labour acts
-
ఇంట్లో రెస్ట్ లేదు... ఆ‘పీస్’ లేదు
పూర్వం పురుషుడి సంపాదనకు స్త్రీ సంపాదన తోడైతే ‘ఏదో వేణ్ణీళ్లకు చన్నీళ్లు తోడు’ అనేవారు. రాను రాను స్త్రీ సంపాదన ప్రధానం అయ్యింది. స్త్రీలు ఇంటి పని, ఉద్యోగం చేయాల్సి వస్తోంది. కాని పని గంటలు వారి జీవితాలను కబళిస్తున్నాయా? ప్రయివేటు ఉద్యోగాలు పది గంటలు డిమాండ్ చేస్తుంటే సేల్స్ విమెన్ గానో, చిన్న ఉద్యోగాల్లోనో ఉండే మహిళలు ఏకంగా 12 గంటలు చేయాల్సి వస్తోంది. కుటుంబ, సాంఘిక, సామాజిక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ పని గంటలపైకార్మిక చట్టాలు ఏమీ చేయడం లేదు. స్త్రీలు ప్రాణాలు ΄ోయేంతగా వొత్తిడి అనుభవించాలా?ఇటీవల పూణెలో అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ తను పని చేసే సంస్థలో ఒత్తిడి తట్టుకోలేక మరణించింది. మంగళవారం (సెప్టెంబర్ 24) లక్నోలోని ఒక ప్రయివేట్ బ్యాంకులో పని చేస్తున్న ఫాతిమా అనే ఉద్యోగిని కుర్చీలోనే కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి వల్లే అని సహోద్యోగుల ఆరోపణ. ఇవి తెలిసి. తెలియనివి ఇంకెన్నో.స్త్రీలకు రెండు ఉద్యోగాలుఉదయం ఎనిమిదన్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకూ పని చేస్తే తప్ప జీతం రాని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మన దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. సేల్స్‌గర్ల్స్, హాస్పిటల్ స్టాఫ్, హోటల్ రంగం, కాల్ సెంటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాక్టరీ వర్కర్లు... 12 గంటలు చేయలేం అంటే 10 గంటలు అడుగుతున్నారు. అదీ కాదంటే 9 గంటలకు ఒక్క నిమిషం కూడా తక్కువ కాకుండా పని చేయాలన్నది వాస్తవం. ఈ 9 గంటలతో పాటు రాక΄ోకల సమయం కూడా కలుపుకుంటే స్త్రీలకు ఇంటి పనికీ, పిల్లల పెంపకానికి, విశ్రాంతికీ మిగిలే సమయం ఎంత?జీవితం గడవడానికి సంపాదన చాలా ముఖ్యమయ్యాక, ఆ సంపాదనలో ప్రధాన భాగం పిల్లల చదువుకు, వైద్యానికి, రవాణాకు ఖర్చు చేయకతప్పని పరిస్థితుల్లో భార్యాభర్తలు పని చేయక తప్పడం లేదు. మగాడిగా భర్తకు ఉద్యోగ వొత్తిడి తప్పదు. కాని స్త్రీలకు ఇంటి బాధ్యత కూడా ఉంటుంది. వంట వారే చేయాలి. ఇక పిల్లల పనులు, బట్టలు ఉతకడం, ఇంటి శుభ్రత, ఆతిథ్యం, అత్తమామలు ఉంటే వారి బాగోగులు... ఇవన్నీ భారమే. ఇటు ఈ పని అటు ఆ పని వీటి మధ్య సమన్వయం చేసుకోలేక మౌనంగా వొత్తిడి ఎదుర్కొంటూ అనారోగ్యం తెచ్చుకుంటూ ఒక్కోసారి ప్రాణాల మీదకు వచ్చే స్థితికి చేరువ చేస్తోంది మహిళా ఉపాధి.ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత వెసులుబాటు ఉండేది. కాని ప్రస్తుతం వారి పని ఒత్తిడి కూడా తక్కువగా లేదు. సుఖమైన బ్యాంకు ఉద్యోగం ఇప్పుడు పచ్చి అబద్ధం. చాలా చాకిరి అందులో ఉంటోంది. పెద్ద జీతాల సాఫ్ట్వేర్ రంగం విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇరవై నాలుగ్గంటలు పనే అనే భావన కలుగుతోంది. ‘మల్టీ నేషనల్ కంపెనీలు భారతీయ ఉద్యోగులను మనుషుల్లా కాకుండా గాడిదలతో సమానంగా చూస్తున్నాయి’...‘లాగిన్ చేయడం వరకే మా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని గంటలు పని చేస్తామో మాకే తెలియదు’ అనే మాటలు ఆ రంగంలో సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో స్త్రీలు తమ ఉద్యోగ, కుటుంబ జీవితాలను నిర్వహించుకోవడానికి సతమతమవుతున్నారు.వారానికి 60 గంటలుఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో ఎవర్ని పలకరించినా చేస్తున్న ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైఫ్‌కు భరోసా ఇవ్వాల్సిన ఉద్యోగాలే ప్రాణాలను హరిస్తున్నాయనడానికి పూణెలో అన్నా సెబాస్టియన్ అనే మహిళ పని ఒత్తిడితో మరణించడం ఒక ఉదాహరణ మాత్రమే. 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకే దారుణమైన వర్క్ కండిషన్స్ కారణంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో యువ మహిళా ఉద్యోగులు ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. వారానికి 40 గంటలు పాత మాటగా మారగా 55 నుంచి 60 గంటలు మహిళలతో కార్పోరేట్ కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో రోజుకు 18 గంటల పని విధానం సర్వసాధారణంగా మారి΄ోయింది. పని గంటలు ముగిసినా ఇంట్లో ఉన్నా చివరకు వారాంతమైనా సరే టార్గెట్లు పూర్తి చేయించుకోవడానికి ఆయా సంస్థలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితంతోపాటు ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేస్తే తప్ప ఈ తరహా ఉద్యోగాలు చేయలేని పరిస్థితి.హక్కులు ఏవి? చట్టాలు ఎక్కడ?చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో ఇంత చాకిరి చెల్లుబాటు కాదు. ప్రపంచంలో అతి తక్కువ పని గంటలున్న 20 దేశాల్లో ఇండియా ఊసు కూడా లేదు. మన దేశంలో జీవించడానికి ఉద్యోగం చేస్తున్నామా లేక ఉద్యోగం చేయడమే జీవితమా అన్న స్థాయిలో పని కబళించేస్తోంది. ఒకరకంగా మానవ హక్కుల ఉల్లంఘనే జరుగుతోంది. వర్క్ కండిషన్స్ ఎలా ఉండాలి అనే అంశంపై 1948లో ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ను మెజార్టీ దేశాలు ఆమోదించాయి. ఉద్యోగుల హక్కులను కాపాడే ఈ డిక్లరేషన్ ను రూ΄÷ందించడంలో భారత్ కూడా కీలక పాత్ర ΄ోషించింది. అయితే దానికి కట్టుబడి చట్టాలను అమలు చేయడంలో మాత్రం మన ప్రభుత్వాలు, వ్యవస్థలు విఫలమవుతున్నాయి. అందుకే భారతీయులతో గొడ్డుచాకిరీ చేయించుకునే సంస్థలు పెరిగి΄ోయాయి.స్మార్ట్‌వర్క్‌ను ప్రోత్సహించాలిఎక్కువ గంటలు పని చేయడం ఉద్యోగి డెడికేషన్ కు ఏమాత్రం కొలమానం కాదన్న విషయాన్ని సంస్థలు గుర్తించాలి. వర్కింగ్ కండిషన్స్ ఏమాత్రం సానుకూలంగా లేని చోట హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ‘నో’ చెప్పడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇన్ని గంటలు ఇంత పనే చేయగలం అని చె΄్పాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉండాలంటే మొహమాటాలను పక్కన పెట్టి నో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.ఫ్యాక్టరీస్ చట్టం 1948, మైన్స్ చట్టం, బీడీ– సిగార్ కార్మికుల చట్టం మొదలగు చట్టాల కింద ప్రత్యేక సందర్భాలలో తప్ప ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే స్త్రీలు పని చేయాల్సి ఉంటుంది. ఈ పని వేళలు దాటి రాత్రి 10 వరకు పనిచేయాలి అంటే సదరు యాజమాన్యం ప్రత్యేకమైన వసతులు; రక్షణ, రవాణా వంటివి కల్పించాల్సి ఉంటుంది. అయితే ఈ పని వేళలు సాఫ్ట్వేర్ రంగానికి కూడా వర్తించినప్పటికీ, కొన్ని వెసులుబాటులను ప్రభుత్వం ఐటీ రంగానికి కల్పించింది. అయినప్పటికీ స్త్రీలను రాత్రి వేళలో పనిచేయాలి అని ఏ యాజమాన్యం కూడా ఒత్తిడి చేయడానికి వీలులేదు. ఒకవేళ అలా పని చేయాల్సి వస్తే రవాణా, చిన్నపిల్లల సౌకర్యార్థం (క్రెచ్) సదుపాయాలు కల్పించాల్సి వుంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిస్త్రీలకు పిల్లల పెంపకం, ఇంటి పని భారం, ఉద్యోగ భారం... ట్రిపుల్ బర్డన్ కలిగిస్తున్నాయి. ఇంటిని చూసుకోవాలి... సంపాదించాలి... అంటే రెండు చోట్లా ఆమె ఉత్పాదనను పరీక్షకు పెడుతున్నట్టే లెక్క. ఈ రెండు పనులు ఆమెకు సౌకర్యంగా లేక΄ోతే శారీరకంగా మానసికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. మానసికంగా యాంగ్జయిటీ, డిప్రెషన్ చూస్తున్నాం. ఇక ఎముకల బలం క్షీణించడం, బహిష్టు సమస్యలు... కనపడుతున్నాయి. కొందరిలో ఇన్ఫెర్టిలిటీ పెరుగుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయమే ఈ పరిస్థితి నుంచి స్త్రీలను బయటపడేయగలదు.– డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్– ఫణికుమార్ అనంతోజు, సాక్షి -
త్వరలో కొత్త కార్మిక చట్టాలు: ఉద్యోగుల జీతాల్లో వచ్చే మార్పులు ఇవే?
