తొలి సన్నివేశానికి క్లాప్ ఇస్తున్న శ్రీకాంత్
భూపాల్, అరుణ్ హీరోలుగా డి. రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ’. బి.సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నటుడు శ్రీకాంత్ క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను సుధాకర్‌రెడ్డికి అందజేశారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘యువతకు మంచి వినోదాన్ని అందించే యాక్షన్ ఎంటర్‌టైనర్ మా బ్యాచిలర్ పార్టీ. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ హంగులు ఉన్నాయి.
నటనకు ఆస్కారం ఉన్న చిత్రం ఇది. సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది’’అన్నారు. ‘‘కథ వినగానే ఎంతో నచ్చింది. యూత్ మెచ్చే చిత్రం ఇది. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు సుధాకర్‌రెడ్డి. నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. రమణారెడ్డి, బెనర్జీ, కార్తిక్, రియా, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అద్దంకి రాము కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment