ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వేతనాలు, డీఏ పెంచాలన్న డిమాండ్లతో వీఆర్‌ఏలు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్‌ఏలకు రూ.7,500 జీతం చెల్లిం చాలని, ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా డీఏ రూ.500లకు జీఓ ఇవ్వాలని, సీసీఎల్‌ఏ సిఫార్సుల అమలు జీఓ జారీ చేయాలని, 39 జీఓ ప్రకారంగా వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి ఇవ్వాలని, మృతిచెందిన వీఆర్‌ఏల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని, వీఆర్‌ఏలను నాలుగోతరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ విరమణానంతర ప్రయోజనాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో వీఆర్‌ఏలను నాలుగోతరగతి ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు ఇస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో మాత్రం కేవలం రూ.3,500, నెలకు డీఏ రూ.100 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. ఇటీవలి కాలంలో జీతాలు పెంచినట్టుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ జీఓ ఇవ్వలేదని అన్నారు. దీనిని వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు.
దీక్ష శిబిరంలో వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిర్రా వెంకటేశ్వర్లు, పదముత్యం సత్యనారాయణ, జిల్లా నాయకులు మహిబూబి, స్వరాజ్యం, వీరయ్య, బాలశౌరి, ధనలక్ష్మి, శ్రీను, లింగయ్య కూర్చున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.నరసింహారావు, నాయకులు ఎం.శ్రీను, వీరయ్య, నర్సయ్య, జాన్‌బీ, మౌలానా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, బాబూరావు, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేతనాలు పెంచాలని వీఆర్‌ఏల నిరవధిక దీక్ష
Published Sat, Jan 18 2014 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement