second anms
-
సీఎం సారూ.. మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు? వెక్కి వెక్కి ఏడుస్తూ వేడుకోలు
హిమాయత్‌నగర్: ‘‘అయ్యా.. సీఎం సారూ.. మిమ్మల్ని గెలిపించినవారిలో మేం కూడా ఉన్నామయ్యా. మీరంటే మాకూ అభిమానం, మా కేసీఆర్ సారు తెలంగాణ సాధించినోడు, ఆయనను సీఎంగా గెలిపించుకోవాలనే ఆశతో మీకు మా ఇంటిల్లిపాదీ ఓట్లు వేసి గెలిపించుకున్నాం సారూ. అందరికీ అన్నీ చేస్తున్నావు సారూ.. మరి మాకెందుకు సారూ జీతాలు పెంచట్లేదు. ఉప్పు, పప్పు, కారం, నూనె.. ఇలా ఏది కొనాలన్నా కొనలేకపోతున్నాం. మాకిచ్చే ఆ రూ.25 వేల జీతాలు చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. మాయందు దయ తలచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి సారూ’అంటూ సెకెండ్ ఏఎన్ఎంలు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి ఒక్కరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థిస్తున్న తీరు చూపరుల హృదయాలను ద్రవింపజేసింది. ఈ సన్నివేశం గురువారం హిమాయ త్‌నగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. వీరి కన్నీటిబాధను చూసిన వాహన దారులు సైతం సంఘీభావం తెలిపారు. చలో అసెంబ్లీ నిమిత్తం అన్ని జిల్లాల నుంచి వీరు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్ వద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు. వీరిలో కొందరు తమ చంటిబిడ్డలను సైతం వెంట తీసు కొనివచ్చారు. పోలీసులకు, సెకెండ్ ఏఎన్ఎంలకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. మగ పోలీసులు పలువురిని ఈడ్చి రోడ్డు పక్కన వేశారు. మహిళా పోలీసులు చాలాసేపు పక్కనే నిలబడి చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఈ సందర్భంగా సెకెండ్ ఏఎన్ఎంల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మమత మాట్లాడుతూ 16 ఏళ్లుగా ప్రభుత్వాలు మాతో గొడ్డుచాకిరి చేయిస్తున్నా యన్నారు. కోవిడ్ సమయంలో నేరుగా కోవిడ్ పేషెంట్లకు ఇంజక్షన్లు చేసింది తామే నన్నారు. ప్రభుత్వం ఏ పనిమొదలు పెట్టినా ముందు ఉండి చేసేది తామేనన్నారు. తమను ఇప్పటికైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని అభ్యర్థించారు. -
రెండో ఏఎన్ఎంల సమ్మె వాయిదా
నేటి నుంచి విధుల్లోకి వైద్య సిబ్బంది ఎంజీఎం : రాష్ట్ర మంత్రుల హామీతో పాటు ఈనెల 1న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రెండో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొంత సమయం కావాలని కోరడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ యునైటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదానాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4221 మంది రెండో ఏఎన్ఎంలు 47 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. సమ్మె కాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపామన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్హెచ్ఎం పరిధిలో ఉన్న యూనిఫాం, సెలవులు, పీఎఫ్, మెటర్నటీ సెలవులు ఇవ్వడానికి అంగీకరించారని, ఎన్ఆర్హెచ్ఎం గైడ్‌లైన్స్ ప్రకారం 15 శాతం వేతనం పెం^è డంతో పాటు సర్వీస్ వెయిటేజీ 30 శాతం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ప్రధాన డిమాండైన రెగ్యులరైజేషన్, కనీస వేతనం రూ. 21,300 అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు. గత నెల 24న కోఠిలోని కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని ప్రకటించామని, దానికి అధికారులు నిరాకరించడంతోS 29న వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర మంత్రుల ఇళ్ల వద్ద ధర్నా చే శామని, ఆ సందర్భంగా సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని వివరించారు. పోరాట కాలంలో సమ్మెకు సంఘీభావం ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
డిప్యూటీ సీఎం ఇంటి ముట్టడి
