నల్లగొండ టౌన్ : దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్ కోరారు. మంగళవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్‌లో జజరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా దారాదత్తం చేసేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు, పౌర విమానయానం, రక్ష ణ, ఔషధ రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను తీసుకురావ డం దారుణమన్నారు. ప్రధాని మోదీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధంకావాలని ఆయన పిలుపునిచ్చారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ అంసఘటితరంగ కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక, ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరందాసు గోపి, మందడి సులోచన, చిన్నపాక ల క్ష్మీనారాయణ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కీసరి నర్సింహ్మ,రోషపతి, డబ్బికార్ మల్లేష్, రాధాక్రిష్ణ, పాండు, నారబోయిన శ్రీను, దోనూరి నర్సిరెడ్డి, వెం కటయ్య, యాదగిరిరావు, సత్తయ్య వరలక్ష్మి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించాలి
Published Wed, Jun 22 2016 8:09 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement