సమావేశంలో మాట్లాడుతున్న భూపాల్
కార్మిక చట్టాలను తొలగించే కుట్రలను ఆపాలి
Published Thu, Aug 25 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
పారిశ్రామికవాడ(కొత్తూరు) : కార్మికచట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చే ప్రక్రియను వెంటనే ఆపాలని, లేని పక్షంలో కార్మికుల పోరాటంతో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రం సమీపంలోని పారిశ్రామికవాడ సమీపంలో గురువారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదల అభివద్ధి లేదన్నారు. కేవలం ధనవంతులు మాత్రమే మరింతగా అభివద్ధి సాధించినట్లు తెలిపారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పలు రంగాల్లోకి ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెను చేపట్టి మోదీకి గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఇండస్ట్రియల్ కమిటీ కన్వీనర్ పానుగంటి పర్వతాలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు బాల్‌రెడ్డి, ఎన్. రాజు, మండల కార్యదర్శి బాసా సాయిబాబా, నాయకులు మల్లేష్, శ్రీను, జంగయ్య, ర వీందర్, షకీల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement