మంచాల : మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలను మహిళలకే ఇవ్వాలని సీఐటీయూ రాష్ర్ట నాయకురాలు రమ అన్నారు. బుధవారం సాయంత్రం జీపుజాతా మంచాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా ప్రభుత్వ బడుల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేస్తున్నారన్నారు. సకాలంలో ప్రభుత్వం వేతనాలు, బిల్లులు ఇవ్వకపోయిన అప్పులు చేసి వంటలు చేయడం జరిగిందన్నారు. నేడు ఉన్నఫలంగా ప్రభుత్వ ప్రైవేట్ ఏజెన్సీలకు వంటలను అప్పజెప్పాలని చూడడం దారుణమన్నారు. అప్పుచేసి చాలీచాలని వేతనాలతో గత కొన్నేళ్లుగా.. వంటలు చేసి జీవనం పొందుతున్న మహిళలకే ఏజెన్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వంట గదులు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలి, సకాలంలో వేతనాలు ఇవ్వాలి, బిల్లులు ప్రతి నెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నర్సింహ, శ్యామల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.