Nursing staff
-
కోటి టీకాలు ‘నర్సింగ్’ అంకితభావం ఫలితమే
సాక్షి, న్యూఢిల్లీ: నర్సింగ్ సిబ్బంది అంకితభావం వల్లే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కోటి టీకాలు అందించడం సాధ్యమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం నర్సింగ్ సిబ్బందికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది అవిశ్రాంత మద్దతు వల్లే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామని కొనియాడారు. కరోనా సమయంలో సేవలందిస్తూ చాలామంది నర్సింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నైటింగేల్ అవార్డు గ్రహీతల్లో ఒకరు కూడా ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ‘నర్సెస్: ఎ వాయిస్ టు లీడ్.. ఎ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్‌కేర్’థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ని ర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైన వారికి వర్చువల్ ద్వారా రాష్ట్రపతి అవార్డు అందజేశారు. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిం చారు. అవార్డు, ధ్రువపత్రం, రూ.25 వేల నగదును అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురుకి ఈ అవార్డు దక్కింది. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురికి అవార్డులు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 12 ఏళ్లుగా సేవలందిస్తున్న డి.రూపకళ, తిరుపతి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అములూరు పద్మజ, హైదరాబాద్‌లోని అఫ్జల్ సాగర్‌కు చెందిన అనపర్తి అరుణకుమారి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపురం సబ్సెంటర్కు చెందిన ఎన్వీ షుకురా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. -
నర్సులు కావలెను..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులను సైతం నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కోవిడ్ కేసుల భయంతో ఇప్పటికే ఉన్నవారు చెప్పపెట్టకుండా విధులకు గైర్హాజరవుతుంటే.. విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి.. ఇక్కడి ఆస్పత్రుల్లో చేరిన నర్సులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవైపు వెంటాడుతున్న వైరస్ భయం.. మరోవైపు విరామం లేని విధులు.. వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు వీరిలో చాలా మందికి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వీరి నుంచి పిల్లకు వైరస్ సోకుతుందనే భయం కూడా వారిని వెంటాడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము విధులకు హాజరు కాలేమని, తమ సర్టిఫికెట్లు తమకు ఇచ్చేస్తే.. సొంతూరికి వెళ్లిపోతామని చెబుతున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. అంతేకాదు ఇష్టం లేకపోయినా వారితో బలవంతంగా కోవిడ్ వార్డుల్లో విధులు కేటాయిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మెహిదీపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఇదే అంశంపై నర్సులు ఆందోళనకు దిగడమే కాకుండా ఆస్పత్రి యాజమాన్యం తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని పేర్కొంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం. కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన ఒత్తిడి.. నగరంపై ప్రస్తుతం కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్పి పడకలు లేకపోవడం, ఉన్నవాటిలోనూ సరైన వైద్యసేవలు అందకపోవడంతో చాలామంది బాధితులు ఆర్థికంగా భారమే అయినప్పటికీ.. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులే కాదు...కార్పొరేట్ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలన్నీ కోవిడ్ కేసులు నిండిపోయాయి. స్పెషాలిటీ వెద్యులు రోగిని పరీక్షించి కేవలం మందులు మాత్రమే సూచిస్తారు. ఆ తర్వాత రోగి సంరక్షణ బాధ్యత అంతా ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులే చూసుకోవాలి. ఎక్కువ సమయం కోవిడ్ వార్డుల్లో గడపాల్సి వస్తుండటంతో వా రు త్వరగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆ విభాగాల్లో సేవలకు ఇతర వైద్య సిబ్బంది అంతా భయçప³డుతున్నారు. ఇదే సమయంలో ఆయా నర్సులపై వారి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వహించడంతో వారి నుంచి ఇంట్లో వారికి వైరస్ సోకుతుందో అనే భయంతో ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు పొంచి ఉన్న వైరస్ ముప్పు.. మరోవైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయినా నిరాకరణే.. లాక్డౌన్ సమయంలో రోగులు లేక ఆస్పత్రులు వెలవెలబోయాయి. రోగులు రాకపోవడంతో బిల్లులు లేక నెలవారి ఖర్చులు కూడా ఆయా ఆస్పత్రులకు భారంగా మారాయి. ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారడంతో చాలా ఆస్పత్రులు సిబ్బందిని తొలగించాయి. లాక్డౌన్ ప్రక్రియ ముగిసి.. అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కేసుల సంఖ్య పెరగడంతో ఆయా ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలామంది నర్సులు వైరస్ భయంతో ఉద్యోగాలు మానేసి వెళ్లిపోవడంతో ఆస్పత్రుల్లో నర్సింగ్ స్టాఫ్ కొరత ఏర్పడింది. కొత్త వాళ్లను ఆకర్షించేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో నెలకు రూ.17 వేల వరకు ఇవ్వగా.. ప్రస్తుతం సీనియర్ స్టాఫ్ నర్సులకు రూ.50 వేలకుపైగా వేతనం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉచిత వసతి, భోజనం, రవాణా వంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి. అయినా కోవిడ్ వార్డుల్లో పని చేసేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఇప్పటికే ఆస్పత్రి ఆవరణలోని హోటళ్లలో ఉంటున్న వారిని బయటికి వెళ్లనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. చెప్పాప్టెకుండా వెళ్లిపోతారేమో అనే భయంతో వారిపై నిరంతరం నిఘా ఉంచుతుండటం గమనార్హం. విదేశాల్లోనూ భారీ డిమాండ్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక వైద్యుడు సహా ఐదుగురు నర్సులు అవసరం. 600 మందికి ఒక నర్సు ఉండాల్సి ఉండగా.. మన దగ్గర 400 మందికి ఒక్కరే ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20 వేల మంది అసరం కాగా.. కేవలం ఏడు వేల మందే ఉన్నారు. ఇక కార్పొరేట్ ఆస్పత్రుల అవసరాలు తీర్చాలంటే సుమారు లక్ష మంది నర్సులు అవసరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న స్టాఫ్ నర్సుల్లో 70 శాతం కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఇక్కడి వేతనాలతో పోలిస్తే విదేశాల్లో వేతనాలు భారీగా ఉండటంతో చాలా మంది బ్రిటన్, కెనడా, ఐర్లాండ్ వంటి విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో నగరంలోని ఆస్పత్రుల్లో నర్సింగ్ కొరత ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లో రూ.2 లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చి మరీ వారిని తీసుకురావాల్సి వస్తోంది. -
స్త్రీలోక సంచారం
► ఆసుపత్రులలో పనిచేసే నర్సుల సమస్యలకు తొలిసారిగా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చోటు లభించబోతోంది! కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే.. అపరిష్కృతంగా ఉన్న నర్సుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చగా, ఎన్నికలకు వారం ముందు టి.ఆర్.ఎస్. పార్టీ కూడా నర్సింగ్ సిబ్బందికి వాగ్గానాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకించి ఒక నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని నర్సింగ్ ఉద్యోగులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సింగ్ ఖాళీల భర్తీ, నర్సుల కనీస స్థూల వేతనాన్ని 20 వేల రూపాయలకు పెంచడం, నర్సింగ్ డైరెక్టర్ నియామకం, ప్రతి నర్సింగ్ విద్యార్థికీ విధిగా కనీస స్టయిఫండ్ వంటి హామీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చిందని నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ రెడావత్ తెలిపారు. ► బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా బిహియా గ్రామంలో మూడు నెలల క్రితం ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ప్రత్యేక న్యాయస్థానం 20మందిని దోషులుగా నిర్థారించింది. ఇవాళ (నవంబర్30) వారికి శిక్షను విధించబోతోంది. ఇంటర్ చదువుతున్న బిమ్లేశ్ షా అనే విద్యార్థి మృతదేహం రైల్వే పట్టాలపై పడి ఉండడాన్ని గమనించిన బిహియా గ్రామస్థులు అందుకు కారకురాలిగా ఒక మహిళను అనుమానించి, ఆమె ఒంటిమీద బట్టలు తీయించి గ్రామమంతా ఊరేగించిన ఘటన గత ఆగస్టు 20న జరగ్గా.. ఇన్నాళ్లకు ఈ కేసు కొలిక్కి వచ్చింది. ► అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తన పర్సనల్ ఈ మెయిల్ ఐడీ నుంచి ప్రభుత్వ వ్యవహారాలను నడిపించారని ఆమె ప్రత్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవాంక తొలిసారిగా ఆ ఆరోపణలపై స్పందించారు. ‘‘నేను పంపే మెయిల్స్, నాకు వచ్చే మెయిల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి. ఏ ఒక్క మెయిల్‌నీ నేను డిలీట్ చెయ్యలేదు. కావాలంటే చూసుకోవచ్చు’’ అని ఎబిసి టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇవాంక సమాధానమిచ్చారు. వైట్ హౌస్ అడ్వైజర్‌గా ఉన్న ఇవాంక 2017లో అమెరికన్ పాలనా యంత్రాంగంలోని ముఖ్యమైన అధికారులతో కనీసం వందసార్లు తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారని గతవారం రోజుల నుంచీ వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఇవాంక.. తన ఈమెయిల్స్ హిల్లరీ నడిపించిన ఈమెయిల్స్ వంటివి కాదని కూడా అన్నారు. ట్రంప్‌కు ముందు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో విదేశాంగ కార్యదర్శిగా ఉన్న హిల్లరీ క్లింటన్ తన పర్సనల్ మెయిల్ నుంచి పాలనాపరమైన సంప్రదింపులనే వేలసార్లు జరిపినట్లు 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే ఆరోపించిన సంగతి తెలిసిందే. దోషులకు శిక్ష ఇవాంక ట్రంప్ -
ఒకటో కేటగిరికి రూ.40వేల కనీస వేతనం ఇవ్వాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని(కరీంనగర్) : బొగ్గు పరిశ్రమ ల్లో సర్ఫేస్‌లో పనిచేస్తున్న 1వ కేటగిరి కార్మికుడికి రూ.40వేల కనీస వేతనం నిర్ణయిచాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాల రీస్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీతో 9వ వేతన ఒప్పందం పూర్తవుతున్న నేపథ్యంలో జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. అయితే ఒప్పందంలో సీఐటీయూ పొందుపర్చుతున్న అంశాలతో కూడిన పత్రాన్ని శుక్రవారం స్థానిక కార్యాలయంలో విడుదల చేశారు. ఆయూ అంశాలను గనుల వద్ద కార్మికులకు అందుబాటులో ఉంచుతున్నామని వారి అభిప్రాయాలను ఈనెల 20వ తేదీ వరకు తెలిపితే క్రోడీకరించి ఈనెల 28, 29 తేదీలలో గోదావరిఖనిలో జరిగే ఆలిండియా కోల్వర్కర్స్ ఫెడరేషన్ 9వ మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీని వాస్, అధ్యక్షుడు తోట నరహరిరావు, ఉద్దెమారి కనకయ్య, కె.రంగారావు, ఎం.రామ న్న, కె.వెంకటేశ్‌బాబు, సానం రవి, కుంబాల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఇవీ అంశాలు.. ►గని కార్మికులకు వార్షిక ఇంక్రిమెంట్ రేటు 6 శాతంగా ఉండాలి. ►స్పా, ఫ్రాల్ బ్యాక్ వేజెస్పై 6 శాతం లెక్కించాలి. ►ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ, డ్రిల్ ఆపరేటర్ల కు హార్స్పవర్ కొలతలను బట్టి వేత నం నిర్ణయించాలి. ►కార్మికులు, ఉద్యోగులందరికీ బేసిక్‌పై 50శాతం పెరుగుదలతో అలవెన్సులు, సదుపాయాలు కల్పించాలి. ►బేసిక్‌పై 20శాతం రేట్ చొప్పున ఏ విధమైన సీలింగ్ లేకుండా అండర్‌గ్రౌండ్ అలవెన్స్ చెల్లించాలి. ►నర్సింగ్ స్టాఫ్‌కు రూ.800, ఇతర స్టాఫ్ కు రూ.600 వాషింగ్ అలవెన్స్ చెల్లించి వారి బేసిక్‌పై 20శాతం రేట్‌తో అలవెన్స్ ఇవ్వాలి. ►నాలుగేళ్ల కాలంలో రెండు సార్లు ఎల్‌టీసీగా రూ.50 వేలు, ఎల్ఎల్టీసీగా రెండు సార్లు రూ.లక్ష చెల్లించాలి. ►పెన్షన్ ఫండ్ పెంచేందుకు టన్నుకు రూ.20 చొప్పున సంక్షేమ నిధి ఏర్పా టు చేసి పెన్షన్ 40శాతం చెల్లించాలి. ►వార్షిక సెలవులు 11 రోజులకు ఒకటి చొప్పున 240 రోజులకు లెక్కింపుతో అమలు చేయూలి. ►సర్ఫేస్ కార్మికులకు ఏడాదిలో 25 రోజులు, అండర్‌గ్రౌండ్ కార్మికులకు 30రోజులు వేతనంతో కూడిన సిక్ లీవులు ఉండాలి. ►జూలై 1 నుంచి 10వ వేతన ఒప్పందం అమలులోకి వచ్చేందుకు వీలుగా సం బంధించిన డిమాండ్లను పరిష్కరించాలి -
మూడో రోజుకు చేరిన నర్సింగ్ సిబ్బంది సమ్మె
