కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాజారావు అన్నారు.
జ్యోతినగర్: కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాజారావు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు గేటు వద్ద నిర్వహించిన కార్మిక పోరుబాట, బస్సుయాత్రలో భాగంగా రాజారావు మాట్లాడారు. కనీస వేతనాలు చెల్లించే వరకూ కార్మికులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులపైనే సమాజం ఆధారపడి ఉందన్నారు.