హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు డిచ్‌పల్లి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒక రోజు రిలే నిరాహార దీక్షకు దిగారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు.