రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి
Published Mon, Jul 25 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
హన్మకొండ : వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని, 10వ పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని టీyీ పీ జిల్లా అధ్యక్షుడు గండ్రసత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ రెండో ఏఎన్‌ఎంల సమ్మెను పురస్కరించుకుని సోమవారం హన్మకొండలోని ఏకశిలా పార్క్ లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి గం డ్ర సత్యనారాయణ, సారంపల్లి వాసుదేవరెడ్డి హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో 2007–2008 సంవత్సరం నుంచి 4 వేల మంది కాంట్రాక్ట్ రెండో ఏఎన్‌ఎంలు కొనసాగుతున్నారన్నారు. వీరు 8 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశా రు. రెండో ఏఎన్‌ఎంలకు 35 రోజుల క్యాజు వల్ లీవ్‌లు ఇవ్వాలని, 180 రోజుల వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చే యాలని కోరారు. విధి నిర్వహణలోచనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డి మాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రెండో ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి బొట్ల చక్రపాణి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఆయా సం ఘాల నాయకులు ఎ.జనార్ధన్, జి.దయాకర్, జి.రమేష్, ఎస్.అనిత, శ్రీకాం త్, కె.అయిలయ్య, సి.హెచ్.అనిల్, చాడా రఘునాథరెడ్డి, డి.తిరుపతి, జె.సుధాకర్, ఏఎన్‌ఎంలు కె.సరోజ, సుజాత, పద్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు.
Advertisement