రాష్ట్రంలో కార్మిక చట్టాలను అణగదొక్కేందుకు చంద్రబాబు సర్కార్ పూనుకొందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ఆరోపించారు. నెల్లూరు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చేందుకు రెండు ప్రభుత్వాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలోని కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించి దేశ ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చే విధంగా ఉందన్నారు. నెల 26న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి విజయవాడలో పెద్ద ఎత్తున భహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.