మోటారు బిల్లు పెంపుపై నిరసన | protest on motor vehicle bill hike | Sakshi
Sakshi News home page

మోటారు బిల్లు పెంపుపై నిరసన

Published Wed, Aug 10 2016 6:19 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

మోటారు బిల్లు పెంపుపై నిరసన - Sakshi

మోటారు బిల్లు పెంపుపై నిరసన

యాచారం: కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన మోటార్‌ వాహనాల బిల్లును పార్లమెంట్‌లో అమోదింపజేయవద్దని డిమాండ్‌ చేస్తు బుధవారం యాచారంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ బిల్లు అమోదింపజేయడానికి చూస్తోందని పలువురు నాయకులు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్‌ చౌరాస్తాలో గంట పాటు ధర్నా అనంతరం సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి పి. బ్రహ్మయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వాహనాల బిల్లును తెచ్చి డ్రైవర్ల మీద కేసులు, ఇతర పరిహారం చెల్లింపు విషయంలో  కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో  విపక్షాలు బిల్లు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా బిల్లు అమోదింపజేయడం కోసం పట్టుతో ఉండడంపై మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో వాహన డ్రైవర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement