సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు పరిశ్రమ ల్లో సర్ఫేస్‌లో పనిచేస్తున్న 1వ కేటగిరి కార్మికుడికి రూ.40వేల కనీస వేతనం నిర్ణయిచాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాల రీస్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీతో 9వ వేతన ఒప్పందం పూర్తవుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. అయితే ఒప్పందంలో సీఐటీయూ పొందుపర్చుతున్న అంశాలతో కూడిన పత్రాన్ని శుక్రవారం స్థానిక కార్యాలయంలో విడుదల చేశారు. ఆయూ అంశాలను గనుల వద్ద కార్మికులకు అందుబాటులో ఉంచుతున్నామని వారి అభిప్రాయాలను ఈనెల 20వ తేదీ వరకు తెలిపితే క్రోడీకరించి ఈనెల 28, 29 తేదీలలో గోదావరిఖనిలో జరిగే ఆలిండియా కోల్‌వర్కర్స్ ఫెడరేషన్ 9వ మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీని వాస్, అధ్యక్షుడు తోట నరహరిరావు, ఉద్దెమారి కనకయ్య, కె.రంగారావు, ఎం.రామ న్న, కె.వెంకటేశ్‌బాబు, సానం రవి, కుంబాల లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఇవీ అంశాలు..
►గని కార్మికులకు వార్షిక ఇంక్రిమెంట్ రేటు 6 శాతంగా ఉండాలి.
►స్పా, ఫ్రాల్ బ్యాక్ వేజెస్‌పై 6 శాతం లెక్కించాలి.
►ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ, డ్రిల్ ఆపరేటర్ల కు హార్స్‌పవర్ కొలతలను బట్టి వేత నం నిర్ణయించాలి.
►కార్మికులు, ఉద్యోగులందరికీ బేసిక్‌పై 50శాతం పెరుగుదలతో అలవెన్సులు, సదుపాయాలు కల్పించాలి.
►బేసిక్‌పై 20శాతం రేట్ చొప్పున ఏ విధమైన సీలింగ్ లేకుండా అండర్‌గ్రౌండ్ అలవెన్స్ చెల్లించాలి.
►నర్సింగ్ స్టాఫ్‌కు రూ.800, ఇతర స్టాఫ్ కు రూ.600 వాషింగ్ అలవెన్స్ చెల్లించి వారి బేసిక్‌పై 20శాతం రేట్‌తో అలవెన్స్ ఇవ్వాలి.
►నాలుగేళ్ల కాలంలో రెండు సార్లు ఎల్‌టీసీగా రూ.50 వేలు, ఎల్‌ఎల్‌టీసీగా రెండు సార్లు రూ.లక్ష చెల్లించాలి.
►పెన్షన్ ఫండ్ పెంచేందుకు టన్నుకు రూ.20 చొప్పున సంక్షేమ నిధి ఏర్పా టు చేసి పెన్షన్ 40శాతం చెల్లించాలి.
►వార్షిక సెలవులు 11 రోజులకు ఒకటి చొప్పున 240 రోజులకు లెక్కింపుతో అమలు చేయూలి.
►సర్ఫేస్ కార్మికులకు ఏడాదిలో 25 రోజులు, అండర్‌గ్రౌండ్ కార్మికులకు 30రోజులు వేతనంతో కూడిన సిక్ లీవులు ఉండాలి.
►జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలులోకి వచ్చేందుకు వీలుగా సం బంధించిన డిమాండ్లను పరిష్కరించాలి
ఒకటో కేటగిరికి రూ.40వేల కనీస వేతనం ఇవ్వాలి
Published Sat, Feb 13 2016 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement