అక్రమ తొలగింపును అడ్డుకున్నాం
అక్రమ తొలగింపును అడ్డుకున్నాం
Published Sat, Sep 10 2016 10:59 PM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM
జైపూర్ : అంగన్‌వాడీలు, వర్కర్స్ అండ్ హెల్పర్ల అక్రమ తొలగింపులను ఐక్యతతో అడ్డుకొని విజయం సాధించామని సీఐటీయూ అంగన్‌వాడీ, వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మయూరి తెలిపారు. జైపూర్ మండలం భీమారంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల స్థితి గతులు, పరిస్థితులు చూడకుండానే అక్రమంగా అంగన్‌వాడీలను, ఆయాలను తొలగిస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల అక్రమంగా అంగన్‌వాడీలు, ఆయాలను తొలగించగా ఐక్యంగా పోరాడామని పేర్కొన్నారు. ఫలితంగానే తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నారని తెలియజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సమస్యలను పరిష్కరిస్తే ఎలాంటి అవకతవకలు జరగవని అధికారులకు సూచించారు. సమావేశంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సంకె రవి, చెన్నూర్ డివిజన్ అధ్యక్షుడు కష్ణామాచారి పాల్గొన్నారు.
Advertisement