Motor vehicle bill
-
ట్రాఫిక్ నేరాలపై కొరడా!
మోటారు వాహనాల బిల్లులో మార్పులకు కేబినెట్ ఓకే న్యూఢిల్లీ: మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవర ణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, బాధితులకు పరిహారం పెంపు తదితర ప్రతి పాదనలూ ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని, హెల్మెట్, సీటు బెల్టు వాడని వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి పాదించారు. పార్లమెంటరీ సంఘం చేసిన దాదాపు అన్ని సూచనలను ప్రధాని అధ్యక్షత సమావేశమైన కేబినెట్ ఆమోదించిందని రవాణా మంత్రి నితిన్ గడ్కారీ విలేకర్లకు తెలిపారు. బిల్లు్ల వచ్చేవారం పార్లమెంటు ముందుకొస్తుందన్నారు. ఆన్లైన్ సేవల కోసం ఆధార్ ఆధారిత తనిఖీని బిల్లులో ప్రతిపాదించారని, తద్వారా లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సునూ రవాణా కార్యాలయానికి వెళ్లకుండానే పొందొచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ఒకే పేరుతో పలు లైసెన్సులు తీసుకోవడం కదురదన్నారు. వాహనాలను ఆర్టీఓ ద్వారానే రిజిస్టర్ చేయాలన్న స్థాయీ సంఘం సూచనను ప్రభుత్వం తిరస్కరిచిందని వెల్లడించారు. 1989 నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే.. ఆలిండియా ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ద్వారా వాహనాల డీలర్లు నంబర్లు కేటాయించి, రిజిస్టర్ చేస్తారని వివరించారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి నాలుగు నెలల్లోగా రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన స్థాయీ సంఘానికి పంపారు. మరికొన్ని నిర్ణయాలు యూరియా ఉత్పత్తి పెంచేందుకు జాతీయ యూరియా విధానం–2015కు చేసిన సవ రణలకు ఆమోదం. పునఃఅంచనా సామర్థ్యానికి(ఆర్ఏసీ) మించి ఉత్పత్తి చేసేందుకు తయారీదారులకు వెలుసు బాటు. ఫాస్పేట్, పోటాస్ ఎరువులకు సంబంధించి 2017–18కుగాను పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్ల నిర్ధారణ విధానానికి ఆమోదం. ఫాస్పరస్‌పై సబ్సిడీ కేజీకి రూ.11.99(గత ఏడాది కంటే రూ.1.24 తగ్గింపు), పోటాస్‌పై రూ. 12.39(గత ఏడాదికంటే రూ. 3.07 తగ్గింపు), నత్రజనిపై రూ. 18.98(గత ఏడాదికంటే రూ. 3.13 పెంపు), సల్ఫర్పై రూ. 2.24(గత ఏడాది కంటే 19పైసల పెంపు)గా నిర్ణయం. -
మోటారు బిల్లు పెంపుపై నిరసన
యాచారం: కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన మోటార్ వాహనాల బిల్లును పార్లమెంట్లో అమోదింపజేయవద్దని డిమాండ్ చేస్తు బుధవారం యాచారంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే ఈ బిల్లు అమోదింపజేయడానికి చూస్తోందని పలువురు నాయకులు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్ చౌరాస్తాలో గంట పాటు ధర్నా అనంతరం సీఐటీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి పి. బ్రహ్మయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల బిల్లును తెచ్చి డ్రైవర్ల మీద కేసులు, ఇతర పరిహారం చెల్లింపు విషయంలో కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో విపక్షాలు బిల్లు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా బిల్లు అమోదింపజేయడం కోసం పట్టుతో ఉండడంపై మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో వాహన డ్రైవర్లు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. -
లోక్‌సభకు మోటారు వాహనాల బిల్లు
* రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా.. * బిల్లు ప్రతులు ఇవ్వలేదని విపక్షాల నిరసన న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016ను విపక్షాల తీవ్ర నిరసనల మధ్య మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సంప్రదాయం ప్రకారం తమకు ముందస్తుగా బిల్లు ప్రతులను ఇవ్వనందున బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించవద్దని ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ను కోరారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై భారీ జరిమానాలను ప్రతిపాదిస్తూ తెచ్చిన ఈ బిల్లును ఇటీవల కేబినెట్ ఆమోదించడం తెలిసిందే. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కారీ సభలో బిల్లును ప్రవేశపెడుతూ... కీలకమైన ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరగా, దీన్ని సంయుక్త ఎంపిక కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వచ్చే శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నందున ఆలోపే రాజ్యసభలోనూ ఆమోదం పొందేందుకు అవకాశముంటుదని గడ్కారీ చెప్పారు. కాగా పారిశ్రామిక ప్రమాదాల్లో ఉద్యోగులు గాయపడితే వారికిచ్చే పరిహారాన్ని భారీగా పెంచుతూ తెచ్చిన ఉద్యోగుల పరిహార (సవరణ) బిల్లు-2016కు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దీనివల్ల ఉద్యోగులకు రూ.50 వేల నుంచి లక్ష వరకు పరిహారం అందుతుంది. కంపెనీలు నిబంధలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా వేస్తారు. కశ్మీర్‌పై నేడు చర్చ.. కశ్మీర్లో ఉద్రిక్తతపై రాజ్యసభలో చర్చ నిర్వహించాలని విపక్షాలన్నీ ఏకమై చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గింది. కశ్మీర్‌పై బుధవారం చర్చ జరుపుతామని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. దళితులపై జరుగుతున్న దాడుల అంశంపై చర్చకూ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై గురువారం లోక్‌సభలో చర్చిస్తారు.