అధికారులు తమను అకారణంగా వేధిస్తున్నారంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సో మవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కారు. సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అధికారులు వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోపలికి చొచ్చుకుపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని నిలువరించడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
అధికారులు తమను అకారణంగా వేధిస్తున్నారంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సో మవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ముందుగల గేటు వద్దే కార్యకర్తలను పోలీసులు నిలువరించారు.దీంతో పోలీసులకు, సీఐటీయూ నాయకులు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో అంగన్ వాడీ కార్యకర్తలు ఒక్కసారి కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లడానికి యత్నించడంతో పోలీసులు గేటులోపల ట్రాక్టర్‌ను అడ్డుపెట్టి లోపలికి రా కుండా నిలువరించారు.మరికొంత మంది అంగన్‌వాడీలు కోర్టు ఎదుట రాస్తారోకో చేపట్టారు.దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కలెక్టర్ ఐదుగురికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో సీఐటీయూ నాయకులు వెళ్లారు. ఇటీవల అంగన్ వాడీలను సస్పెండ్ చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అది తమ పాలన పరమైన సమస్య అని దానిలో నాయకుల జోక్యం అవసరంలేదని కలెక్టర్ వారికి సూచించారు.అనంతరం సీఐటీయూ నాయకులు అంగన్‌వాడీ సమస్యలపై వివరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాలని కోరారు. జిల్లాలో వివిధ కారణాలతో ఐదుగురు కార్యకర్తలపై వేసిన సస్పెన్షన్‌ను తొలగించాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 3-5 ఏళ్లలోపు పిల్లలకు అడ్మిషన్ ఇవ్వకుండా అంగన్‌వాడీ కేం ద్రాలకు పంపేలా ఆదేశించాలని కోరారు. స్థానిక అధికారుల వేధింపులను అడ్డుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు సిద్ధిరాములు,గంగాధర్, గోవర్ధన్, వెంకటేష్,ఝాన్సీ,భారతి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.