Midday meal Agency
-
బకాయిల వడ్డన
అప్పుచేసి పప్పన్నం అందిస్తున్నా వారిని ఆదుకునే వారు లేరు. నిధులను సైతం సమకూర్చకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు.ఒకరోజు కాదు.. రెండురోజులు కాదు.. రోజూక్రమం తప్పకుండా ఆహారం మెను ప్రకారంవిద్యార్థులకు అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోని తీరు వెరసిఅన్నం పెట్టే మహిళలకు ఆకలి బాధలుకలిగిస్తున్నాయి. నెలల తరబడి బిల్లులుఅందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఉన్నత పాఠశాలల్లో ఏకంగానెలకు రూ. లక్ష వరకు బిల్లు వస్తుంది. మరీమూడు, నాలుగు నెలలు అందకపోతే వారుఎలా సరుకులు కొనాలి.. పిల్లలకు ఎలాఅందించాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ సర్కార్ ఐదేళ్లలోనూమధ్యాహ్న భోజన కార్మికులతో ఆడుకుంటుందనే విమర్శలున్నాయి.చివరకు హెల్పర్ల జీతాల విషయంలోనూ అలసత్వం కనిపిస్తోంది. సాక్షి కడప : మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జనవరి నుంచి ఇప్పటివరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు చెల్లించాల్సి ఉంది. కరువు నేపథ్యంలో జిల్లాలో అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సెలవుల్లో కూడా అమలు చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. నాలుగు నెలల బిల్లులు పెండింగ్ ఉండటంతో సెలవుల్లో ఆహారం సరఫరా చేయడానికి చాలామంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాపై నెలకు సరాసరిన రూ. 1.60 కోట్లు బిల్లు అవుతోంది. నాలుగు నెలలకు దాదాపు రూ. 6 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రెండు రోజుల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల, హెల్పర్ల జీతాలు పెండింగ్ మొత్తాలు ఖాతాలకు జమ చేస్తున్నారు. జీతాలకు తప్పని ఎదురుచూపులు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతన వేతలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5745 ఏజెన్సీలలో 11,490 మంది హెల్పర్లు, ఆయాలున్నారు. వారందరికీ గౌరవ వేతనంగా చెల్లించే రూ.1000 మొత్తాన్ని కూడా ఆలస్యం ప్రభుత్వం చేస్తోంది. నెలకు ఇచ్చే స్వల్ప మొత్తం కూడా జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. జీతాలకు కూడా వారు నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇదే తంతు కొనసాగుతోంది. సక్రమంగా నెలనెల బిల్లులు అందించిన పరిస్థితులు దాదాపు లేవనే చెప్పవచ్చు. ప్రతిసారి మూడు, నాలుగు నెలలకు ఒకసారి పెండింగ్ మొత్తాలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎప్పుడు చూసినా ఇదే రకంగానే వెళుతున్నారు తప్ప సక్రమంగా నెలనెల అందించిన పాపాన పోలేదు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మొదలుకొని హెల్పర్లు, ఆయాల జీతాలు కూడా ఇదే పరిస్థితిలోనే కొనసాగాయి. ఏది ఏమైనా ఐదేళ్లు వారు కష్టాలతోనే ముందుకు సాగుతూ వచ్చారు. మధ్యాహ్న భోజన బిల్లులెప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగు నెలల బిల్లులు రావాల్సిన నేపధ్యంలో తర్వాత ప్రభుత్వం మారితే వస్తాయో, రావోనన్న ఆందోళన కూడా వారిని వెంటాడుతోంది. ప్రస్తుత సర్కార్ వారి బిల్లుల విషయంలో అయినా వెంటనే మంజూరు చేసి అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఐదేళ్లలో బిల్లులన్నీ పెండింగ్లో పెడుతూ వచ్చినా.. కనీసం చివరిలోనైనా అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
వంట ఏజెన్సీలకు పొగ
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్ఆర్పేట) : మధ్యాహ్న భోజన పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల పొట్ట నింపుతున్న వంట ఏజెన్సీల పొట్టకొట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 18 మండలాల్లో 1,071 పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థులకు వండి వడ్డిస్తున్న వంట ఏజెన్సీలను కాదని ఏకతాశక్తి అనే ఒకే ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. ఈ ఏజెన్సీ ఆయా మండలాల పరిధిలో 5 ప్రాంతాల్లో క్లస్టర్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడే వండి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనుంది. ఇప్పటివరకూ ఆయా పాఠశాలల ఆవరణలోనే సమయానికి వేడివేడి ఆహారాన్ని అందించే ఏజెన్సీల స్థానంలో ఎక్కడో 5 క్లస్టర్ పాయింట్లలో వండి వెయ్యికి పైగా పాఠశాలలకు భోజనం సరఫరా చేసే విధానం అమలులోకి రానుంది. దీంతో విద్యార్థులకు సమయానికి భోజనం