Bhupal
-
బ్యాచిలర్స్ హంగామా
భూపాల్, అరుణ్ హీరోలుగా డి. రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ’. బి.సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నటుడు శ్రీకాంత్ క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను సుధాకర్‌రెడ్డికి అందజేశారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘యువతకు మంచి వినోదాన్ని అందించే యాక్షన్ ఎంటర్టైనర్ మా బ్యాచిలర్ పార్టీ. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ హంగులు ఉన్నాయి. నటనకు ఆస్కారం ఉన్న చిత్రం ఇది. సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది’’అన్నారు. ‘‘కథ వినగానే ఎంతో నచ్చింది. యూత్ మెచ్చే చిత్రం ఇది. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు సుధాకర్‌రెడ్డి. నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. రమణారెడ్డి, బెనర్జీ, కార్తిక్, రియా, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అద్దంకి రాము కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. -
ఈ సినిమాను 13 మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు!
‘‘మా సినిమా టీజర్, ట్రైలర్ చూసినోళ్లు... ‘శవాన్ని రేప్ చేయడం ఏంటి? ఇదొక వల్గర్ సిన్మా’ అన్నారు. సినిమా చూస్తే... ఎక్కడా వల్గారిటీ కనపడదు. మాది యూత్ సినిమానే... బూతు సినిమా కాదు’’ అన్నారు ధనరాజ్. శ్రీ కిశోర్ దర్శకత్వంలో డి. వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన సినిమా ‘దేవిశ్రీ ప్రసాద్’. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం ముఖ్య తారలు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా గురించి ధనరాజ్ మాట్లాడుతూ– ‘‘ఇందులో మార్చురీ వ్యాన్ డ్రైవర్ ‘శ్రీ’ పాత్రలో నటించాను. ధనరాజ్ ఏ పాత్ర అయినా చేయగలడనే మంచి పేరొస్తుంది. ఈ సినిమా కథంతా ఆరు పాత్రల చుట్టూ తిరుగుతుంది. నటి లీలా రామచంద్రన్ పాత్రలో పూజారామచంద్రన్, దేవిగా భూపాల్, ప్రసాద్‌గా మనోజ్ నందం, ప్రధాన పాత్రలు చేశారు. పూజ కంటే ముందు 13 మంది హీరోయిన్లకు ఈ కథ చెబితే... రిజెక్ట్ చేశారు. మీ సినిమాలో నటించం అని చెప్పారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో, తక్కువ బడ్జెట్‌తో 20 రోజుల్లో సినిమా తీశాం. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌గారి పేరుని టైటిల్‌గా పెట్టినప్పటికీ... ఆ పేరుని మిస్ యూజ్ చేయలేదు’’ అన్నారు. -
డి ఫర్ డెవిల్!
దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడు డీయస్పీ గుర్తొస్తారు. కానీ, ఇప్పుడాయన పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. అలాగని, ఇదేదో మ్యూజికల్ బేస్డ్ సిన్మా కాదు. డి ఫర్ డెవిల్, ఎస్ ఫర్ సస్పెన్స్‌లతో తెరకెక్కిన పి ఫర్ పక్కా హారర్ థ్రిల్లర్. పూజా రామచంద్రన్, మనోజ్ నందన్, భూపాల్ ముఖ్య తారలుగా శ్రీ కిశోర్ దర్శకత్వంలో ఆర్వీ రాజు, ఆక్రోశ్ నిర్మించిన థ్రిల్లర్ ‘దేవిశ్రీ ప్రసాద్’. ధనరాజ్ కీలక పాత్రధారి. అక్టోబర్‌లో సిన్మాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘వినోదంతో పాటు సందేశంతో రూపొందిన చిత్రమిది. దేవి, శ్రీ, ప్రసాద్... అనే ముగ్గురు నటులు, లీలా రామచంద్రన్ అనే నటి చుట్టూ కథ నడుస్తుంది. సిన్మాలో ప్రతి సీన్ ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
కార్మిక చట్టాలను తొలగించే కుట్రలను ఆపాలి
– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ పారిశ్రామికవాడ(కొత్తూరు) : కార్మికచట్టాలను సవరించి యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చే ప్రక్రియను వెంటనే ఆపాలని, లేని పక్షంలో కార్మికుల పోరాటంతో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రం సమీపంలోని పారిశ్రామికవాడ సమీపంలో గురువారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పేదల అభివద్ధి లేదన్నారు. కేవలం ధనవంతులు మాత్రమే మరింతగా అభివద్ధి సాధించినట్లు తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పలు రంగాల్లోకి ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెను చేపట్టి మోదీకి గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఇండస్ట్రియల్ కమిటీ కన్వీనర్ పానుగంటి పర్వతాలు, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు బాల్‌రెడ్డి, ఎన్. రాజు, మండల కార్యదర్శి బాసా సాయిబాబా, నాయకులు మల్లేష్, శ్రీను, జంగయ్య, ర వీందర్, షకీల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి 108 ఉద్యోగుల దీక్షలు
సాక్షి, హైదరాబాద్: జీవీకే యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా గురువారం నుంచి స్థానిక ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు భూపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ, జీవీకే యాజమాన్యం గానీ పట్టించుకోలేదని, అందుకే నిరాహార దీక్షలు చేపడుతున్నామని వివరించారు.