కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ప్రసంగిస్తున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చైతన్య
మధ్యాహ్న భోజనం ఇస్కాన్‌కు ఇవ్వద్దు
Published Tue, Sep 20 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
– కలెక్టరేట్ ముట్టడి, ధర్నా, నినాదాలు
– వాగ్వాదం, తోపులాటలు, అరెస్టులు
చిత్తూరు కలెక్టరేట్ : మధ్యాహ్నభోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అప్పగించకూడదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.చైతన్య డిమాండ్ చేశారు. జిల్లాలోని మధ్యాహ్నభోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్ ప్రధాన గేట్లను మూసివేసి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. చైతన్య మాట్లాడుతూ మధ్యాహ్నభోజన పథకాన్ని ఇస్కాన్ సంస్థకు అందజేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ఉదయం ఎప్పుడో చేసిన భోజనాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డిస్తుండటంతో జ్వరాల బారిన పడుతున్నారన్నారు. జిల్లా అధికారులు ఇస్కాన్ సంస్థకు మధ్యాహ్నభోజన పథకాన్ని అప్పగించేందుకు రహస్య చర్యలు చేపడుతున్నారని ఆయన దుయ్యపట్టారు. ఈ పథకాన్ని ఇస్కాన్‌కు అప్పగిస్తే జిల్లా వ్యాప్తంగా 9వేల మంది మధ్యాహ్నభోజన కార్మికులు వీధినపడాల్సి వస్తుందన్నారు. 13 ఏళ్లుగా మధ్యాహ్నభోజన పథకాన్ని కార్మికులు అప్పులు చేసి నిర్విఘ్నంగా నిర్వహించారన్నారు. కార్మికులకు మధ్యాహ్నభోజన పథకాన్ని అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బహిర ంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. ఓ దశలో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కార్మికులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు తోపులాట జరిగింది. కొందరు మహిళా కార్మికులు కిందపడిపోయారు, దాదాపు 100 మంది కార్మికులను పోలీసులు అరెస్టుచేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాణి, మధ్యాహ్నభోజన పథకం కార్మిక నాయకులు అముద, మంజుల, విమల, సావిత్ర తదితరులు పాల్గొన్నారు.
–19సీటీఆర్ 18 –
Advertisement
Advertisement