కానూరు(పెనమలూరు)ః కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, దీనికి అందరి మద్దతు కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.సి.హెచ్.శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని కాంక్షిస్తూ కానూరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ కాశీం, యు.త్రిమూర్తి, వై.శ్రీనివాసరావు, పి.రామకోటేశ్వరరావు, ఆర్.సత్యనారాయణ, జి.రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఉయ్యూరు : సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం పెనమలూరు డివిజన్ అధ్యక్షుడు కోసూరి శివనాగేంద్రం కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సభల విజయవంతం కోరుతూ ఉయ్యూరులో గురువారం కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు రత్నం భాస్కరరావు, రాజేష్, కొండలు తదితరులు పాల్గొన్నారు.
కంకిపాడు : ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి నర్సింహారావు కోరారు. మైక్ ప్రచార జాతాను సంఘం కంకిపాడు డివిజన్ కార్యదర్శి ఎ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సీఐటీయూ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పీ.రంగారావు, నరేష్, బీ.శివశంకర్, నార్ని వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.