'రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదు'
రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదు. కార్మిక సమస్యలు విస్మరిస్తే ఏడాదికే ఇంటికి సాగనంపుతాం.
అనంతపురం: 'రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదు. కార్మిక సమస్యలు విస్మరిస్తే ఏడాదికే ఇంటికి సాగనంపుతాం. పనికిమాలిన వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడు కనుకే యానిమేటర్ల సమస్యను పరిష్కరించలేకపోరు' అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఆదివారం అనంతపురంలోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...పశ్చిమ గోదావరి సభలో నిరసన తెలిపిన యానిమేటర్లను ఉద్దేశించి బాబు 'పనికిమాలిన పార్టీలోళ్లు పంపిస్తే వచ్చినోళ్లు' అంటూ వ్యాఖ్యానించడంపై గఫూర్ అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు తీరు సరిగా లేదని ఆయన అన్నారు.