గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమరేశ్వర్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
ఆలంపల్లి, న్యూస్‌లైన్:
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమరేశ్వర్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. గ్రామ రెవె న్యూ సహాయకుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ గు రువారం వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీసీఎల్ ఏ సిఫార్సు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ వర్తింపజేయాలని కోరారు. 60 సంవత్సరాలు దాటితే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. గ్రామ కార్యదర్శులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 39 జీఓ ప్రకారం 5సంవత్సరాలు పూర్తిచేసుకుని టెన్త్ పాస్ అయిన గ్రామ సహాయకుల ను వీఆర్‌ఓలుగా ప్రమోషన్ ఇ వ్వాలని డిమాండ్ చేశారు.
పీఆర్‌సీని వర్తిం పజేసి హెల్త్ కార్డులు అందించాలని కోరారు. సమస్యల పరి ష్కారం కోసం ఈ నెల 6,7 తేదీ ల్లో వికారాబాద్ సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు, 9న కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు తెలి పారు. అనంతరం సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నా యకులు వెంకటేష్, మల్లేష్,నాగయ్య, పాపయ్య, అంజమ్మ, అనసూజ, సరోజ, నాగయ్య, నర్సింహులు, రవీందర్ పాల్గొన్నారు.