కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వండి
-
సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్
రాపూరు:
విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులను వెంటనే జీతాలు చెల్లించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్ చేశారు. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బుధవారం సీఐటీయూ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌శాఖలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలలుగా, మీటర్ రీడింగ్ తీసే వారికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదన్నారు. వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. ప్రతి నెలా 7న ఇవ్వాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్‌చేశారు. ఈ విషయాలపై ఈనెల 13 వ తేదీ నుంచి దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్, ప్రధానకార్యదర్శిజాకీహుసేన్, డివిజనల్‌అధ్యక్షుడు రత్నయ్య, కార్యదర్శి మునికిష్టయ్య, నాయకులు రామయ్య, కిష్టయ్య, గిరిబాబు, యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు.