ఫీజుల పెంపు శరాఘాతం | fees increese is burder | Sakshi
Sakshi News home page

ఫీజుల పెంపు శరాఘాతం

Published Sun, Jan 22 2017 11:48 PM | Last Updated on Sat, Mar 9 2019 4:29 PM

fees increese is burder

 - సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్‌ రాధాకృష్ణ
- 24న కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నాకు పిలుపు
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఆర్టీఏ చలానాల పెంపు ఆటో రంగ కార్మికులకు శరాఘాతంగా మారిందని, జీవనాధారంగా ఉన్న ఆటోలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్‌ రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్రోల్, డిజిల్ ధర పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులపై ప్రభుత్వం చలానాల భారం మోపడం సరికాదన్నారు. ‘పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులు- ఆటోరంగం, దాని అనుబంధ రంగాలపై ప్రభావం’ అనే అంశంపై ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో సదస్సు నిర్వహించారు.
 
          నగరంలోని ప్రయివేటు ఫైన్సార్లు, ఆటో మొబైల్‌ యజమానులు, ఆటో మెకానిక్‌లు, పెయింటర్లు, ఎలక్ట్రిషీయన్లు, స్పేర్‌పార్ట్స్‌ షాపుల యజమానులు హాజరై సీఐటీయూ పోరాటాలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో ఎఫ్‌సీ లేటు ఫీజు కింద రోజుకు రూ.50 వసూలు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీనివల్ల ఆటోలను గంపగుత్తగా అమ్ముకోవాల్సిందేనని స్పష్టంచేశారు.పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈనెల 24న కలెక్టరేట్‌ ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.రాధాకృష్ణ, కే.ప్రభాకర్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement