- నేటి నుంచి విధుల్లోకి వైద్య సిబ్బంది
రెండో ఏఎన్‌ఎంల సమ్మె వాయిదా
Published Sat, Sep 3 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
ఎంజీఎం : రాష్ట్ర మంత్రుల హామీతో పాటు ఈనెల 1న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రెండో ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొంత సమయం కావాలని కోరడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ యునైటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదానాయక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4221 మంది రెండో ఏఎన్‌ఎంలు 47 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. సమ్మె కాలంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపామన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పరిధిలో ఉన్న యూనిఫాం, సెలవులు, పీఎఫ్, మెటర్నటీ సెలవులు ఇవ్వడానికి అంగీకరించారని, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం గైడ్‌లైన్స్ ప్రకారం 15 శాతం వేతనం పెం^è డంతో పాటు సర్వీస్ వెయిటేజీ 30 శాతం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ప్రధాన డిమాండైన రెగ్యులరైజేషన్, కనీస వేతనం రూ. 21,300 అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు.
గత నెల 24న కోఠిలోని కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని ప్రకటించామని, దానికి అధికారులు నిరాకరించడంతోS 29న వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇతర మంత్రుల ఇళ్ల వద్ద ధర్నా చే శామని, ఆ సందర్భంగా సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని వివరించారు. పోరాట కాలంలో సమ్మెకు సంఘీభావం ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement