'హరీశ్ ఎవరి పక్షమో చెప్పాలి' | harish rao should say which side he was: citu | Sakshi
Sakshi News home page

'హరీశ్ ఎవరి పక్షమో చెప్పాలి'

Published Sun, May 10 2015 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM

'హరీశ్ ఎవరి పక్షమో చెప్పాలి'

'హరీశ్ ఎవరి పక్షమో చెప్పాలి'

తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు కార్మికుల పక్షమా? లేదా ప్రభుత్వ పక్షమా స్పష్టం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా ప్రశ్నించారు.

సంగారెడ్డి(మెదక్): తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు కార్మికుల పక్షమా? లేదా ప్రభుత్వ పక్షమా? అనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా ప్రశ్నించారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

అయిదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే కార్మిక సంఘానికి అధ్యక్షునిగా ఉన్న మంత్రి హరీశ్ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. కార్మిక నాయకుని హయాంలో కార్మికులపై నిర్బంధం విధించడం ఎంతవరకు సమంజసమన్నారు.సమ్మె జరుగుతున్న వారితో చర్చలు జరుగకుండా ప్రభుత్వం మొండిగా, బాధ్యతారహితంగా వ్యవహరించడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement