అనంతపురం అగ్రికల్చర్ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు 2017–18 బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈనెల 20న స్కీం వర్కర్లు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ అనుబంధ స్కీం వర్కర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి నాగవేణి, అంగన్‌వాడీ వర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్.నాగమణి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, ఉపా«ధి హామీ పథకం, సాక్షర భారత్, సర్వశిక్షా అభియాన్ తదితర పథకాల్లో పనిచేస్తున్న వారందరినీ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.