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గాంధీ నర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ... గాంధీ ఆస్పత్రి కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది చేపట్టిన సమ్మె మూడవ రోజైన బుధవారం కూడా కొనసాగింది. ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఫ్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామిమేరకే తెలంగాణలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులంతా ఓటేసి టీఆర్ఎస్ను గెలిపించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచి సుమారు పదినెలల గడుస్తున్నా పర్మినెంట్ విషయం మర్చిపోవడం దారుణమన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ హస్పిటల్ అవుట్సోర్సింగ్ నర్సింగ్‌స్టాఫ్ సమ్మె కమిటీ ప్రతినిధులు మేఘమాల, ఉపేంద్రగౌడ్, మధులత,ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది సమ్మెతో వైద్యసేవలకు విఘాతం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపారు. -
మృత్యువుతో పోరాటం
డాబాగార్డెన్స్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కేజీహెచ్ సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఏబీసీ ఆస్పత్రికి తరలించారు. రంగిరీజువీధిలో సోమవారం ఉదయం సంభవించిన గ్యాస్‌లీక్ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటి యజమాని కొప్పుల ఈశ్వరరావు (80 శాతం గాయాలు), పకోడి బండి వ్యాపారి కొల్లి సూరిబాబు (76 శాతం గాయాలు), శాంతమ్మ (50 శాతం గాయాలు), పేలుడు సంభవించిన ఇంట్లో అద్దెకు ఉంటున్న కోట సత్యనారాయణ మనుమరాలు పూజిత (60 శాతం గాయాలు) సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న 19 నెలల చిన్నారి జయరామ్ పరిస్థితి విషమించడంతో తొలుత ఏబీసీ ఆస్పత్రికి...అనంతరం ఓమ్ని ఆర్కె చిల్డ్రన్ ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రెండున్నరేళ్ల చాందిని, ఎనిమిదేళ్ల తనూజను కూడా ఇదే ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది శాతం గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జి.నాగేశ్వరి, ఏడు శాతం గాయాలతో చికిత్స పొందుతున్న కీర్తిని బుధ, గురువారాల్లో డిశ్చార్జి చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే ఘటనలో కేజీహెచ్ సూపర్ స్పెషాల్టీ బ్లాకులో చికిత్స పొందుతున్న కోట బుజ్జికి కొల్లాజన్ (కాలిపోయిన చర్మానికి రక్షణ) వేశారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బుధవారం పరామర్శించారు. పట్టించుకునేవారే లేరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ చూసి వెళ్లిపోయారే తప్పా తమ గోడు పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇక్కడ అందుతున్న వైద్యం కోసం ఆరా తీసేవారే లేకపోయారంటూ వాపోయారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. రాత్రి వేళల్లో సెలైన్ ఆగిపోతే నర్సింగ్ సిబ్బంది లేకుండా పోయారని, వాచ్‌మన్ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు ప్రాణాలతో దక్కాలంటే ఇక్కడి నుంచి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లి మంచి వైద్యం చేయించాలని మొర పెట్టుకున్నారు. నర్సింగ్ సిబ్బంది లేకపోవడం దౌర్భాగ్యం ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఇక్కడి వైద్యులు చికిత్స బాగానే అందిస్తున్నారని, నర్సింగ్ సిబ్బంది తక్కువగా ఉండటంతో ఈ దౌర్భాగ్యం నెలకొందని వ్యాఖ్యానించారు. సూపర్ స్పెషాల్టీ బ్లాక్‌లో 36 పడకలున్నాయని, ఇద్దరు నర్సులు మాత్రమే ఇక్కడ సేవలందిస్తున్నారని, ఎంసీఐ నిబంధన మేరకు చాలినంత సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. స్మార్ట్ సిటీ కన్నా ముందు కేజీహెచ్‌ను స్మార్ట్ కేజీహెచ్‌గా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. కేజీహెచ్ బాగుంటే ప్రజలకు వైద్య సదుపాయం దక్కుతుందని, ఆస్పత్రి అభివృద్ధి అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్టు చెప్పారు. గ్యాస్ లీక్ సంఘటనలో ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల వెంట కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూధనబాబు, ఆర్ఎంఓ కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, బీజేపీ నేత చెరువు రామకోటయ్య తదితరులున్నారు.