన్ని మండలాల, రంగాల ప్రతినిధులతో కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. -
ఆకలి తీర్చండి..
చీపురుపల్లి/గరివిడి: నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఫేకర్, ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు తెరిపించి వేలాది మంది కార్మికుల ఆకలి మంటలు తీర్చాలని సీఐటీయూ ప్రతినిధులు అంబల్ల గౌరునాయుడు, జంపన విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. ఆకలియూత్ర పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు, మహిళలు గరివిడి నుంచి చీపురుపల్లి వరకు పాదయూత్ర చేపట్టారు. అనంతరం పట్టణంలోని కొత్త గవిడివీధిలో గల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే సీఐ ఎస్.రాఘవులు, ఎస్సై టి.కాంతికుమార్ నేతృత్వంలో పోలీసులు కార్మికులు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి పరిశ్రమలు తెరిపించాలి.. కార్మికుల జీవితాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజిన్ కార్యదర్శి అంబల్ల గౌరునాయుడు మాట్లాడుతూ, రెండేళ్లుగా గరివిడిలో ఫేకర్ పరిశ్రమ మూతపడిందన్నారు. దీంతో వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని మెరకముడిదాం, గుర్ల మండలాల్లో ఉన్న ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయని, ఈ విషయూన్ని మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం మంత్రి మృణాళిని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, నానిబాబులకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. -
ఎమ్మెల్యే విష్ణు క్షమాపణ చెప్పాలి
రణస్థలం : ఉపాధి హామీ చట్టం, కిలో రూపాయి బియ్యం పథకాల వల్ల వ్యవసాయ కూలీలు, పేదలు సోమరిపోతులౌతున్నారని, వాటిని సత్వరం ఎత్తివేయాలని అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నాయుకుడు విష్ణుకుమార్‌రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్. అమ్మన్నాయుడు శుక్రవారం డిమాండ్ చేశారు. పేదలు, వ్యవసాయ కూలీలు ఓట్లతో గెలిచి న ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. దేశానికి తిండిని అందిస్తున్న వ్యవసాయ కూలీలు, పేదల పట్ల ఇలా అహంకార పూరితంగా మాట్లాడడం తగదని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 46.43 హెక్టార్ల భూమి సాగులోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇటువంటి పథకాన్ని ఎత్తివేయాలని బీజేపీ నాయుకులు చెప్పడం సమంజసం కాదని విమర్శించారు. -
కార్మికుల శ్రమను సర్కారు దోచుకుంటోంది
కనీస వేతనాన్ని రూ.18వేలు చేస్తూ చట్టాన్ని తేవాలి: సీఐటీయూ సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లు, యాజమాన్యాలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటోందని సీఐటీయూ విమర్శించింది. కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.18వేలు ఇచ్చేలా తక్షణమే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. విజయవాడలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే కార్మికుల సమస్యలపై ప్రవేశపెట్టిన 28 తీర్మానాలకు మహాసభ ఆమోదం తెలిపింది. అనంతరం సీఐటీయూ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మీడియాతో మాట్లాడుతూ.. కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడంతో కార్మికులు ప్రతి నెలా రూ.వేల కోట్లు నష్టపోతున్నారని మండిపడ్డారు. కనీస వేతన అమలుపై జూలై నెలాఖరున కలెక్టరేట్లను దిగ్భంధించనున్నట్లు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సి.హెచ్ నర్సింగరావు మాట్లాడుతూ..కనీస వేతన సలహా సంఘాన్ని ఏర్పాటుకు డిమాండ్ చేశారు. -
వాగ్దానాల మాఫీ బాబు
- తొలి సంతకాలతో ప్రజలను ఏమార్చారు - హామీలు అమలుకాక రైతు, మహిళ, యువతకు కష్టాలు - రాష్ట్ర విభజన హామీల అమలు కోసం కార్మిక పోరాటాలు - సీఐటీయూ రాష్ట్ర మహాసభ తీర్మానాలు వెల్లడించిన నేతలు ఉమామహేశ్వరరావు, ధనలక్ష్మి విజయవాడ : ఎన్నికల్లో అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు చేసిన వాగ్దానాలనే మాఫీ చేసే దుస్థితికి దిగజారిపోయారని సీఐటీయూ రాష్ట్ర నేతలు ధ్వజమెత్తారు. విజయవాడ వేదిక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 14వ మహాసభల్లో చేసిన తీర్మానాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, తీర్మానాల కమిటీ కన్వీనర్ కె.ధనలక్ష్మి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, మద్యం బెల్ట్‌షాపుల రద్దు వంటి హామీలపై చంద్రబాబు తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. అధికారం కోసం హామీలిచ్చి.. సంతకాలు చేసి ప్రజలను ఏమార్చారే తప్ప వాటిని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. వాస్తవానికి రూ.87 వేల కోట్లు ఉన్న పంట రుణాలను రూ.25 వేల కోట్లుగా చూపించి చివరకు రూ.7 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని గుర్తుచేశారు. డ్వాక్రా రుణాలు రద్దుచేయకపోగా మూలధనంలో పెట్టుబడిలో కొంత ఇచ్చినట్టు మభ్యపెట్టారని తెలిపారు. రూ.365 కోట్ల చేనేత రుణాల్లో రూ.110 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం సొంతంగా నిర్వహించాల్సిన ఎన్టీఆర్ సుజలస్రవంతి మంచినీటి పథకాలను దాతలున్న చోట పెట్టి మిగిలినచోట్ల చేతులెత్తేసిందన్నారు. మహిళలకు ఇచ్చిన మద్యనిషేధ హామీని అమలుచేయకుండా బెల్ట్‌షాపులను రెగ్యులరైజ్ చేసుకుని మద్యం ఆదాయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.16 వేల కోట్లకు పెంచుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే పనిలో పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అది కాదు 9 వేల మంది ఉన్నారని మాట మార్చి ఇప్పుడు కేవలం వెయ్యి మందిని రెగ్యులర్ చేయడం ప్రభుత్వం అవకాశ విధానానికి అద్దం పడుతోందని అన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు పెంచిన జీతాలు, ఆశావర్కర్లు, కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్న చంద్రబాబు విదేశీ యానాలకు, రాజధాని ఆర్భాటపు ఖర్చులకు సొమ్ము ఎక్కడిదని వారు ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. విభజన హామీలను సాధించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా కార్మికులు కూడా పోరాడాలని మహాసభ తీర్మానించినట్టు చెప్పారు. కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు ఉండేలా చట్టం తేవాలని, కోటి మందికిపైగా ఉన్న అసంఘటిత కార్మికులకు లెసైన్సులు ఇవ్వాలని, మూసివేసిన పరిశ్రమలను తెరిపించి వేలాది కార్మికులను ఆదుకోవాలని మహాసభ తీర్మానించినట్టు చెప్పారు. మున్సిపల్ కార్మికుల ఉపాధికి చేటు తెచ్చే జీవో నంబర్ 279 రద్దుచేయాలని, కార్మిక చట్టాల్లో సంస్కరణలు విరమించుకోవాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వాన్ని కోరుతూ పలు తీర్మానాలు చేసినట్టు ఉమామహేశ్వరరావు, ధనలక్ష్మి చెప్పారు. -
'ఏటా కోటిమంది నిరుద్యోగులు'
విజయవాడ: దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ అన్నారు. అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవడంలో మోదీ వైఫల్యం చెందారని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఏడాది కోటి మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారని ఆయన హెచ్చరించారు. విజయవాడలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభకు హాజరైన సందర్భంగా మాణిక్ ఈ విధంగా కేంద్రంపై విమర్శలు ఎక్కు పెట్టారు. -
సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
విజయవాడ నగరంలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్ వద్ద జరిగే బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కారు పాల్గొని ప్రసంగిస్తారు. -
'సొంత నిర్ణయాల వల్లే డిప్యూటీ సీఎంను తొలగించారు'
సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ హన్మకొండ : సీఎం కేసీఆర్ మంత్రులను రిమోట్ ద్వారా నడిపిస్తున్నారని, మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ విమర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునెటైడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయూస్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో రెండో ఏఎన్ఎంలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీక్ష చేస్తున్న వారిని ఆయన శనివారం కలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అయిన లక్ష్మారెడ్డి వైద్య, ఆరోగ్యశాఖమంత్రిగా, విద్యావేత్త కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా, పంచె కట్టిన వ్యవసాయదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నా, వీరు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ఎక్కడ తమను తొలగిస్తారనే భయం మంత్రులలో నెలకొందన్నారు. అందుకే ఎలాంటి నిర్ణయాల జోలికి వెళ్లకపోవడమే మంచి అనే ఆలోచనతో పాటు సీఎం కేసీఆర్‌కు భజన చేస్తే చాలు అన్నట్లుగా రాష్ట్ర మంత్రులున్నారని విమర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా డాక్టర్ ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో ఆందోళనలు, ధర్నాలు నిత్యకృత్యమయ్యాయని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. గుడ్డి ప్రభుత్వం మేల్గొనేలా పోరాటాలు చేస్తామని సాయిబాబ పేర్కొన్నారు. -
సీఐటీయూ బైక్ ర్యాలీలు
కానూరు(పెనమలూరు)ః కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, దీనికి అందరి మద్దతు కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని కాంక్షిస్తూ కానూరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ కాశీం, యు.త్రిమూర్తి, వై.శ్రీనివాసరావు, పి.రామకోటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, జి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఉయ్యూరు : సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం పెనమలూరు డివిజన్ అధ్యక్షుడు కోసూరి శివనాగేంద్రం కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సభల విజయవంతం కోరుతూ ఉయ్యూరులో గురువారం కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు రత్నం భాస్కరరావు, రాజేష్, కొండలు తదితరులు పాల్గొన్నారు. కంకిపాడు : ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి నర్సింహారావు కోరారు. మైక్ ప్రచార జాతాను సంఘం కంకిపాడు డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సీఐటీయూ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పీ.రంగారావు, నరేష్, బీ.శివశంకర్, నార్ని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించాలి
నల్లగొండ టౌన్ : దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్ కోరారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో జజరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా దారాదత్తం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు, పౌర విమానయానం, రక్ష ణ, ఔషధ రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను తీసుకురావ డం దారుణమన్నారు. ప్రధాని మోదీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధంకావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అంసఘటితరంగ కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక, ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరందాసు గోపి, మందడి సులోచన, చిన్నపాక ల క్ష్మీనారాయణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కీసరి నర్సింహ్మ,రోషపతి, డబ్బికార్ మల్లేష్, రాధాక్రిష్ణ, పాండు, నారబోయిన శ్రీను, దోనూరి నర్సిరెడ్డి, వెం కటయ్య, యాదగిరిరావు, సత్తయ్య వరలక్ష్మి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాలను అణచివేస్తున్న బాబు సర్కారు: సీఐటీయూ
రాష్ట్రంలో కార్మిక చట్టాలను అణగదొక్కేందుకు చంద్రబాబు సర్కార్ పూనుకొందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ఆరోపించారు. నెల్లూరు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చేందుకు రెండు ప్రభుత్వాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చే విధంగా ఉందన్నారు. నెల 26న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి విజయవాడలో పెద్ద ఎత్తున భహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
30న ఢిల్లీలో సీఐటీయూ అఖిలభారత సదస్సు: దేవరాయ్