ఉద్యోగులకు శుభవార్త. పని-జీవిత సమతుల్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో పలు మార్పులు చేస్తూ.. వాటిని అమల్లోకి తెచ్చేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే లీవ్‌ల విషయంలో ఉద్యోగులు మరింత లబ్ధి పొందనున్నారు. 30 రోజులకు మించి సెలవుల్ని (leave) క్లయిమ్ చేయకపోతే ఉద్యోగులకు కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని మార్పులు చేసిన కార్మిక చట్టంలో ఉంది. కేంద్రం గత ఏడాది వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్ పేరుతో రూపొందించింది. నాలుగు కోడ్లకు పార్లమెంట్లో సైతం ఆమోదం పొందింది. అయితే, అవి ఇంకా అమల్లోకి రాలేదు. చట్టాల అమలు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ తరుణంలో ఉద్యోగుల సెలవుల్ని ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. అయితే లేబర్ కోడ్లలో మార్పులకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. ఉద్యోగులకు ఉపయోగమే ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ 2020 ప్రకారం.. లీవ్ బ్యాలెన్స్ 30 దాటితే అదనపు సెలవులను కార్మికులు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఈ ఎన్‌క్యాష్ అనేది ప్రతి ఏడాది క్యాలెండర్ ఇయర్ చివరిలో జరుగుతుంది. లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌లు వినియోగించుకోకపోతే నిర్విర్యం కావు. వాటిని మరుసటి ఏడాదికి పొడిగించుకోవచ్చు. లేదంటే ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. కానీ సంస్థలు వార్షిక (ఏడాది annual) ప్రాతిపదికన లీవ్ ఎన్‌క్యాష్ చేసుకునేందుకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో కేంద్రం మార్పులు చేసిన కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది. లీవ్ ఎన్ క్యాష్మెంట్ అంటే? కార్మిక చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం నిర్దిష్ట సంఖ్యలో సంస్థలు ఉద్యోగులకు లీవ్‌లు ఇస్తుంటాయి. సంస్థలు అందించే మొత్తం లీవ్‌లను ఉద్యోగులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు మరుసటి ఏడాది లీవ్‌లను వినియోగించేలా పొడిగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. తన చట్టబద్ధమైన సెలవులను ఉపయోగించుకోని (ప్రైవేట్) ఉద్యోగులు.. ఆ సెలవులకు బదులుగా ఆ మేరకు నగదును పొందడాన్నే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) అంటారు. న్యాయ వాద నిపుణులు ఏమంటున్నారు? అయితే, కార్మిక చట్టాల్లోని మార్పులపై న్యాయవాద నిపుణులు స్పందిస్తున్నారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 32 (ఓఎస్‌హెచ్ కోడ్) సెక్షన్ 2020లో వార్షిక సెలవులు పొందడం, క్యారీ ఫార్వర్డ్, ఎన్‌క్యాష్ ఇలా సంబంధించి అనేక షరతులు ఉన్నాయి. సెక్షన్ 32(30) ప్రకారం ఒక ఉద్యోగి గరిష్టంగా 30 రోజుల వరకు వార్షిక సెలవులను మరుసటి ఏడాదికి ట్రాన్స్ఫర్ (క్యారీ ఫార్వర్డ్) చేసుకోవచ్చు. క్యాలెండర్ ఇయర్ చివరిలో వార్షిక సెలవుల బ్యాలెన్స్ 30 దాటితే, ఉద్యోగి అదనపు సెలవులను ఎన్ క్యాష్ చేసుకోవడానికి లేదంటే మరో ఏడాదికి పొడిగించుకోవడానికి అర్హత ఉందని ప్రముఖ న్యాయ సంస్థ ఇండస్‌లా ప్రతినిధి సౌమ్య కుమార్ తెలిపారు. కొత్త కార్మిక చట్టాల్ని రూపొందించింది.. కానీ గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం 4 కొత్తగా కార్మిక చట్టాల్ని రూపొందించింది. వాటిల్లో కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్లుగా మార్చింది. ఇందులో నాలుగు చట్టాలను వేతన కోడ్, 9 చట్టాలను సోషల్ సెక్యూరిటీ కోడ్, 13 చట్టాలను ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్, మరో 3 చట్టాలను ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లుగా రూపొందించింది. వాటిని జులై 01, 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తాయి. ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. -
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
అత్యవసర సేవలపై సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్‌పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. -
కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక(లేబర్ కోడ్స్) చట్టాల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొత్త లేబర్ కోడ్స్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయకపోవడమే ఈ వాయిదాకు కారణం. దీనితో ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావు. అంటే ఉద్యోగుల టేక్-హోమ్ పే, కంపెనీల ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే, ఈ కొత్త నాలుగు కార్మిక చట్టాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని గతంలోనే కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ కొత్త వేతనాల కోడ్ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చేవి. రాజ్యాంగ ప్రకారం కార్మికుల అంశం అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొత్త లేబర్ కోడ్స్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో దీనికి కేంద్రం తాత్కాలిక వాయిదా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. ఒకవేళ ఏప్రిల్ 1 నుంచి కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చి ఉంటే.. ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ, యాజమాన్యాల ప్రావిడెంట్ ఫండ్ వాటా పెరిగేది. లేబర్ కోడ్ల అమలు వాయిదా పడటం వల్ల మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే శాలరీని అందుకోవాల్సి ఉంటుంది. చదవండి: భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్! వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా? -
‘ఆ రెండు బిల్లులు ఉపసంహరించుకోవాలి’
సాక్షి, విజయవాడ : కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ధర్నా చౌక్‌లో అల్ ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫుర్ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా పార్లమెంట్లో బిల్లులను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. 17 కార్మిక చట్టాలను రెండు లేబర్ కోడ్లుగా మార్చిందని, దీని వల్ల 13 కార్మిక చట్టాలు రద్దవుతాయని తెలిపారు. ఇది కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా రెండో చట్టమైన వేతనాల చట్టం వల్ల నాలుగు కార్మిక చట్టాలు రద్దు అవుతాయని అన్నారు. ఈ రెండు బిల్లులు దేశంలోని 40 కోట్ల మంది కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ఈ రెండు బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
కార్మిక చట్టాలను తొలగించే కుట్రలను ఆపాలి
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పారిశ్రామికవాడ(కొత్తూరు) : కార్మికచట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చే ప్రక్రియను వెంటనే ఆపాలని, లేని పక్షంలో కార్మికుల పోరాటంతో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రం సమీపంలోని పారిశ్రామికవాడ సమీపంలో గురువారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదల అభివద్ధి లేదన్నారు. కేవలం ధనవంతులు మాత్రమే మరింతగా అభివద్ధి సాధించినట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పలు రంగాల్లోకి ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెను చేపట్టి మోదీకి గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఇండస్ట్రియల్ కమిటీ కన్వీనర్ పానుగంటి పర్వతాలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు బాల్‌రెడ్డి, ఎన్. రాజు, మండల కార్యదర్శి బాసా సాయిబాబా, నాయకులు మల్లేష్, శ్రీను, జంగయ్య, ర వీందర్, షకీల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాల్లో సంస్కరణలు: దత్తాత్రేయ
కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మికశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. కార్మికుల సంఘం ఇచ్చిన పది డిమాండ్లపై ఆయన చర్చించారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని దత్తాత్రేయ చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఏ చట్టాన్నీ మార్చబోమన్నారు. యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన చెప్పారు.