జిల్లాలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి
Published Wed, Nov 2 2016 6:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ఏలూరు(సెంట్రల్)ః
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా పశ్చిమగోదావరి జిల్లాలో బయోమోట్రిక్ పేరుతో వేధిస్తున్నారని ఎపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ఆరోపించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారని ఫలితంగా రోజుకు రూ. 20 నుండి 40 వరకు వారికి ఖర్చు అవుతుందన్నారు. రెండు పూటలా రెండు గంటలకు పైగా వారికి సమయం వృధా అవుతుందని ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టి పెట్టలేని పరిస్ధితిలో అంగన్‌వాడీలున్నారన్నారు. బయోమెట్రిక్ విధానానికి తమ యూనియన్ వ్యతిరేకం కాదని, ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఫ్రీ స్కూల్‌ను నిర్వహించేందుకు సమయం లేMýంండా ఇతర అదనపు పనులు కేటాయిస్తూ ప్రభుత్వాధికారులే అంగన్‌వాడీ కేంద్రాలను బలహీనపరుస్తున్నారని, ఎస్‌ఎంఎస్‌ల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ సూపర్‌వైజర్లు చేయాల్సిన పనులు సైతం వర్కర్లతోనే చేయిస్తూ తీవ్ర పనిభారం మోపుతున్నారని ఆమె ఆరోపించారు. అర్హత కలిగిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉన్న జిల్లా అధికారులు నిబంధనలు పాటించకుండా అన్యాయం చేస్తున్నారని, వేతనాల పెంపు సందర్భంగా రూ. 63ను ఇంక్రిమెంట్లో కోత విధించి అంగన్‌వాడీలపై సవిత తల్లి ప్రేమ కనబరిచారన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వాగ్ధానం చేసిన చంద్రబాబుకు ఆ వాగ్ధానం గుర్తు లేదా అని ప్రశ్నించారు. జిల్లాలోని తక్షణమే బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని, లేదా ఆయా కేంద్రాల్లోనే బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సుబ్బరావమ్మ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్, కె.విజయలక్ష్మి పాల్గొన్నారు.
Advertisement
Advertisement