ఈ నెల 30న ఢిల్లీలో అఖిలభారత స్థాయి సీఐటీయూ వర్కర్స్ యూనియన్ సదస్సు నిర్వహించనున్నట్టు సీఐటీయూ సెక్రటరీ స్వదేశీ దేవరాయ్ తెలిపారు. ఆదివారం విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపైనే సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుందని చెప్పారు. సెప్టెంబర్ 2 నుంచి 20కోట్ల మంది కార్మికులతో సమ్మె నిర్వహించనున్నామని తెలిపారు. -
పీఎఫ్ సొమ్ముపై పన్నుకు 10న నిరసన
హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమయిన నగదును వెనక్కు తీసుకునే సమయంలో 60 శాతం మొత్తంపై పన్ను వేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రతిపాదించడాన్ని సీఐటీయూ, ఏఐటీయూసీ తీవ్రంగా ఖండించాయి. ఈ ప్రతిపాదనపై ఈనెల పదిన ఫ్యాక్టరీలు, పని ప్రదేశాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సీఐటీయూ పిలుపివ్వగా పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించేంత వరకూ ఆందోళన చేయాలని కార్మికలోకానికి విజ్ఞప్తి చేసింది. కార్మిక సంఘాల వత్తిడితో కేంద్రప్రభుత్వం పన్ను ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కార్మికులు ఆరుగాలం కష్టపడి దాచుకున్న సొమ్మును పన్ను రూపంలో కాజేసేందుకు జరిగే కుయుక్తులను ప్రతిఘటింటేందుకు 10న ధర్నా చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రప్రభుత్వం గత రెండేళ్లలో బడా పారిశ్రామిక వేత్తలకు వేలాది కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిందని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు ధ్వజమెత్తారు. పేదల కడుపు కొట్టి బ్యాంకుల్ని ముంచేసే పెద్దలకు రాయితీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. పీఎఫ్ సొమ్ముపై అరుణ్‌జెట్లీ చేసిన ప్రతిపాదనను విరమించేంత వరకూ పోరాడాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
ఒకటో కేటగిరికి రూ.40వేల కనీస వేతనం ఇవ్వాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు పరిశ్రమ ల్లో సర్ఫేస్‌లో పనిచేస్తున్న 1వ కేటగిరి కార్మికుడికి రూ.40వేల కనీస వేతనం నిర్ణయిచాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాల రీస్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీతో 9వ వేతన ఒప్పందం పూర్తవుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. అయితే ఒప్పందంలో సీఐటీయూ పొందుపర్చుతున్న అంశాలతో కూడిన పత్రాన్ని శుక్రవారం స్థానిక కార్యాలయంలో విడుదల చేశారు. ఆయూ అంశాలను గనుల వద్ద కార్మికులకు అందుబాటులో ఉంచుతున్నామని వారి అభిప్రాయాలను ఈనెల 20వ తేదీ వరకు తెలిపితే క్రోడీకరించి ఈనెల 28, 29 తేదీలలో గోదావరిఖనిలో జరిగే ఆలిండియా కోల్వర్కర్స్ ఫెడరేషన్ 9వ మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీని వాస్, అధ్యక్షుడు తోట నరహరిరావు, ఉద్దెమారి కనకయ్య, కె.రంగారావు, ఎం.రామ న్న, కె.వెంకటేశ్‌బాబు, సానం రవి, కుంబాల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఇవీ అంశాలు.. ►గని కార్మికులకు వార్షిక ఇంక్రిమెంట్ రేటు 6 శాతంగా ఉండాలి. ►స్పా, ఫ్రాల్ బ్యాక్ వేజెస్పై 6 శాతం లెక్కించాలి. ►ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ, డ్రిల్ ఆపరేటర్ల కు హార్స్పవర్ కొలతలను బట్టి వేత నం నిర్ణయించాలి. ►కార్మికులు, ఉద్యోగులందరికీ బేసిక్‌పై 50శాతం పెరుగుదలతో అలవెన్సులు, సదుపాయాలు కల్పించాలి. ►బేసిక్‌పై 20శాతం రేట్ చొప్పున ఏ విధమైన సీలింగ్ లేకుండా అండర్‌గ్రౌండ్ అలవెన్స్ చెల్లించాలి. ►నర్సింగ్ స్టాఫ్‌కు రూ.800, ఇతర స్టాఫ్ కు రూ.600 వాషింగ్ అలవెన్స్ చెల్లించి వారి బేసిక్‌పై 20శాతం రేట్‌తో అలవెన్స్ ఇవ్వాలి. ►నాలుగేళ్ల కాలంలో రెండు సార్లు ఎల్‌టీసీగా రూ.50 వేలు, ఎల్ఎల్టీసీగా రెండు సార్లు రూ.లక్ష చెల్లించాలి. ►పెన్షన్ ఫండ్ పెంచేందుకు టన్నుకు రూ.20 చొప్పున సంక్షేమ నిధి ఏర్పా టు చేసి పెన్షన్ 40శాతం చెల్లించాలి. ►వార్షిక సెలవులు 11 రోజులకు ఒకటి చొప్పున 240 రోజులకు లెక్కింపుతో అమలు చేయూలి. ►సర్ఫేస్ కార్మికులకు ఏడాదిలో 25 రోజులు, అండర్‌గ్రౌండ్ కార్మికులకు 30రోజులు వేతనంతో కూడిన సిక్ లీవులు ఉండాలి. ►జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలులోకి వచ్చేందుకు వీలుగా సం బంధించిన డిమాండ్లను పరిష్కరించాలి -
రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలి
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు డిచ్పల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒక రోజు రిలే నిరాహార దీక్షకు దిగారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. -
అంగన్వాడీల పోరాటానికి అండగా నిలబడదాం
* అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఫెడరేషన్ సమావేశాల్లో ఎంపీ తపన్‌సేన్ * హాజరైన పలు రాష్ట్రాలకు చెందిన 700 మంది అంగన్వాడీ వర్కర్లు సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలు, శిశువుల ఆరోగ్యంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది అంగన్వాడీ కార్యకర్తల చేతుల్లోనే ఉంది. అంతటి మహత్తరమైన పాత్ర పోషిస్తున్న మీకు ప్రతి వర్గమూ అండగా నిలబడి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీఐటీయూ నేత, రాజ్యసభ సభ్యుడు తపన్‌సేన్ అన్నారు. గురువారం ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 8వ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరుగుతున్న తొలి జాతీయ సమావేశంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని తపన్‌సేన్ చెప్పారు. స్త్రీ, శిశు ఆరోగ్యం గురించి కృషి చేసే అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వని ప్రభుత్వాలున్నాయని, వీరికి కనీస సౌకర్యాలు కల్పించని పరిస్థితులున్నాయని, ఇలాంటి సమస్యల నుంచి బయటపడి వారు సక్రమంగా విధులను నిర్వహించేలా మిగతా వర్గాల ప్రజలు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాలపై పల్లె ప్రజలకు అవగాహన కల్పించి.. వారి మద్దతుని కూడగట్టుకోవడానికి ప్రయత్నించాలని అంగన్వాడీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంగన్వాడీలు తమ హక్కులను కాపాడుకుంటూనే బాధ్యతలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. దేశ భవిష్యత్తుని మార్చే శక్తి, సామర్థ్యాలు అంగన్వాడీల చేతుల్లోనే ఉన్నాయని, గ్రామాల్లో స్త్రీలు, శిశువులు ఆరోగ్యంగా ఉంటే ప్రగతి తనంతట అదే వస్తుందని అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు రాష్ట్రాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తల పనితీరు, వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలకు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి చర్చించనున్నారు. దేశ భవిష్యత్తుకి పునాదిగా చెప్పుకునే ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రభావం చూపే అంగన్వాడీ కార్యకర్తల సేవలకు తగిన గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమని ఇతర నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అధ్యక్షురాలు నీలమ మైత్రి, కో ఆర్డినేటర్ హేమలత, మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్, తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్షురాలు లక్షీ, జాయింట్ సెక్రటరీ భారతి, సాయిబాబు, కోఆర్డినేటర్ ఏఆర్ సింధు తదితరులు పాల్గొన్నారు. ఒడిశా, తమిళనాడు, త్రిపుర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేకిన్ ఇండియా కాదు.. ఇది క్లోజింగ్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం మేకిన్ ఇండియాకు బదులు క్లోజింగ్ ఇండియాగా మారుతోందని తపన్‌సేన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రచారహోరు, ఆకర్షణీయమైన నినాదాలు తప్ప పారిశ్రామిక, ఉత్పత్తిరంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడంలేదన్నారు. ఆయన సీఐటీయూ జాతీయ కార్యదర్శి వరలక్ష్మి, రాష్ట్ర నాయకులు రమ, సాయిబాబాలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏడాదిన్నర పాలనలో మోదీ ఉద్యోగ, ఉపాధి కల్పనకు, కొత్త పరిశ్రమలను తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 19న దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు నిరసన దినాన్ని పాటిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 10న పార్లమెంటు ఎదుట నిరసన ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. -
‘ఆశా’లకు ఆత్మగౌరవం ఉండదా?
సందర్భం అనేక పర్యాయాలు తెలంగాణ ప్రభుత్వానికి వినతులు అందించిన అనంతరం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశాలు పోరుబాట పట్టారు. వారు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. అయ్యా! సేవ చేస్తున్నాం. పనికి తగ్గ కనీస వేతనం నిర్ణయించండి. మా బతుకులు బాగు పడాలంటే మీరిచ్చే రెండు వందలో, పది హేను వందలో సరిపోవు. సమాజానికి సేవ చేస్తున్న మమ్మల్ని కార్మికులుగా గుర్తించండంటూ వేడుకుంటున్నారు. ఇవేవీ ప్రభుత్వానికి వినబడటం లేదు. పైగా సమ్మెలేంటని ప్రశ్నిస్తు న్నారు. పోరాటాలంటేనే ఏవగింపుగా మాట్లాడుతున్నారు. సమ్మెలపై ఉక్కుపాదం, ఆశాలపై లాఠీచార్జీలు, సీఐటీయూతోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయా? అని హేళన చేయడం దేనికి సంకే తం? ప్రజలకు సేవ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్ ఎం) ఒకటి. దీని కిందనే ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. తెలంగాణలో 25 వేల మంది ఆశావర్కర్లున్నారు. ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి పేద లకు మందులివ్వడం, ఆస్పత్రిలో చేర్పించడం, గర్భిణీ స్త్రీలను గుర్తించి అన్ని పరీక్షలూ చేయించి సుఖప్రసవం జరిగేట్టు చూడటం, బాలిం తలకు, పసిపిల్లలకు ఆరోగ్య సేవలందించడం వంటి ఎన్ఆర్ హెచ్ఎం నిర్ణయించిన 36 పనులను వీరు చేయాలి. పనిని బట్టి పారితోషికం చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వం చెల్లింపులు లేని పనులెన్నో ఆశాల చేత చేయిస్తోంది. కానీ నెలంతా పనిచేస్తే రూ. 400 నుంచి రూ.1,500లకు మించి రావటంలేదు. ఈ కాస్త పారితోషికాన్ని కూడా 39 నెలలుగా బకాయి పెట్టారు. జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 1,050 కోట్ల నిధులు కేటాయిస్తోంది. వాటిలో పది శాతం ఆశాలకు కేటాయించాలని నిబంధన ఉన్నా ఖర్చు చేసేందుకు పాలకులకు చేతులు రావటం లేదు. ఆ పది శాతం నిధులతో ఒక్కో ఆశాకు కనీసం రూ.3,500లు చొప్పున చెల్లించవచ్చు. కేంద్ర నిధులను తన ఖజానా నుంచే ఇస్తున్నట్లుగా ఫోజు కొడుతున్న ప్రభుత్వం వేతనమే లేకుండా బతకమని చెబుతోంది. యాదగిరిగుట్ట, వేములవాడ, గోదావరి పుష్కరాలు, బోనాలు, బతుకమ్మ పండగలకు వందలకోట్లు ఇస్తారు. గిరిజన తండాలు, గూడేలు, దళిత కాలనీలు, అట్టడుగు వర్గాలుండే చోట గొడ్డుచాకిరీ చేస్తున్నా, ప్రభుత్వాలకు ఆశాలపై కనీస జాలిలేదు. తెలంగాణ రాష్ట్ర మొస్తే వెట్టిచాకిరుండదని కేసీఆర్ చెప్పారు. గద్దెనెక్కాక నిజాంను తలపించేలా వెట్టి చేయిస్తున్నారు. తమను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.15,000లు ఇవ్వాలని, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు కల్పించి పెండింగ్ బకాయిలను ఇవ్వాలని అనేక దఫాలుగా ఆశాలు ప్రభుత్వానికి చెప్పుకున్నారు. ఏలికలు పెడచెవిన పెట్టడం వల్లే 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చారు. పరిష్కరించకపోవడంతో సమ్మెలోకి దిగారు. ఆశావర్కర్ల వెనుక ఏపీ సీఎం హస్తం ఉందని, ఆంధ్ర తొత్తులు, ఆంధ్ర కుక్కలు సమ్మె చేయిస్తున్నాయి అంటున్నారు. మరి ఆశాలు ఎవరికి సేవలందిస్తున్నారు? ఆంధ్రా ప్రజలకా లేక తెలంగాణ ప్రజలకా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆశాలకు జీతం పెంచుతానని టీఆర్ఎస్ నేతలు అనలేదా? కడుపుమండి సమ్మె చేస్తుంటే ఆశాలతో మాకు సంబంధం ఏమిటని ఒక మంత్రి, సమ్మె చేస్తే వేతనాలు పెం చాలా అని ఒక మంత్రి, ఆంధ్రా కుక్కలు సమ్మె చేయిస్తున్నాయని మరో మంత్రి నోరుపారేసుకోవడం ఏం సంస్కారం? తెలంగాణ ఆత్మగౌరవం గురించి కోడై కూసిన నేతల నుంచేనా ఇలాంటి మాటలంటున్నది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తమ గోడు వినండని వినతి పత్రాలివ్వడానికి వెళితే భౌతిక దాడులు జరిగిన ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఇదేనా కొత్త తెలంగాణలో మహిళలకిచ్చే గౌరవం? స్వరాష్ట్రం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఇంకా ఎన్నిరోజులు ఆంధ్ర పాట పాడతారో? బాంచెన్ దొరా నీ కాల్మొక్తనే రోజులు పోయాయని కేసీఆర్ దొర తెలుసుకోవాలి. పిట్టలదొర మాటలు మాని బాధ్యతను గుర్తెరిగి ఆశాల సమస్యలు ఇకనైనా పరిష్కరించాలి యాటల సోమన్న వ్యాసకర్త సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యులు. 9490098486 -
ఎంపీ కవిత ఇంటి ముందు ధర్నా
నిజామాబాద్ ఎంపీ కవిత ఇంటి ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న ఎంపీ అత్తగారింటికి కవిత రానున్నారని తెలిసి ఆశావర్కర్లు శనివారం ఉదయమే చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి ఇంటి ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత సాయంత్రం వస్తారని తెలిసి వెనుదిరిగారు. -
మున్సిపల్ సమ్మెను పరిష్కరించాలి
కాకినాడ సిటీ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు వారాలుగా సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్మికులు.. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. వారి ఆందోళనకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. మూడు గంటలపాటు జరిగిన ఆందోళన అనంతరం కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకూ ప్రదర్శన చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, 15 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో కేవలం రూ.1600 నుంచి రూ.8000 వరకూ జీతాలు తీసుకుంటూ సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులు అప్పుల పాలవుతున్నారన్నారు. స్మార్ట్ సిటీలు నిర్మిస్తామంటున్న పాలకులు.. పారిశుధ్యం లేకుండా నగరాలు ఎలా స్మార్ట్‌గా ఉంటాయో చెప్పలగలరా అని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు.. కార్మికులను బెదిరిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పుష్కరాలు అయిన వెంటనే సమ్మె పరిష్కారానికి పూనుకోకపోతే అన్ని సంఘాలూ, పార్టీలూ ఏకమై రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.బేబీరాణి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ నాయకులు కె.సత్తిబాబు, సీఐటీయూ నాయకులు ఎం.వేణుగోపాల్, మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు మీసాల అనంతరావు, బొబ్బిలి సత్యనారాయణ, తుపాకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
కుక్కకు మెమోరాండం
వికారాబాద్ రూరల్ : మున్సిపల్ కార్మికులు ఆందోళనలో భాగంగా వికారాబాద్‌లో కుక్కకు మెమోరాండం ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మె ఆదివారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు పి. మల్లేశం మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం రూ. 14,170, సూపర్వైజర్లకు రూ. 17,380 ఇవ్వాలన్నారు. కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతుగా ఈ నెల 20 నుంచి 24 వరకు వామపక్ష పార్టీలు బస్సుయాత్ర నిర్వహిస్తున్నాయని, వికారాబాద్‌లో ఈ నెల 20న ప్రారంభిస్తారన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జవాన్ చిన్నయ్య, కార్మికులు జంగయ్య, భాస్కర్, జి. రాములు , దేవ్యనాయక్, రాములు, బుచ్చయ్య, రవి, దశరాత్, జంగమ్మ, బాల్‌రాజ్, జంగమ్మ, నీలమ్మ, అండాలు, గంగమ్మ, నర్సమ్మ, లక్ష్మి, అనుసూజ, సత్యమ్మ, శంకర్, వెంకట్, ఆశ, ఎల్.లక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
'చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలి'
ప్రకాశం(ఒంగోలు): కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్ధార్ వనజాక్షిపై భౌతికంగా దాడిచేసి అసభ్య పదజాలంతో దూషించిన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకరరావును వెంటనే అరెస్టు చేసి పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం ఒంగోలు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అధికారపార్టీ సంపూర్ణ సహకారంతో నడుస్తోందని ధ్వజమెత్తారు. అక్రమాలను గుర్తించిన వారిపై దాడులకు దిగుతున్నారంటూ ముసునూరు తహసీల్ధార్ ఉదంతాన్ని ప్రస్తావించారు. చట్టాన్ని కాపాడాల్సిన శాసనసభ్యుడే భౌతికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.