నిరసన తెలిపిన రెండో ఏఎన్ఎంలు కేబినెట్ సమావేశంలో మాట్లాడుతానని కడియం హామీ హన్మకొండ : తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం రెండో ఏఎన్ఎంలు డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కడియం శ్రీహరి ఏఎన్ఎంల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని, అప్పటి వరకు కనీస వేతనం చెల్లించాలని, పదో పీఆర్సీ వర్తింపజేయాలని ఈ సందర్భంగా ఏఎన్ఎంలు కోరారు. దీంతో డిప్యూటీ సీఎం వెంటనే ఫోన్లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడారు. త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రెండో ఏఎన్ఎంల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి, నాయకులు నాగేశ్వర్రావు, నర్సింగం, రెండో ఏఎన్ఎంల అసోషియేష న్ జిల్లా అధ్యక్షురాలు కె.సరోజ, నాయకులు మంజుల, జమునా, సదాలక్ష్మి, మంజులాదేవి, కవిత, సుజాత, లక్ష్మి, భారతి, లత, అనిత, మాదవి, రజిత, భాగ్యలక్ష్మి, మీనా పాల్గొన్నారు. -
జీఓ 151 వర్తింపజేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ : వేతనాల పెంపు జీఓ 151 వర్తింప చేయాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ రెండవ ఏఎన్ఎంల యూనియన్ గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన అర్హతలతో వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు అరకొర వేతనాలు ఇచ్చి వేతన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంçపునకు సంబంధించి జీఓ నంబర్ 151ని తక్షణం సెకండ్ ఏఎన్ఎంలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనకు యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవీ రమణ, డీఏ రత్నరాజ్‌లు సంఘీభావం తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతలక్ష్మి, జీఎన్ వరలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రభుత్వం పరిష్కారం చూపేదెప్పుడో..?
36రోజులుగా సమ్మెలో రెండో ఏఎన్ఎంలు ఇబ్బందుల్లో ప్రజలు కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభిస్తుందని, స్వరాష్ట్ర సాధన కోసం వివిధ రంగాలతో పాటు తాము ఉద్యమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ సమస్యలు పరిష్కరించడం లేదని రెండో ఏఎన్ఎంలు వాపోతున్నారు. డిమాండ్ల సాధన కోసం వారు రాస్తారోకోలు, ధర్నాలు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడి, వంటావార్పు, ప్రముఖ నేతల విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టి నిరసనను వ్యక్త చేశారు. వివిధ రకాలుగా తమ నిరసనను తెలుపుతూ 36 రోజులుగా పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నారు. అందని సేవలు... రెండో ఏఎన్ఎంలు విధుల్లో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సరిగా అందడం లేదు. ప్రధానంగా నెలనెల ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలు అందక గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యం అందడం లేదని పలు గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలోని ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాలతో పాటు తాంసి, తలమడగు మండలాల్లో కలిపి మొత్తం 43 మంది రెండో ఏఎన్ఏంలు ఉన్నారు. వీరు సమ్మె బాట పట్టడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి వెంటనే వారి సమస్యలు పరిష్కరించి ప్రజలకు రెండో ఏఎన్ఎంల సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. డిమాండ్లు ఇవే... కాంట్రాక్టు రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి. 10వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 21,300లతో పాటు, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతరల అలవెన్సులు అందజేయాలి. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఆరోగ్య బీమా (ఇఎస్ఐ) సౌకర్యం కల్పించాలి. వ్యాక్సిన్ అలవెన్స్ రూ. 500, యూనిఫాం అలవెన్స్ రూ. 1500, ఎఫ్‌టీఏ రూ. 550 చెల్లించాలి. 35 రోజుల క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలి. 180 రోజులతో కూడిన మెటర్నటీ సెలవులు ఇవ్వాలి. సబ్ సెంటర్లు అద్దె రూ. 1000తో పాటు స్టేషనరీ, జిరాక్స్ ఖర్చులు ఇవ్వాలి. నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలి, బదిలీకి అవకాశం కల్పించాలి. ఎవరైనా విధి నిర్వహణలో చనిపోతే వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. -
డిప్యూటీ సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం
కడియం నివాసం సమీపంల బైఠాయించిన రెండో ఏఎన్ఎంలు ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం హన్మకొండ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య, ఆరో గ్య శాఖలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు హన్మకొండ టీచర్స్ కాలనీలోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటి ముట్టడికి శనివారం యత్నించారు. గత 34 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం గురించి సమాచారం అందడంతో సుబేదారి సీఐ వాసాల సతీష్, హన్మకొండ సీఐ సంపత్‌రావు, కేయూ సీఐ అలీ పోలీసు సిబ్బందితో టీచర్స్ కాలనీలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం ఇంటి సమీపంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ సిబ్బంది మెుహరించారు. ర్యాలీ టీచర్స్ కాలనీకి చేరుకోగానే రెండో ఏఎన్ఎంలను అడ్డుకున్నారు. అయినా వారు పోలీసులను నెట్టివేసి కడియం ఇంటి వైపు దూసుకుపోయారు. ఈక్రమంలో పోలీసు లు, రెండో ఏఎన్ఎంల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు సీఐటీయూ నాయకులు, రెండో ఏఎన్ఎంలను అరెస్టు చేసి వాహనం ఎక్కించారు. కాగా, వారిని తీసుకెళ్తున్న వాహనాన్ని నిరసనకారులు అడ్డుకోవడంతో మరోసారి పోలీసులు, రెండో ఏఎన్ఎంల మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు పలువురు సీఐటీయూ నాయకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరికొందరు ఏఎన్ఎంలను ఇక్కడి నుంచి పంపించారు. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలంటూ రెండో ఏఎన్ఎంలు సుబేదారి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అంతకుముందు ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్య మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంల సమస్యలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించాలన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేసున్న రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేసి, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, యు.నాగేశ్వర్రావు, భోగి సురేష్, కృష్ణం రాజు, రొయ్యల రాజు, జి.శ్రీనివాస్, రెండో ఏఎన్ఎంల అసోసియేషన్ నాయకులు కె.సరోజ, మంజుల, జమునారాణి, ప్రమోద, దీనా పాల్గొన్నారు. -
రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : వైద్య, ఆరోగ్య శాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని టీyీ పీ జిల్లా అధ్యక్షుడు గండ్రసత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంల సమ్మెను పురస్కరించుకుని సోమవారం హన్మకొండలోని ఏకశిలా పార్క్ లో ఆయా పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి గం డ్ర సత్యనారాయణ, సారంపల్లి వాసుదేవరెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 2007–2008 సంవత్సరం నుంచి 4 వేల మంది కాంట్రాక్ట్ రెండో ఏఎన్ఎంలు కొనసాగుతున్నారన్నారు. వీరు 8 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశా రు. రెండో ఏఎన్ఎంలకు 35 రోజుల క్యాజు వల్ లీవ్‌లు ఇవ్వాలని, 180 రోజుల వేతనం తో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చే యాలని కోరారు. విధి నిర్వహణలోచనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డి మాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రెండో ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి బొట్ల చక్రపాణి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఆయా సం ఘాల నాయకులు ఎ.జనార్ధన్, జి.దయాకర్, జి.రమేష్, ఎస్.అనిత, శ్రీకాం త్, కె.అయిలయ్య, సి.హెచ్.అనిల్, చాడా రఘునాథరెడ్డి, డి.తిరుపతి, జె.సుధాకర్, ఏఎన్ఎంలు కె.సరోజ, సుజాత, పద్మ, కల్పన తదితరులు పాల్గొన్నారు. -
ఏడో రోజుకు చేరిన రెండో ఏఎన్ఎంల సమ్మె
జమ్మికుంట : తమ సమస్యలు పరిష్కరించాలని రెండో ఏఎన్ఎంలు చేస్తున్న సమ్మె ఏడోరోజుకు చేరింది. ఆందోళనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలోని సమ్మె శిబిరం నుంచి ఆదివారం ఏఎన్ఎంలు ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్ వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుతం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వావిలాల, ఇల్లందకుంట, చల్లూర్, వీణవంక మండలాల పీహెచ్‌సీల పరిధిలోని సెకండ్ ఏఎన్ఎంలు సునీత, రమ, విజయ, వనిత, జ్యోతి, మణేమ్మ, ప్రమీల, హైమావతి, అంజలీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.