అందే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం జిల్లాలోని దాదాపు 1.17 లక్షల మంది విద్యార్థులపై పడనుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 2,268 మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. దశలవారీగా ఏజెన్సీలకు ఎసరు ఇప్పటి వరకూ మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసిన స్వయం సహాయక సంఘాలను కాదని ప్రభుత్వం ఈ పథకాన్ని కేంద్రీకృతం చేస్తూ కొన్ని ఏజెన్సీలకే పరిమితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో గోదావరి విద్యా వికాస చైతన్య సొసైటీకి 8 మండలాల్లోని 54 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు అవకాశం కల్పించింది. దీనిలో 20,912 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథక లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది నుంచి ఏకతాశక్తి అనే ఏజెన్సీకి 18 మండలాల్లోని 1071 పాఠశాలలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఇప్పటివరకూ జిల్లాలో ఉన్న మొత్తం 3,242 పాఠశాలల్లో 1,125 పాఠశాలలకు సంబంధించిన ఏజెన్సీలు గల్లంతైపోయాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న 1,38,679 మంది విద్యార్థులకు ఆయా ఏజెన్సీలే వండి పెడుతున్నాయి. ఇక మిగిలింది 2117 పాఠశాలలే.. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రీకృతం చేసిన ఏజెన్సీలకు అప్పగించగా ప్రస్తుతం 2,117 పాఠశాలలకు మాత్రమే స్వయం సహాయక సంఘాల బృందాలు వండి వడ్డిస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,252 మంది వంట వారు, హెల్పర్లు ఉండగా 1,53,845 మంది విద్యార్థులకు వీరి సేవలందిస్తున్నారు. భవిష్యత్లో వీరిని కూడా తొలగించి మరికొన్ని కేంద్రీకృత ఏజెన్సీల చేతికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. క్లస్టర్ పాయింట్లు ఇవే ఏకతా శక్తి ఏజెన్సీకి కేటాయించిన 1,071 పాఠశాలల్లో 1.17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఆ సంస్థ 18 మండలాల పరిధిలో 5 క్లస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంది. శనివారపుపేట జిల్లా పరిషత్ హైస్కూల్, గుండుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్, ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్, కానూరు జిల్లా పరిషత్ హైస్కూల్, యర్నగూడెం జిల్లా పరిషత్ హైస్కూళ్లలో ఈ క్లస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఆయా క్లస్టర్ పాయింట్ల నుండే వంటలు వండి విద్యార్థులకు భోజనం సరఫరా చేయనుంది. విద్యార్థులకు సమయానికి అందేనా? ఇదిలా ఉండగా ఏకతాశక్తి ఏజెన్సీ ఏర్పాటు చేసిన క్లస్టర్ పాయింట్ల ద్వారా సరఫరా చేయనున్న భోజనం విద్యార్థులకు సకాలంలో అందే అవకాశం ఉందా? అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే చోట వండి ఆ ప్రాంతానికి సుమారు 15–20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు సరఫరా చేయడం ఆషామాషీ వ్యవహారం కాదంటున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో చివరి పాఠశాలకు వెళ్లే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోవడం, ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ కావడం, ఆహార పదార్థాలు సరఫరా చేసే వాహనాలు మరమ్మతులు, ప్రమాదాలకు గురైతే ఆ రోజు విద్యార్థులు పస్తులతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. -
ఏజెన్సీలు మహిళలకే ఇవ్వాలి
మంచాల : మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలను మహిళలకే ఇవ్వాలని సీఐటీయూ రాష్ర్ట నాయకురాలు రమ అన్నారు. బుధవారం సాయంత్రం జీపుజాతా మంచాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా ప్రభుత్వ బడుల్లో డ్వాక్రా మహిళలు వంటలు చేస్తున్నారన్నారు. సకాలంలో ప్రభుత్వం వేతనాలు, బిల్లులు ఇవ్వకపోయిన అప్పులు చేసి వంటలు చేయడం జరిగిందన్నారు. నేడు ఉన్నఫలంగా ప్రభుత్వ ప్రైవేట్ ఏజెన్సీలకు వంటలను అప్పజెప్పాలని చూడడం దారుణమన్నారు. అప్పుచేసి చాలీచాలని వేతనాలతో గత కొన్నేళ్లుగా.. వంటలు చేసి జీవనం పొందుతున్న మహిళలకే ఏజెన్సీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వంట గదులు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలి, సకాలంలో వేతనాలు ఇవ్వాలి, బిల్లులు ప్రతి నెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నర్సింహ, శ్యామల, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆ గ్యాస్ స్టవ్లు ఏమైనట్టు?
⇒ కట్టెలపొయ్యిలతో మధ్యాహ్న భోజన ⇒ ఏజె న్సీల తంటాలు పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో పొగ కష్టాలు తప్పడం లేదు. సర్కారు అందజేసిన గ్యాస్ స్టవ్లు అటకెక్కాయి. సిలిండర్లను స్కూల్ గడప దాటించారు. వంటగదులు నిర్మిస్తారని చాలా కాలంగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిరాశే మిగులుతోంది. పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా సర్కారు వంట గదుల ఊసే ఎత్తడ ంలేదు. బడులన్నీ పొగ రాజుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. వంటవారికి కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. 2004-05 విద్యా సంవత్సంరలో ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు మూణ్నాళ్లకే మూలనపడ్డాయి. మరో వైపు సగం పాఠశాలలకు వంటగదులు లేక మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు తంటాలు పడుతున్నారు. పక్కదారి పట్టిన ప్రభుత్వ పొయ్యిలు 2004-05 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన పొయ్యిలు పక్కదారి పట్టాయి. ఆ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప వాటిని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పంపిణీ సమయంలో పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు.. వారి వారి ఇళ్లకు సిలిండర్లు చేరవేసుకున్నారు. పొయ్యిలు మాత్రం కొన్ని చోట్ల పాఠశాలల్లో ఓ మూలన పడేశారు. వీటి నిర్వహణపై పదే పదే విమర్శలు వినిపిస్తున్నా అధికారులు తిరిగి గ్యాస్పొయ్యిలు వెలిగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో అధికారుల తీరుపై గ్రామాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి పరిగి మండలంలో 8 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలకు, దోమలో 3 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక, కుల్కచర్లలో 7 ప్రాథమికోన్నత, 94 ప్రాథమిక, గండేడ్లో 7 ప్రాథమికోన్నత, 84 ప్రాథమిక, పూడూరులో 6 ప్రాథమికోన్నత, 39 ప్రాథమిక పాఠశాలలకు మొత్తం 394 పాఠశాలలకు గ్యాస్స్టవ్లు, సిలిండర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం ఏ ఒక్క పాఠశాలలోనూ సిలిండర్లతో వంటలు చేయడం లేదు. పొగచూరుతున్న పాఠశాల గదులు ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో గదులన్నీ పొగబారి నల్లగా మారుతున్నాయి. మరోవైపు వంటచెరుకు సేకరించేందుకు ఏజెన్సీలు నానా తంటాలు పడుతున్నాయి. సమకూర్చుకున్న పొయ్యిల కట్టెలు పాఠశాలల ఆవరణల్లో, గదుల్లో నిల్వ చేస్తుండటంతో విద్యార్థులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానొస్తే వరండాలో.. లేకుంటే ఆరుబయట అన్న చందంగా విద్యార్థుల మధ్యాహ్నం భోజనం వంట పరిస్థితి తయారయ్యింది. గ్యాస్ పొయ్యిల విషయం తమకు తెలియదని సంబంధిత అధికారులు చెబుతుండటం గమనార్హం.