rta chalan
-
మార్చి 30న లారీల బంద్
- పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులకు నిరసనగా ఈ కార్యక్రమం - సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులకు నిరసనగా మార్చి 30వ తేదీన దక్షిణ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ కార్మికులకు పిలుపునిచ్చారు.ఆదివారం కేకే భవన్లో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రైవేట్ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గఫూర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న ఇచ్చిన 894 ఉత్తర్వుల ద్వారా రవాణా రంగంలో ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, లేటు చలానా ఫీజులు రోజుకు రూ.50 చొప్పున 500 రెట్లకుపైగా పెంచిందన్నారు. అంతటితో ఆగక 2017 మార్చి 3వ తేదీన మూడో పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం పెంచుతూ ఐఆర్డీఏ ద్వారా ప్రతిపాదన పెట్టిందన్నారు. ఈ రెండు నిర్ణయాలు రవాణా రంగాన్ని కుదేలు చేసే అవకాశం ఉందన్నారు. వెంటనే చలానా ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముజఫర్, చిత్తూరు జిల్లా నాయకుడు గంగాధర్, నెల్లూరు జిల్లా నాయకుడు «శ్రీనివాసులు, కర్నూలు నాయకులు పుల్లారెడ్డి, సుబ్బారాయుడు, ఆటో యూనియన్ నాయకులు బి.రాధాకృష్ణా, ప్రభాకర్ పాల్గొన్నారు. 26కేఎన్ఎల్39 : సమావేశంలో మాట్లాడుతున్న గఫూర్ -
ఫీజుల పెంపు శరాఘాతం
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాకృష్ణ - 24న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు పిలుపు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఆర్టీఏ చలానాల పెంపు ఆటో రంగ కార్మికులకు శరాఘాతంగా మారిందని, జీవనాధారంగా ఉన్న ఆటోలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ రాధాకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్రోల్, డిజిల్ ధర పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులపై ప్రభుత్వం చలానాల భారం మోపడం సరికాదన్నారు. ‘పెంచిన ఆర్టీఏ చలానా ఫీజులు- ఆటోరంగం, దాని అనుబంధ రంగాలపై ప్రభావం’ అనే అంశంపై ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో సదస్సు నిర్వహించారు. నగరంలోని ప్రయివేటు ఫైన్సార్లు, ఆటో మొబైల్ యజమానులు, ఆటో మెకానిక్‌లు, పెయింటర్లు, ఎలక్ట్రిషీయన్లు, స్పేర్‌పార్ట్స్ షాపుల యజమానులు హాజరై సీఐటీయూ పోరాటాలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో ఎఫ్‌సీ లేటు ఫీజు కింద రోజుకు రూ.50 వసూలు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీనివల్ల ఆటోలను గంపగుత్తగా అమ్ముకోవాల్సిందేనని స్పష్టంచేశారు.పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈనెల 24న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.రాధాకృష్ణ, కే.ప్రభాకర్ పాల్గొన్నారు.